నియోజకవర్గం : అసెంబ్లీ

తాండూరు

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
రంగారెడ్డి
మొత్తం ఓటర్లు :
199726
పురుషులు :
97746
స్త్రీలు :
101969
ప్రస్తుత ఎమ్మెల్యే :
పైలట్ రోహిత్ రెడ్డి
ప్రస్తుత ఎంపీ :
కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

ఓట‌ర్లు

నియోజకవర్గం మొత్తం ఓటర్లు: 1,99,726
పురుషులు: 97,746
స్త్రీలు: 1,01,969
ఇతరులు: 11
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు: తాండూరు నియోజకవర్గంలో ముదిరాజ్‌లు, గొల్ల కురుమల ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మొత్తానికి బీసీ ప్రభావం అధికంగా ఉంది.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

నియోజకవర్గం పేరు: తాండూరు
రిజర్వేషన్‌: ఓపెన్‌
ఏ జిల్లాలో ఉంది: వికారాబాద్‌
నియోజకవర్గంలోని మండలాలు: తాండూరు, పెద్దేముల్‌, బషీరాబాద్‌, యాలాల
ఏ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉంది: చేవెళ్ల
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ పి.మహేందర్ రెడ్డి టీఆర్ఎస్ 2875
2014 పి.మహేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ ఎం.నారాయణరావు కాంగ్రెస్ 15982
2009 పి.మహేందర్‌రెడ్డి టీడీపీ ఎం.రమేష్ కాంగ్రెస్ 13203
2004 ఎం.నారాయణరావు కాంగ్రెస్‌ పి.మహేందర్‌రెడ్డి టీడీపీ 13554
1994 పి.మహేందర్‌రెడ్డి టీడీపీ నారాయణరావు కాంగ్రెస్ 10191
1989 ఎం.చంద్రశేఖర్‌ కాంగ్రెస్‌(ఐ) పసారాం శాంత్‌కుమార్ టీడీపీ 10663
1985 ఎం.చంద్రశేఖర్‌ కాంగ్రెస్‌(ఐ) సిగిరిపేట్‌ బాలప్ప టీడీపీ 14203
1983 ఎం.మాణిక్‌రావు కాంగ్రెస్‌(ఐ) ఎస్‌.సాయిరెడ్డి ఇండిపెండెంట్ 18321
1978 ఎం.మాణిక్‌రావు కాంగ్రెస్‌(ఐ) ఎస్‌.సాయిరెడ్డి జనతాపార్టీ 18794
1972 ఎం.మాణిక్‌రావు కాంగ్రెస్‌ 0 0 0
1967 మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్‌ బి.వి.రావు ఇండిపెండెంట్ 18403
1962 మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్‌ చంద్రశేఖర్‌ ఇండిపెండెంట్ 256

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

తాండూరు నియోజకవర్గంలో జిల్లాలోనే మధ్యతరహా అతి పెద్ద ఇరిగేషన్‌ ప్రాజెక్టుగా కోట్‌పల్లి ప్రాజెక్టు ఉంది. తాండూరు మండలంలో ప్రభుత్వ రంగ సిమెంటు కర్మాగారం, నాపరాతి గనులు, ప్రైవేటు సిమెంటు కర్మాగారాలు విస్తరించి ఉన్నాయి. పెద్దేముల్‌ మండలంలో సుద్ధ గనులు, ఎర్రమట్టి విస్తరించి ఉన్నాయి.

అభివృద్ధి ప‌థ‌కాలు

తాండూరు నియోజకవర్గంలో ప్రస్తుతం కాగ్నా నదిపై వంతెన నిర్మాణం, రూర్బన్‌ పథకం కింద తాండూరు మండలంలో రూ.2 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు, రూ.13కోట్ల వ్యయంతో శివసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం, రూ.16 కోట్లతో కాగ్నా బ్రిడ్జి నిర్మాణం, తాండూరు-వికారాబాద్‌ డబుల్‌ రోడ్డు పనులు జీవన్గి బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. తాండూరు పట్టణంలో అభివృద్ధి పనుల కోసం ఇటీవల రూ.25 కోట్లు  మంజూరయ్యాయి. తాండూరు పట్టణంలో 150 పడకల మాతా శిశు ఆరోగ్యకేంద్రాల పనులు పూర్తి దశకు చేరుకున్నాయి. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, మైనార్టీ రెసిడెన్షియల్‌ భవనం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం నిర్మాణ దశలో ఉంది. తాండూరు మండల పరిధిలో రూ.3 కోట్లతో మోడల్‌ స్కూల్‌ భవన నిర్మాణం పూర్తయింది. జినుగుర్తి వద్ద వృత్తి నైపుణ్య భవన నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. తాండూరు నియోజకవర్గంలో కొత్తగా సబ్‌ స్టేషన్ల నిర్మాణం, విద్యుత్‌ ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. 

పెండింగ్ ప్రాజెక్టులు

తాండూరు బైపాస్‌ రోడ్డు కోసం రూ.100 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ పనులకు సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి కావడం జరిగింది. పనులు త్వరితంగా ప్రారంభించేందుకు మంత్రి మహేందర్‌రెడ్డి కృషి చేస్తున్నారు. తాండూరు పట్టణంలో ట్రామా కేర్‌ సెంటర్‌ నిర్మాణం పూర్తి కావడం జరిగింది. పోస్టుల మంజూరు కాగానే రోగులకు అందుబాటులో రానున్నది. తాండూరు పట్టణంలోని ఫోర్‌లేన్‌ రోడ్డు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాండూరు పట్టణం గొల్ల చెరువులో మినీ ట్యాంక్‌బండ్‌ నిర్మాణం కోసం ప్రభుత్వం జీవో జారీ చేసింది.

ముఖ్య ప్రాంతాలు

తాండూరు నియోజకవర్గంలో అంతారం సమీపంలో భూకైలాస్‌ పేరిట(ప్రైవేటు) చారిత్రక నిర్మాణం ఉంది. ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. పెద్దేముల్‌ మండలం కోట్‌పల్లిలో ఇరిగేషన్‌ ప్రాజెక్టు పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది. అధికంగా ఈ ప్రాంతానికి హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల పర్యాటకులు వస్తుంటారు. సినిమాల షూటింగ్‌లు కూడా ఇక్కడ నిర్వహిస్తుంటారు. నీళ్లపల్లి ఏకాంబర రామలింగేశ్వరాలయం ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలన్న ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.

ఇతర ముఖ్యాంశాలు

తాండూరు నియోజకవర్గం కర్ణాటక సరిహద్దు కావడంతో కన్నడ భాష మాట్లాడేవారు అధికంగా ఉంటారు. కన్నడ సంస్కృతి, సంప్రదాయాలు ఈ ప్రాంతంలో అధికంగా ఉన్నాయి. నాపరాతి, సిమెంటు కర్మాగారాల్లో పనిచేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి కార్మికులు వలస వస్తుంటారు.

వీడియోస్

ADVT