నియోజకవర్గం : అసెంబ్లీ

నాగార్జున సాగర్

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
నల్లగొండ
మొత్తం ఓటర్లు :
204545
పురుషులు :
101701
స్త్రీలు :
102840
ప్రస్తుత ఎమ్మెల్యే :
నోముల నర్సింహయ్య
ప్రస్తుత ఎంపీ :
గుత్తా సుఖేందర్ రెడ్డి

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 204545
పురుషులు: 101701
స్త్రీలు: 102840
ఇతరులు: 04
 
నియోజకవర్గంలో కీలకవర్గాలు: నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. అయినప్పటికీ రెడ్డి సామాజిక వర్గం నాయకులు ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. కేవలం 1999 ఎన్నికల్లో రామ్మూర్తియాదవ్‌ టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించి యాదవ సామాజిక వర్గ ఆధిపత్యాన్ని చాటుకున్నారు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

నియోజకవర్గం: నాగార్జున సాగర్‌
రిజర్వేషన్: ఓపెన్‌ కేటగిరి
ఏ జిల్లా: నల్లగొండ జిల్లా
నియోజకవర్గ పరిధిలో ఏఏ మండలాలు ఉన్నాయి: అనుముల, పెద్దవూర, నిడమనూరు, గుర్రంపోడు, త్రిపురారంలతో పాటు కొత్తగా ఏర్పడిన తిరుమలగిరి(సాగర్‌)
ఏ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉంది: నల్లగొండ 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 నోముల నర్సింహయ్య టీఆర్‌ఎస్ కె.జానారెడ్డి కాంగ్రెస్ 7774
2014 కె. జానారెడ్డి కాంగ్రెస్‌ ఎన్‌. నర్సింహయ్య టీఆర్‌ఎస్‌ 16558
2009 కె. జానారెడ్డి కాంగ్రెస్‌ తేర చిన్నపురెడ్డి టీడీపీ 6214
2004 కె. జానారెడ్డి కాంగ్రెస్‌ జి.రామ్మూర్తి టీడీపీ 28772
1999 కుందూరు జానారెడ్డి కాంగ్రెస్‌ జి. రామ్మూర్తి టీడీపీ 20644
1994 గుండెబోయిన రామ్మూర్తి టీడీపీ కె. జానారెడ్డి కాంగ్రెస్‌ 2621
1989 కుందూరు జానారెడ్డి కాంగ్రెస్‌ జి. పెదనర్సయ్య టీడీపీ 15069
1985 కుందూరు జానారెడ్డి టీడీపీ డిఆర్‌.నాయక్‌ కాంగ్రెస్‌ 28868
1983 కుందూరు జానారెడ్డి టీడీపీ ఎన్‌. రాములు కాంగ్రెస్‌ 6120
1978 ఎన్‌. రాములు కాంగ్రెస్ (ఐ) కె. జానారెడ్డి జనతా పార్టీ 16422
1972 ఎన్‌. రాములు కాంగ్రెస్‌ ఎం. ఆదిరెడ్డి స్వతంత్ర 13230
1967 నిమ్మల రాములు స్వతంత్ర ఎం. ఆదిరెడ్డి సీపీఎం 6342
1962 పి. పర్వతరెడ్డి సీపీఐ జి.ఎన్‌.రెడ్డి కాంగ్రెస్‌ 2309

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

కె.వి. సత్యనారాయణ: ఈయన ఎన్టీఆర్‌కు ముఖ్య అనుచరుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మండల వ్యవస్థ ఏర్పాటుకు మూల పురుషుడిగా పేరొందారు. మాజీ మంత్రి జానారెడ్డికి రాజకీయ గురువుగా పేరొందారు.
కె. వెంకటేశ్వరరావు: నియోజకవర్గంలో కె.విగా పిలుచుకొనే వెంకటేశ్వరరావు సాగునీటి రంగ నిపుణుడు. ఎన్‌ఎస్‌పీలో ఉద్యోగ విరమణ అనంతరం సాగునీటి వనరులపై తరచూ నియోజకవర్గంలో చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
గార్లపాటి ధన మల్లయ్య: రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పలు పర్యాయాలు పనిచేసిన ఆయన నియోజకవర్గంలో రైస్‌ ఇండస్ట్రీలను భారీగా నిర్వహిస్తున్నారు. వ్యాపారవేత్తగా కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులకు కుడిభుజంగా ఉన్నారు.

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

ఈ నియోజకవర్గంలోనే నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోన్ని ఐదు జిల్లాల పరిధిలో 22 లక్షల ఎకరాలకు సాగునీరందించే ఈ ప్రాజెక్టు ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. దీనికి సమీపంలోనే బుద్ధవనం ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ - నాగార్జునసాగర్‌ రహదారి వారగా 200 ఎకరాల విస్తీర్ణంలో బుద్ధవనాన్ని అభివృద్ధి పరచడం జరిగింది. ఇక్కడే నాట్కో పరిశ్రమ ఉంది. నియోజకవర్గంలోని పెద్దవూర మండలంలో సాగర్‌ వరదకాల్వకు నీరందించే ఎత్తిపోతలు ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. మరో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ఈ నియోజకవర్గంలోని త్రిపురారం మండలం పెద్దదేవులపల్లిలో ఉంది.

పెండింగ్ ప్రాజెక్టులు

నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌ కళాశాల లేకపోవడంతో నియోజకవర్గ పేద విద్యార్థులు మిర్యాలగూడ, నల్లగొండ పట్టణాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ సమస్య ప్రతి ఎన్నికల్లోనూ ఎన్నికల వాగ్ధానంగానే మిగిలి ఉండడం గమనార్హం. నియోజకవర్గంలోని సగం గ్రామాలకు కృష్ణా మంచినీరు అందడం లేదు. మిషన్‌ భగీరథ పూర్తయితేనే ఆ గ్రామాలకు తాగునీరు అందుతుంది. నియోజకవర్గంలోని నిడమనూరులో కోర్టును ఏర్పాటు చేయాలని ఎంతో కాలంగా డిమాండ్‌ ఉంది. కాగా రెండేళ్ల కిందట నిడమనూరులో జూనియర్‌ సివిల్‌ కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది.

ముఖ్య ప్రాంతాలు

చలకుర్తి నియోజకవర్గంగా ఉన్న ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌ పేరుమీద నియోజకవర్గాల పునర్విభజనలో నాగార్జునసాగర్‌ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. సాగర్‌ ప్రాజెక్టు పర్యాటక కేంద్రంగా, చారిత్రక ప్రదేశంగా పేరొందింది. దీనికి సమీపంలోనే బుద్ధవనాన్ని నెలకొల్పారు. నియోజకవర్గంలోని త్రిపురారం మండలం కంపాసాగర్‌లో ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఉంది.

వీడియోస్

ADVT