నియోజకవర్గం : అసెంబ్లీ

ఇబ్రహీంపట్నం

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
రంగారెడ్డి
మొత్తం ఓటర్లు :
250291
పురుషులు :
128345
స్త్రీలు :
121925
ప్రస్తుత ఎమ్మెల్యే :
మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
ప్రస్తుత ఎంపీ :
బూర నర్సయ్య గౌడ్

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 2,50,291
పురుషులు: 1,28,345
స్త్రీలు: 1,21,925
ఇతరులు: 21

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

నియోజకవర్గ్గం పేరు: ఇబ్రహీంపట్నం
రిజర్వేషన్‌: జనరల్‌
జిల్లా: రంగారెడ్డి 
నియోజకవర్గ పరిధి:
మండలాలు: ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్ధుల్లాపూర్‌మెట్‌
మున్సిపాలిటీలు: ఇబ్రహీంపట్నం, పెద్దఅంబర్‌పేట్‌.
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఉన్న హయత్‌నగర్‌. 
లోక్‌సభ నియోజకవర్గం: భువనగిరి
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 మంచిరెడ్డి కిషన్‌రెడ్డి టీఆర్ఎస్ మల్‌రెడ్డి రాంరెడ్డి బీఎస్పీ 376
2014 మంచిరెడ్డి కిషన్‌రెడ్డి టీడీపీ మల్‌రెడ్డి రాంరెడ్డి ఇండిపెండెంట్ 11056
2009 మంచిరెడ్డి కిషన్‌రెడ్డి టీడీపీ మల్‌రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్‌ 9316
2004 మస్కు నర్సింహ సీపీఎం నర్రారవికుమార్‌ టీడీపీ 12807
1999 కొండ్రు పుష్పలీల టీడీపీ ఎ.జి.కృష్ణ కాంగ్రెస్‌ 45375
1994 కొండిగారి రాములు సీపీఎం కె.సత్యనారాయణ కాంగ్రెస్‌ 31358
1989 కొండిగారి రాములు సీపీఎం ఎ.జి.కృష్ణ కాంగ్రెస్‌ 45309
1985 కె.సత్యనారాయణ టీడీపీ ఎం.బి.సత్యనారాయణ కాంగ్రెస్‌ 22129
1983 ఎ.జి.కృష్ణ కాంగ్రెస్‌ కె.సత్యనారాయణ టీడీపీ 20438
1981 ఎ.జి.కృష్ణ కాంగ్రెస్‌ ఎ.ఆర్‌.డి.రాజు సీపీఐ 25206
1978 సుమిత్రాదేవి కాంగ్రెస్‌ కె.ఆర్‌.కృష్ణస్వామి జనతా 13899
1972 ఎన్‌.అనంతరెడ్డి కాంగ్రెస్‌ కె.కె.మూర్తి సీపీఎం 12810
1967 ఎం.ఎన్‌.లక్ష్మీనర్సయ్య కాంగ్రెస్‌ డి. మోహన్‌రెడ్డి ఇండిపెండెంట్ 15581
1962 ఎం.ఎన్‌.లక్ష్మీనర్సయ్య కాంగ్రెస్‌ కె.పి. రెడ్డి ఇండిపెండెంట్ 5374
1957 ఎం.ఎన్‌.లక్ష్మీనర్సయ్య కాంగ్రెస్‌ హెచ్‌. రెడ్డి పీడీఎఫ్‌ 8112

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

ఆదిభట్ల ఏరోస్పేస్‌ సెజ్‌లో టీసీఎస్‌, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌, టాటా లాకీడ్‌ మార్టీన్‌లు తమ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. హెలీకాఫ్టర్‌ విడి భాగాలు, క్యాబిన్‌, ఎయిర్ క్రాఫ్ట్‌ రెక్కలు మొదలైనవి ఇక్కడ తయారవుతున్నాయి. ఈ సంస్థల్లో సుమారు పది వేల మందికి పైగా ఉద్యోగులున్నారు. నిత్యం హైదరాబాద్‌ నుండి రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఇక రక్షణ సంస్థల్లో అత్యంత కీలకమైన దక్షిణాధి రాష్ట్రాల ఎన్‌ఎస్‌జీ శిక్షణా కేంద్రం ఇబ్రహీంపట్నంలో ఉంది. ఇక్కడే ఆక్టోపస్‌ శిక్షణా కేంద్రం, బీడీఎల్‌లు ఉన్నాయి.

అభివృద్ధి ప‌థ‌కాలు

రంగారెడ్డి కలెక్టరేట్‌ సముదాయం ఇబ్రహీంపట్నం మండల పరిధి కొంగర కలాన్‌లో నిర్మాణమవుతోంది. ప్రధాన రోడ్లను డబుల్‌ రోడ్లుగా విస్తరిస్తున్నారు. వీటిలో ఇబ్రహీంపట్నం- విజయవాడ రహదారిని కలుపుతూ తూప్రాన్‌పేట్‌ వరకు, మంచాల నుండి రంగాపూర్‌ వరకు, గున్‌గల్‌- లోయపల్లి, ఆగాపల్లి-రాచులూరు గేట్‌ వరకు నాగార్జునసాగర్‌- శ్రీశైౖలం ప్రధాన రహదారులను కలుపుతూ డబుల్‌ రోడ్లుగా పనులు కొనసాగుతున్నాయి.
 
ఇబ్రహీంపట్నంలో 1.25 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం నిర్మాణమవుతోంది. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలో ఒకటైన పోచారం-కర్నంగూడల మధ్య ఇబ్రహీంపట్నం చెరువుకు నీరొచ్చే పెద్ద కాలువపై 2.88 కోట్ల వ్యయంతో చేపట్టిన వంతెన నిర్మాణం పూర్తయింది. అలాగే బీఎన్‌రెడ్డి నగర్‌ నుండి ఇబ్రహీంపట్నం వరకు సాగర్‌ ప్రధాన రహదారిలో సెంట్రల్‌ లైటింగ్‌ కోసం 4.28 కోట్లు మంజూరైనాయి. ఇంటింటికీ నీరిచ్చే మిషన్‌ భగీరథ పనులు కొనసాగుతున్నాయి.
 
సాగునీటి కోసం ప్రయత్నాలు
వరుస కరువును ఎదుర్కొంటున్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి డిండి- శివన్నగూడ ప్రాజెక్టు ద్వారా సాగునీరు తీసుకువచ్చేందుకు కృషి జరుగుతోంది. ఇప్పటికే సర్వే పనులు పూర్తయినాయి. ఈ నియోజకవర్గంలో 60కి పైగా చెరువులను నింపుతూ 50 వేల ఎకరాలను సాగులోకి తేవాలని ప్రణాళికలో చేర్చుతున్నారు. రెండేళ్ల కాలంలో నీటిని తరలించాలనేది లక్ష్యంగా ఉంది. ఈ నీరు వస్తే గనుక ఇబ్రహీంపట్నం చెరువు పర్యాటకంగా రూపుదిద్దుకునే అవకాశాలున్నాయి.

వీడియోస్

ADVT