రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాహుల్‌ను కోరిన సీఎం కిరణ్

Published at: 27-12-2013 19:08 PM

న్యూఢిల్లీ, డిసెంబర్ 27 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, విబజన వద్దని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కోరారు. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసిన అనంతరం ఆయన రాహుల్‌ను కలుసుకుని ప్రత్యేక సమావేశమై సమైక్యంపై చర్చించారు.

విభజన వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ 25 పేజీలతో కూడిన నివేదికను రాహుల్ గాంధీకి అందజేశారు. విభజన వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్‌కు తీరని నష్టం జరగనుందని, విభజన అంశం చిన్న సమస్యగా తీసుకుంటే రేపు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పూర్తిగా నష్టపోతుందని రాహుల్‌కు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వివరించారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్ విభజన అంశం సీడబ్ల్యూసీలో అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమని, పార్టీ పరంగా కూడా నిర్ణయం జరిగిపోయిందని, దీనిపై తాను ఎలాంటీ హామీ ఇవ్వలేనని కిరణ్‌కు తెలియజేశారు. ప్రస్తుతం సమైక్యంలోనే ఎన్నికలు జరుగుతాయి కాబట్టి, ఇంకా సమయం ఉంది కాబట్టి దీనిపై మరోసారి కలిసి చర్చిద్దామని కిరణ్‌కు రాహుల్ చెప్పారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు.

Today's e-Paper