టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వైవీబీ

Published at: 23-11-2013 08:18 AM

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
మాజీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్‌కు తెలుగుదేశం పార్టీలో హోదా పెరిగింది. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆయనను నియమిస్తూ చంద్రబాబు ఆదేశాలు జారీచేశారు. ఎమ్మెల్సీగా వ్యవహరిస్తూ, రాష్ట్రంలోని వర్తమాన విషయాలపై అనర్గళంగా మాట్లాడడంతో వైవీబీ కితాబులందుకున్నారు. టీవీ చర్చావేదికలతోపాటు వైఎస్ఆర్‌సీపీ, కాంగ్రెస్ పార్టీ నేతలపై దూకుడుగా చెలరేగి విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ కట్టడి చేసే వైవీబీ అధికార ప్రతినిధి పదవికి సరిపోతారని చంద్రబాబు భావించారు. ఇటీవలే మాజీ ఎమ్మెల్సీ అయిన రాజేంద్రప్రసాద్‌ను అధికార ప్రతినిధిగా ఉపయోగించుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. వైవీబీతో పాటు జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బొద్దులూరి రామారావు కుమారుడు బొద్దులూరి వెంకటేశ్వరరావుకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవి ఇచ్చారు. ఆయన ఇంతకు ముందు రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించేవారు.
 

Today's e-Paper