నియోజకవర్గం : అసెంబ్లీ

మేడ్చల్‌

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
రంగారెడ్డి
మొత్తం ఓటర్లు :
485202
పురుషులు :
252873
స్త్రీలు :
232271
ప్రస్తుత ఎమ్మెల్యే :
చామకూర మల్లారెడ్డి
ప్రస్తుత ఎంపీ :

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 4,85,202
పురుషులు: 2,52,873
స్త్రీలు: 2,32,271
ఇతరులు:  58
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు: మేడ్చల్‌ నియోజకవర్గంలో బీసీ కులాలకు సంబంధించిన ఓటర్లు అధికంగా ఉన్నారు. జిల్లాలో ప్రధానంగా రెడ్డి, యాదవులు, గౌడ సామాజికవర్గం వారు కీలకంగా వ్యవహరించనున్నారు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

నియోజకవర్గం పేరు: మేడ్చల్‌
రిజర్వేషన్‌: ఎస్సీ/ఎస్టీ/ఓపెన్‌: జనరల్‌
ఏ జిల్లాలో ఉంది : మేడ్చల్‌మల్కాజ్‌గిరిజిల్లా
నియోజకవర్గంలో ఏయే మండలాలు ఉన్నాయి: మేడ్చల్‌, శామీర్‌పేట్‌, కీసర, ఘట్‌కేసర్‌, మేడిపల్లి, కాప్రా(జవహర్‌నగర్‌ మునిసిపాలిటీ)
ఏ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది: మల్కాజ్‌గిరి
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 చామకూర మల్లారెడ్డి టీఆర్ఎస్ కె.లక్ష్మారెడ్డి కాంగ్రెస్‌ 88069
2014 ఎం.సుధీర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ టి.జంగయ్య టీడీపీ 43455
2009 కె.లక్ష్మారెడ్డి కాంగ్రెస్‌ ఎన్‌.ప్రభాకర్‌గౌడ్‌ టీడీపీ 5570
2004 టి.దేవేందర్‌గౌడ్‌ టీడీపీ కె.సురేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ 25707
1999 టి.దేవేందర్‌గౌడ్‌ టీడీపీ ఎస్‌.హరివర్థన్‌రెడ్డి కాంగ్రెస్‌ 77883
1994 టి.దేవేందర్‌గౌడ్‌ టీడీపీ ఉమావెంకట్రాంరెడ్డి కాంగ్రెస్‌ 51474
1989 ఉమావెంకట్రాంరెడ్డి కాంగ్రెస్‌ కె.సురేందర్‌రెడ్డి టీడీపీ 20823
1985 కె.సురేందర్‌రెడ్డి టీడీపీ జి.సంజీవరెడ్డి కాంగ్రెస్‌ 24993
1983 ఉమావెంకట్రాంరెడ్డి కాంగ్రెస్‌ టి.ప్రతాప్‌రెడ్డి ఇండిపెండెంట్‌ 64
1978 మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్‌(ఐ) టి.మోహన్‌రెడ్డి జేఎన్‌పీ 23178
1972 సుమీత్రాదేవి కాంగ్రెస్‌ వేదప్రకాష్‌ ఇండిపెండెంట్‌ 18291
1967 ఎస్‌.దేవి కాంగ్రెస్‌ కె,ఆర్‌.అబ్బయ్య ఇండిపెండెంట్‌ 14441
1962 వి.రాంచందర్‌రావు ఇండిపెండెంట్‌ కె.వి.రంగారెడ్డి కాంగ్రెస్‌ 1761

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

ఘట్‌కేసర్‌లో ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఇన్ఫోసిస్‌, శామీర్‌పేట్‌ మండలంలో శాంతా బయోటిక్‌, బయోలజికల్‌ ఇ లిమిటెడ్‌ తదితర సంస్థలు ఉన్నాయి.

అభివృద్ధి ప‌థ‌కాలు

మిషన్‌భగీరథ పథకం కింద 104 గ్రామాలకు తాగునీరు అందించే జిల్లాలో రూ.294 కోట్లతో పనులు చేపట్టారు. 2015 డిసెంబర్‌ మొదటివారంలో పనులు ప్రారంభించారు. మొదటి దశలో 270 కిలోమీటర్ల పైపులైన్లకు రూ.160కోట్లు విడుదల చేసిన సర్కారు, రెండో దశలో గ్రామాల్లో 360 కిలోమీటర్ల అంతర్గత పైపులైన్ల నిర్మాణానికి రూ.74.75 కోట్లు విడుదల చేసింది.
 
2017 జనవరిలో ఆప్టికల్‌ కేబుల్‌ పనులకు రూ.1.41కోట్లు, అంతర్గత పైపులైన్ల నిర్మాణం కోసం రూ.13.25కోట్లు మంజూరుచేసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్‌భగీరథ పథకం కింద తాగునీరు అన్ని గ్రామాలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ నియోజకవర్గంలో నీటిని సరఫరా చేశారు. జిల్లాలో టీఎస్‌ ఐపాస్‌ ద్వారా రూ.17,778 కోట్లతో నూతనంగా 10,826 పరిశ్రమలు స్థాపించారు. రూ. 140కోట్లతో రోడ్డు, వంతెనలు నిర్మించారు. మిషన్‌కాకతీయ, తదితర అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 

పెండింగ్ ప్రాజెక్టులు

మేడ్చల్‌ నియోజకవర్గంలోని జవహర్‌నగర్‌లో గల డంపింగ్‌యార్డు ప్రజలకు ప్రాణసంకటంగా మారింది. నగరంలోని చెత్తంతా ఇక్కడికే తరలిస్తుండటంతో మేడ్చల్‌తో పాటు మల్కాజ్‌గిరి, ఉప్పల్‌ నియోజకవర్గాల ప్రజలు నిత్యం నరకాన్ని అనుభవిస్తున్నారు. కీసర, ఘట్‌కేసర్‌, శామీర్‌పేట్‌, కాప్రా మండలాల్లో భూగర్భజలాలు కలుషితమయ్యాయి. ఈ నీటినే తాగుతున్న జనాలు రోగాల భారిన పడుతున్నారు. చెరువుల్లోని నీరు తాగి మూగజీవాలు మృత్యువాతపడుతున్నాయి.
 
డంపిగ్‌యార్డు వెదజల్లుతోన్న కాలకూట విషంతో గాలి, నీరు కలుషితమై 20 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు నరకాన్ని అనుభవిస్తున్నారు. మూసీ కాలువల పునరుద్ధరణ పనులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. డంపింగ్‌యార్డును తరలించాలని కోరుతూ స్థానికులు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నారు. క్రషర్లతో స్థానిక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

ముఖ్య ప్రాంతాలు

మేడ్చల్‌ నియోజకవర్గంలో కీసరగుట్టలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని విష్ణుకుండిణిల కాలంలో నిర్మించారు. గుట్టపై అక్కన్న,మాదన్న రామాలయాల్ని నిర్మించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది కేసరగిరికి తరలివస్తారు. శామీర్‌పేట్‌ సమీపంలో రత్నాలయం ఉంది. శ్రీవెంకటేశ్వరుణ్ని దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు వస్తారు. జింకల పార్కు, ఎకో టూరిజం, హకీంపేట్‌లో స్టేట్‌ స్పొర్ట్స్‌ స్కూల్‌, హకీంపేట్‌ ఎయిర్‌పోర్టు, తదితర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. ప్రైవేట్‌కు చెందిన లియోనియో, సెలబ్రెటీ, అలంకృత, తదితర రిసార్ట్‌లు ఉన్నాయి.

ఇతర ముఖ్యాంశాలు

మేడ్చల్‌ నియోజకవర్గం నుంచి నియోజకవర్గాల పునర్విభజనతో ఐదు నియోజవర్గాలు ఏర్పడ్డాయి. వీటిలో కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, మల్కాజ్‌గిరి, ఉప్పల్‌ పూర్తిగా కాగా, శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొంత భాగంతో నూతనంగా ఏర్పడ్డాయి. నియోజకవర్గం నగరానికి చేరువలో ఉండటంతో జనాభా రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రభుత్వం కొత్తగా తూంకుంట, నాగారం, దమ్మాయిగూడ, ఘట్‌కేసర్‌, పోచారం, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశారు. కొత్తగా 13 గ్రామపంచాయతీలు ఏర్పడ్డాయి.

వీడియోస్

ADVT