నియోజకవర్గం : అసెంబ్లీ

వర్ధన్న పేట

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
వరంగల్
మొత్తం ఓటర్లు :
220182
పురుషులు :
110247
స్త్రీలు :
109934
ప్రస్తుత ఎమ్మెల్యే :
అరూరి రమేష్‌
ప్రస్తుత ఎంపీ :
పసూనూరి దయాకర్

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 220182
పురుషులు: 110247
స్త్రీలు:109934
థర్డ్‌జెండర్స్‌: 1
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు: నియోజకవర్గంలో ఎస్సీ ఓట్ల తదుపరి ఎస్టీ ఓటర్లు గణనీయంగా ఉన్నారు. బీసీలలో ప్రధానంగా గౌడ, మున్నూరుకాపు, ముదిరాజు తదితర కులాల ప్రభావం ఉంటుంది.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

స్వాతంత్రం సిద్ధించిన అనంతరం 1957లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. నాటి నుంచి నేటి వరకు 13 పర్యాయాలు శాసనసభ ఎన్నికలు జరిగాయి. అందులో 8 పర్యాయాలు వెలమ సామాజిక వర్గానికి చెందిన నాయకులే ఎమ్మెల్యేలుగా సేవలిందించారు. 2009లో శాసనసభ పునర్విభజనలో భాగంగా జరిగిన రిజర్వేషన్ల మార్పులో ఎస్సీ రిజర్వుడు అయింది.
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 అరూరి రమేశ్ టీఆర్‌ఎస్ పి. దేవయ్య టీజేఎస్ 99240
2009 కొండేటి శ్రీధర్‌ కాంగ్రెస్‌ పార్టీ గుండె విజరామారావు టీఆర్‌ఎస్‌ 6584
2004 ఎర్రబెల్లి దయాకర్‌రావు టీడీపీ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జనతా 25094
1999 ఎర్రబెల్లి దయాకర్‌రావు టీడీపీ ఎర్రబెల్లి స్వర్ణ కాంగ్రెస్‌ 11583
1994 ఎర్రబెల్లి దయాకర్‌రావు టీడీపీ ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు కాంగ్రెస్‌ 22175
1989 తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు బీజేపీ ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు కాంగ్రెస్‌ 10066
1985 వన్నాల శ్రీరాములు బీజేపీ ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు కాంగ్రెస్‌ 13526
1983 మాచర్ల జగన్నాధం కాంగ్రెస్‌ పార్టీ వన్నాల శ్రీరాములు బీజేపీ 6272
1978 మాచర్ల జగన్నాధం జనతా పార్టీ టి పురుషోత్తమరావు కాంగ్రెస్‌ 3995
1972 టి పురుషోత్తమరావు స్వతంత్ర ఆరెల్లి బుచ్చయ్య కాంగ్రెస్‌ 990
1967 టీపీ రావు స్వతంత్ర పీయూ రెడ్డి కాంగ్రెస్‌ 9296
1962 కుందూరు లక్ష్మినర్సింహరెడ్డి స్వతంత్ర పెండ్యాల రాఘవరావు సీపీఐ 1445
1957 టి వెంకట్రాంనర్సయ్య కాంగ్రెస్‌ కక్కెరాల కాశీనాధ్‌ స్వతంత్ర 5874

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

వర్ధన్నపేట మండలంలోని దమ్మన్నపేట గ్రామానికి చెందిన కావటి నర్సింహరెడ్డి(కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌) జాతీయ స్థాయి కాంట్రాక్టర్‌గా ఎదిగారు. అదే గ్రామానికి చెందిన ఎనగందుల వరదారెడ్డి కేజీ నుంచి పీజీ వరకు, ఇంజనీరింగ్‌, ఫార్మసీ తదితర కళాశాలలు ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల పేరుతో తెలంగాణలోని పలు పట్టణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ఇదే మండలంలోని ల్యాబర్తి గ్రామానికి చెందిన ఎర్రబెల్లి తిరుమల్‌రావు హన్మకొండలో ఎస్‌వీఎస్‌ విద్యాసంస్థల అధిపతిగా ఉన్నారు. వీరికి పెద్దగా మండల ప్రజలతో సత్సంభందాలు లేవు.

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

నియోజకవర్గంలో ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు చెప్పుకోదగ్గవి లేవు.

అభివృద్ధి ప‌థ‌కాలు

నియోజకవర్గంలో ప్రధానంగా రోడ్ల అభివృద్ధి పనులు, ఆకేరు వాగుపై చెక్‌ డ్యాంల నిర్మాణానికి నిధుల మంజూరీ, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ లాంటి పధకాల నిర్మాణపు పనులు చురుకుగా సాగుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

పెద్దగా చెప్పుకోదగ్గవి లేవు.

ముఖ్య ప్రాంతాలు

నియోజకవర్గంలో ప్రధానంగా ఐనవోలు మండల కేంద్రంలో మల్లికార్జునస్వామి దేవాలయం, పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలో అన్నారం షరీఫ్‌ దర్గా, హసన్‌ పర్తి మండలంలో ఎర్రగట్టు వెంకటేశ్వర దేవాలయం, మడికొండలో రామలింగేశ్వరస్వామి దేవాలయం ఉన్నాయి.

ఇతర ముఖ్యాంశాలు

వర్ధన్నపేట నియోజకవర్గం వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాల పరిధిలో ఉండడంతో పాటు హసన్‌పర్తి, హన్మకొండ రూరల్‌ మండలాల నుంచి కొన్ని గ్రామాలు గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌లో విలీనమయ్యాయి. భౌగోళికంగా వర్ధన్నపేట నియోజకవర్గం నగరానికి నాలుగు దిశలా విస్తరించి గజిబిజిగా ఉండడంతో పలు అభివృధ్ది కార్యక్రమాల్లో సైతం అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

వీడియోస్

ADVT