నియోజకవర్గం : అసెంబ్లీ

సిద్దిపేట

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
మెదక్
మొత్తం ఓటర్లు :
205802
పురుషులు :
102403
స్త్రీలు :
103385
ప్రస్తుత ఎమ్మెల్యే :
తన్నీరు హరీశ్ రావు
ప్రస్తుత ఎంపీ :
కొత్త ప్రభాకర్ రెడ్డి

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 2,05,802 
పురుషులు: 1,02,403
స్త్రీలు: 1,03,385
ఇతరులు:14
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు: ఓటర్లలో సుమారు 12.81 శాతం ముదిరాజ్‌‌లు, 11.43 శాతం మాదిగలు, 8.94 శాతం పద్మశాలీలు, 8.55 శాతం ముస్లింలు, 7.32 శాతం రెడ్డి కులస్తులున్నారని అంచనా. వైశ్యుల శాతం 4.09 శాతానికే పరిమితమైనా వారి ప్రభావం సిద్దిపేట పట్టణంలో అధికం.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

నియోజకవర్గం పేరు: సిద్దిపేట
రిజర్వేషన్‌: ఓపెన్‌
ఏ జిల్లాలో ఉంది: సిద్దిపేట(మెదక్)
నియోజకవర్గంలో ఏఏ మండలాలున్నాయి: సిద్దిపేట అర్బన్‌, సిద్దిపేట రూరల్‌, చిన్నకోడూరు, నంగునూరు
ఏ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది: మెదక్‌
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 టీ.హరీశ్‌రావు టీఆర్‌ఎస్‌ భవానీ రెడ్డి టీజేఎస్ 118699
2014 టీ.హరీశ్‌రావు టీఆర్‌ఎస్‌ తాడూరి శ్రీనివాస్‌గౌడ్‌ కాంగ్రెస్‌ 93354
2010 టీ.హరీశ్‌రావు టీఆర్‌ఎస్‌ తాడూరి శ్రీనివాస్‌గౌడ్‌ కాంగ్రెస్‌ 95858
2009 టీ.హరీశ్‌రావు టీఆర్‌ఎస్‌ భైరి అంజయ్య కాంగ్రెస్‌ 64014
2008 టీ.హరీష్‌రావు టీఆర్‌ఎస్‌ భైరి అంజయ్య కాంగ్రెస్‌ 58935
2004 కె.చంద్రశేఖర్‌రావు టీఆర్‌ఎస్‌ శ్రీనివాస్‌రెడ్డి టీడీపీ 44668
2004 టీ.హరీష్‌రావు టీఆర్‌ఎస్‌ చెరుకు ముత్యంరెడ్డి టీడీపీ 24875
2001 కె.చంద్రశేఖర్‌రావు టీఆర్‌ఎస్‌ శ్రీనివాస్‌రెడ్డి టీడీపీ 58712
1999 కె.చంద్రశేఖర్‌రావు టీడీపీ స్వామిచరన్‌ కాంగ్రెస్‌ 27556
1994 కె.చంద్రశేఖర్‌రావు టీడీపీ ఎ.మదన్‌మోహన్‌ కాంగ్రెస్‌ 27256
1989 కె.చంద్రశేఖర్‌రావు టీడీపీ ఎ.మదన్‌మోహన్‌ కాంగ్రెస్‌ 13186
1985 కె.చంద్రశేఖర్‌రావు టీడీపీ మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ 16156
1983 ఎ.మదన్‌మోహన్‌ కాంగ్రెస్‌ కె.చంద్రశేఖర్‌రావు టీడీపీ 879
1978 ఎ.మదన్‌మోహన్‌ కాంగ్రెస్‌ మహేందర్‌రెడ్డి 0 11475
1972 ఎ.మదన్‌మోహన్‌ కాంగ్రెస్‌ ఎస్‌.వెంకట్రావు స్వతంత్ర 17130
1967 వీబీ.రాజు కాంగ్రెస్‌ ఎ.గురువారెడ్డి సీపీఐ 11248
1962 సోమేశ్వర్‌రావు స్వతంత్ర పీవీ.రాజేశ్వర్‌రావు కాంగ్రెస్‌ 1485
1957 పీవీ.రాజేశ్వర్‌రావు కాంగ్రెస్‌ ఎ.గురువారెడ్డి సీపీఐ 3640
1952 ఎ.గురువారెడ్డి పీడీఎఫ్‌ 0 0 0

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

యాసాల బాలయ్య (ప్రముఖ బాతిక్‌ చిత్రకారులు): చిత్రకారునిగా జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందిన యాసాల బాలయ్య బాతిక్‌ చిత్రకారునిగా రాణించడంతో పేరే బాతిక్‌ బాలయ్యగా మారింది. సిద్దిపేట మండలం ఇబ్రహింపూర్‌లో నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయనకు బాల్యంలోనే చిత్రకళ పట్ల ఆసక్తి ఏర్పడింది. వారి చిత్రాలు దేశ విదేశాలలో కళాప్రియులను అలరిస్తున్నాయి. నిరంతర కళాపిపాసను సంతరించుకున్న ఆయన ప్రతి రోజూ చిత్రాలు వేయడానికే అంకితమవుతున్నారు. వారి కుంచె నుంచి జీవం పోసుకున్న ఎన్నో చిత్రాలు రాష్ట్రంలోని ప్రధాన తెలుగు వారపత్రికల ముఖ చిత్రాలుగా రూపుదిద్దుకున్నాయి. దేశంలో ఖ్యాతి చెందిన మళయాల మనోరమ పత్రిక బాలయ్య ‘గ్రామ దేవతలు’ చిత్రాన్ని వార్షిక సంచికలో ప్రత్యేకంగా ముద్రించి గౌరవించింది. కన్నడ పత్రిక ఉదయవాణి కోడి పందెం చిత్రాన్ని ప్రముఖంగా అచ్చువేసింది. నాలుగు దశాబ్దాల పాటు ఉపాధ్యాయునిగా పనిచేసిన ఆయన దేశంలోని ప్రధాన పట్టణాలతో పాటు అమెరికాలోని పలు గ్యాలరీలలో వన్‌మ్యాన్‌షోలు నిర్వహించారు.
 
రమేశ్‌లాల్‌ (పేరిణి నాట్యాచార్యులు): మొట్టమొదటి పేరిణి నృత్యకారునిగా ఆరంగేట్రం చేసిన గజిబింకార్‌ రమేశ్‌లాల్‌ వేయికి పైగా దేశ విదేశాలలో ప్రదర్శనలిచ్చి గుర్తింపు పొందారు. ఓ వైపు ప్రదర్శనలిస్తూనే మరో వైపు వందలాది మందికి నృత్య శిక్షణ ఇస్తున్నారు. సిద్దిపేట వాసిగా ఇక్కడ నృత్య కళాశాల ఏర్పాటు చేయాలన్న తపనతో ఉన్నారు. పెద్దగా ఇంగ్లీషు చదువు రాకున్నా వారు ప్రదర్శించే నృత్యం 14 దేశాలలో ప్రదర్శనలిచ్చేలా చేసింది. నృత్యకారుల్లో తెలంగాణ వారు తక్కువ. ఆంధ్ర ప్రాంతానికి చెందిన నృత్యకారుల చిన్న చూపును శిక్షణ పొందే కాలంలోనే అనుభవించిన ఆయన అనేక ఆటు పోట్లను ఎదుర్కొని గురువుల మన్ననలు పొందారు.

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

రంగనాయకసాగర్‌ 3 టీఎంసీల రిజర్వాయర్‌, అనంతగిరి 3.5 టీఎంసీల రిజర్వాయర్‌లు నిర్మాణంలో ఉన్నాయి. ప్రభుత్వ వైద్యకళాశాలలో 150 సీట్ల మంజూరుకు అఖిల భారత మెడికల్‌ కౌన్సిల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. త్వరలో ఇది ప్రారంభం కానున్నది. 700 కోట్ల రూపాయలతో అవసరమైన కళాశాల, ఆసుపత్రి భవనాలు నిర్మాణమవుతున్నాయి. ఇప్పటికే ఒక ఆసుపత్రి భవనం అందుబాటులోకి వచ్చింది.

అభివృద్ధి ప‌థ‌కాలు

సిద్దిపేటలో సుమారు 300 కోట్ల రూపాయల వ్యయంతో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 2000 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణం తుది దశకు చేరుకున్నది. కోమటి చెరువు మినీ ట్యాంక్‌బండ్‌ పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకున్నది. ఇక్కడ ఓపెన్‌ ఆడిటోరియం , ఓపెన్‌ జిమ్‌లు , బోట్లు, అడ్వెంచర్‌ పార్కు, పిల్లల ఆటసామాగ్రి, లవ్‌ సిద్దిపేట చిహ్నం మొదలైనవెన్నో ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో మిషన్‌ భగీరథ ప్రాజెక్టు నిర్మాణానికి సిద్దిపేట నియోజకవర్గం మంచినీటి పథకం మోడల్‌గా నిలిచింది. ప్రస్తుత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సిద్దిపేటకు ప్రాతినిద్యం వహిస్తున్న కాలంలోనే కేంద్ర ప్రభుత్వ నిధులతో 149 నివాస ప్రాంతాలకు తాగునీటి పథకాన్ని అమలు చేయించారు. కరీంనగర్‌ శివారులోని దిగువమానేరు నుంచి నీటిని ఎత్తయిన గుట్టపైకి ఎక్కించి ఒకే లిప్టులో సిద్దిపేటకు చేరేలా చేశారు. మిషన్‌ కాకతీయ మొదటి, రెండవ దశలు విజయవంతంగా నియోజకవర్గంలో అమలయ్యాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సిద్దిపేట నియోజకవర్గం అభివృద్ధి అనూహ్యంగా పుంజుకున్నది. పాసుపోర్టు కార్యాలయం ఏర్పాటైంది. విద్య, వైద్యం, విద్యుత్‌, రోడ్లు, భవనాలు తదితర అన్ని శాఖలలో అభివృద్ధి వేగవంతంగా జరుగుతోంది.

పెండింగ్ ప్రాజెక్టులు

దీర్ఘకాలిక సమస్యలు లేవు

ముఖ్య ప్రాంతాలు

కోమటి చెరువు మినీ ట్యాంక్‌బండ్, సిద్దిపేట మండలం పుల్లూరులోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయం

ఇతర ముఖ్యాంశాలు

రంగనాయక సాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణంలో భాగంగా 110 మీటర్ల లోతులో కొనసాగుతున్న అండర్‌ టన్నెల్‌ పనులను వేలాది మంది ఆసక్తిగా తిలకిస్తున్నారు.

వీడియోస్

ADVT