నియోజకవర్గం : అసెంబ్లీ

పరిగి

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
రంగారెడ్డి
మొత్తం ఓటర్లు :
225925
పురుషులు :
115450
స్త్రీలు :
110460
ప్రస్తుత ఎమ్మెల్యే :
కె.మహేశ్వర్ రెడ్డి
ప్రస్తుత ఎంపీ :
కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 2,25,925
పురుషులు: 1,15,450
మహిళలు: 1,10,460
ఇతరులు: 15
 
నియోజకవర్గ జనాభా వివరాలు: పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధానంగా బీసీ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. 58 శాతం వరకు బీసీ ఓటర్లు ఉంటారు. ఇందులో ప్రధానంగా ముదిరాజ్‌ల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. దాదాపుగా 60 వేల వరకు ముదిరాజ్‌ల ఓట్లు ఉంటాయి. అభ్యర్థి గెలుపు, ఓటమిలలో ముదిరాజ్‌ల పాత్ర కీలకంగా ఉంటుంది. ఆ తర్వాత యాదవుల స్థానం ఉంటుంది. ఈ రెండు కులాలను ఏకతాటిపైకి తీసుకవస్తే ఏ అభ్యర్థిని రంగంలో దింపినా విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఎస్సీలు, గిరిజనులు కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. గిరిజన వర్గాలు పరిగిలో చైతన్యవంతులై ఉన్నారు. పరిగి నుంచి ఏ రాజకీయ పార్టీ అయినా బీసీ అభ్యర్థిని రంగంలో దింపితే విజయం సాధించే అవకాశం మెండుగా ఉంటుంది.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

నియోజకవర్గం పేరు: పరిగి
రిజర్వేషన్‌: జనరల్‌
జిల్లా: వికారాబాద్‌
మండలలాలు: పరిగి, దోమ, కులకచర్ల, పూడూరు, గండీడ్‌
(గండీడ్‌, కులకచర్లలోని ఐదు పంచాయతీలు మహబూబ్‌నగర్‌జిల్లాలో కలిశాయి.)
లోక్‌సభ నియోజకవర్గం: చేవెళ్ళ
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 కె.మహేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ టి.రామ్మోహన్‌రెడ్డి కాంగ్రెస్ 15840
2014 టి.రామ్మోహన్‌రెడ్డి కాంగ్రెస్ కె.హరీశ్వర్‌రెడ్డి టీఆర్‌‌ఎస్ 5163
2009 కె.హరీశ్వర్‌రెడ్డి టీడీపీ టి.రామ్మోహన్‌రెడ్డి ఇండిపెండెంట్ 14444
2004 కె.హరీశ్వర్‌రెడ్డి టీడీపీ కమతం రాంరెడ్డి టీసీపీ 7648
1999 కె.హరీశ్వర్‌రెడ్డి టీడీపీ కమతం రాంరెడ్డి కాంగ్రెస్‌ 8616
1994 కె.హరీశ్వర్‌రెడ్డి టీడీపీ కమతం రాంరెడ్డి కాంగ్రెస్‌ 34516
1989 కె.రాంరెడ్డి కాంగ్రెస్‌ కె.హరీశ్వరెడ్డి టీడీపీ 4089
1985 కె.హరీశ్వర్‌రెడ్డి టీడీపీ అహ్మద్‌ షరీఫ్ కాంగ్రెస్ 32160
1983 అహ్మద్‌ షరీఫ్ కాంగ్రెస్ కె.హరీశ్వర్‌రెడ్డి ఇండిపెండెంట్ 85
1978 అహ్మద్‌ షరీఫ్ కాంగ్రెస్(ఐ) కె.రాంరెడ్డి కాంగ్రెస్ 8573
1972 కె.రాంరెడ్డి కాంగ్రెస్ ఎ.రెడ్డి ఇండిపెండెంట్ 12729
1967 కె.రాంరెడ్డి ఇండిపెండెంట్ అహ్మద్‌షరీఫ్ కాంగ్రెస్ 850
1962 ఎం.ఆర్‌.రెడ్డి కాంగ్రెస్ కె.సుదర్శనం ఇండిపెండెంట్ 6974
1957 కె.జె.రెడ్డి ఇండిపెండెంట్ వెంకటస్వామి కాంగ్రెస్ 4509

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

రాంపురం శైలేష్‌రెడ్డి: మీడియా రంగంలో ఉన్నతస్థాయికి ఎదిగారు. గండీడ్‌ మండలం జూలపల్లి గ్రామానికి చెందిన శైలేష్‌రెడ్డి ఉన్నత విద్యావంతులు. ఈనాడు, ఈటీవీ మీడియా రంగంలో ఢిల్లీ, హైదరాబాద్‌లో పనిచేశారు. పదేళ్ళపాటు జీ సంస్థకు రాష్ట్రానికి చీఫ్‌గా పని చేశారు. ఆ తర్వాత టీవీ-6 తదితర సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ నెట్‌వర్క్‌ అయిన మా ఛానల్‌కు సీఈవోగా పని చేస్తున్నారు. ఈయన పరిగి, మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ స్థానాలను ఆశిస్తున్నారు.
 
అముఖ శివకేశవ్‌ కూడా సీనియర్‌ జర్నలిస్ట్‌. గండీడ్‌ మండలం కొంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన శివకేశవ్‌ ఉన్నత విద్యావంతుడు. డాక్టరేట్‌ కూడా పొందారు. టీవీ9, జీన్యూస్‌, జి-24 గంటల ఛానల్లో సీనియర్‌ కరస్పాండెంట్‌గా పని చేశారు.  ఐ న్యూస్‌లో సీనియర్‌ న్యూస్‌ కో-ఆర్డినేటర్‌గా పని చేశారు. ప్రస్తుతం సొంత ఇన్ఫర్మేషన్‌, సర్వే నెట్‌వర్క్‌ ఏజెన్సీ పెట్టుకున్నారు. ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన శివకేశవ్‌ రాజకీయాల్లోకి రావాలని ఉన్నత స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల నేతలతో పరిఛయాలను ఏర్పరుచుకున్నారు. బీసీ ఎజెండాతో రాజకీయాల్లోకి రావాలని ప్రణాళికను సిద్దం చేసుకుంటున్నారు.

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

విండ్‌పవర్‌ ప్రాజెక్టు: వికారాబాద్‌ జిల్లా పరిగిలో ఉన్న ప్రాజెక్టును దేశంలోనే లేటేస్ట్‌ టెక్నాలజీతో స్థాపించారు. ఈ ప్రాజెక్టు నుంచి 100 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. సోలార్‌ విద్యుత్ ప్లాంట్లు కూడా భారీగానే స్థాపించారు. 40 మెగావాట్ల విద్యుత్‌‌ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులు ఉన్నాయి. పరిగిలో స్టీల్‌ ఉత్పత్తి చేసే మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇంకా పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. పౌల్ర్టీ పరిశ్రమలకు కేంద్రంగా మారుతోంది. సాగునీటి పరంగా పరిగి మండలంలో లక్నాపూర్‌ ప్రాజెక్టు ఉంది.

పెండింగ్ ప్రాజెక్టులు

పరిగిలో ప్రధానంగా విద్యారంగ సంస్థలు లేవు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలు కూడా లేవు. మండల కేంద్రాల్లో జూనియర్‌ కళాశాలలు లేవు. సాగునీటి వనరులు పెద్దగా లేవు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలి. సాగునీటి ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగితే పసిడి పంటలు పండే అవకాశం ఉంది.

ముఖ్య ప్రాంతాలు

కులకచర్ల మండలం పాంబండ రామలింగేశ్వర దేవాలయం. పరిగి మండలంలో లక్నాపూర్‌ ప్రాజెక్టు, పూడూరు మండలం దామగుండం శ్రీరామలింగేశ్వరదేవాలయం, రాకంచర్లలో లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం, కులకచర్ల మండలం ముజాహిద్‌పూర్‌లో కులీకుత్‌బ్‌షాకు సంబంధించి కోటలు ఉన్నాయి. వీటిని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది. పూడూరు మండలం రాకంచర్ల మామిడిపండ్లకు మంచి గుర్తింపు ఉంది.

ఇతర ముఖ్యాంశాలు

నాటి నుంచి నేటి వరకు పరిగి రాజకీయ ముఖచిత్రం
25 ఏళ్లు ఎమ్మెల్యేగా హరీశ్వర్‌ రికార్డు: పరిగి అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరుగగా, ఒక్కసారి మాత్రం ఏకగ్రీవం అయింది. 12 సార్లు జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులు పోటీ పడ్డారు. పూర్తిగా గ్రామీణ ప్రాంతమైన పరిగి నియోజకర్గంలోని ఓటర్లు ఎక్కువ సార్లు విలక్షణమైన రీతిలో తీర్పిచ్చారు. పరిగి అసెంబ్లీ స్థానం నుంచి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి ఐదుసార్లు విజయం సాధించి 25 ఏళ్లగా ఎమ్మెల్యేగా కొనసాగుతూ వచ్చారు. ఆయన ఎస్‌ఎఫ్‌సి చైర్మన్‌, డిప్యూటీ స్పీకర్‌, టీటీడీ బోర్డు డైరెక్టర్‌గా పని చేశారు.
కమతం రాంరెడ్డి: పరిగి నుంచి మూడు సార్లు ఎన్నికై పలుమార్లు మంత్రిపదవిని అలకంరించారు. ఆహ్మద్‌ షరీఫ్‌ రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా కొనసాగారు. ఎస్‌జే బేగం, రాందేవ్‌రెడ్డి, జగన్మోహన్‌రెడ్డిలు ఐదు సంవత్సరాల చొప్పున ఎమ్మెల్యేగా కొనసాగారు.

వీడియోస్

ADVT