నియోజకవర్గం : అసెంబ్లీ

వరంగల్ పశ్చిమ

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
వరంగల్
మొత్తం ఓటర్లు :
233326
పురుషులు :
117201
స్త్రీలు :
116112
ప్రస్తుత ఎమ్మెల్యే :
దాస్యం వినయ్‌భాస్కర్‌
ప్రస్తుత ఎంపీ :
పసూనూరి దయాకర్

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 233326
పురుషులు : 117201
స్త్రీలు : 116112
ఇతరులు : 13 
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు: బ్రాహ్మణ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వీరితో పాటు రెడ్డి వర్గం కీలకంగా ఉంది.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం పేరు అంతకు ముందు హన్మకొండగా ఉండింది. 2009లో హన్మకొండ నియోజకవర్గం రద్దయి ఆ స్థానమే వరంగల్‌ పశ్చిమగా అవతరించింది. 1957 తర్వాత నియోజకవర్గం లేదు. ధర్మసాగర్‌, హసన్‌పర్తి నియోజకవర్గాల్లో విలీనం అయింది. దీనితో 1957, 1962, 1967 1972 హన్మకొండ (వరంగల్‌ పశ్చిమ)లో ఎన్నికలు జరగలేదు. 1978లో మళ్లీ హన్మకొండగా ఏర్పాటయింది. అప్పటి నుంచి 2009 ఎన్నికల వరకు హన్మకొండ నియోజకవర్గంగా కొనసాగింది. ఆ తర్వాత రద్దయి వరంగల్‌ పశ్చిమ అయింది.
రిజర్వేషన్‌: ఓపెన్‌
నియోజకవర్గంలో ఏ మండలాలు ఉన్నాయి:
వరంగల్‌, హన్మకొండ, ఖిలా వరంగల్‌, కాజీపేట, ధర్మసాగర్‌, వేలేరు, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్‌, ఐనవోలు. హసన్‌పర్తి
ఏ లోకసభ నియోజకవర్గం పరిధిలో ఉంది: వరంగల్‌
 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 దాస్యం వినయ్ భాస్కర్ టీఆర్‌ఎస్ రేవూరి ప్రకాశ్ రెడ్డి టీడీపీ 36451
2014 డి. వినయ్‌భాస్కర్‌ టీఆర్‌ఎస్‌ కె దయాసాగర్‌రావు కాంగ్రెస్ 56304
2010 డి వినయ్‌భాస్కర్‌ (ఉ.ఎ) టీఆర్‌ఎస్‌ కె దయాసాగర్‌రావు కాంగ్రెస్ 67524
2009 డి. వినయ్‌భాస్కర్‌ టీఆర్‌ఎస్‌ కె దయాసాగర్‌రావు కాంగ్రెస్ 6684
2004 ఎం సత్యనారాయణ రెడ్డి టీఆర్‌ఎస్‌ వినయ్‌భాస్కర్‌ స్వతంత్ర 0
1999 ఎం ధర్మారావు బీజేపీ పివి రంగారావు కాంగ్రెస్ 0
1998 పివి రంగారావు(ఉ.ఎ) కాంగ్రెస్‌ ఎం. ధర్మారావు బీజేపీ 0
1994 డి. ప్రణయ్‌భాస్కర్‌ టీడీపీ పీవీ రంగారావు కాంగ్రెస్ 0
1989 పీవీ రంగారావు కాంగ్రెస్‌ డి. ప్రణయ్‌భాస్కర్‌ టీడీపీ 0
1985 వి. వెంకటేశ్వర్‌రావు టీడీపీ జి. ప్రసాదరావు కాంగ్రెస్ 0
1983 ఎస్‌ సత్యనారాయణ టీడీపీ టి. హయగ్రీవాచారి కాంగ్రెస్‌ ఐ 0
1978 టి.హయగ్రీవాచారి కాంగ్రెస్‌ ఐ పి ఉమారెడ్డి జనతా 0
1952 పెండ్యాల రాఘవరావు పిడీఎఫ్‌ బికె రెడ్డి కాంగ్రెస్ 0
1952 ఎస్‌బి రామనాథం(ఉప ఎన్నిక) పిడీఎఫ్‌ జెకెరావు కాంగ్రెస్ 0

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం జాక్‌ కన్వీనర్‌ పరిటాల సుబ్బారావు, టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు రాజేష్‌ కుమార్‌, సుబ్బారావు ఉద్యోగ సంఘ నేతగా సుపరిచితుడు. తెలంగాణ ఉద్యమ సమయంలో జాక్‌ అధ్యక్షుడిగా క్రియాశీల భూమిక పోషించారు. గత మూడు దశాబ్దాలుగా రాజకీయేతర రంగాల్లో క్రియాశీల భూమిక పోషిస్తున్నారు. రాజేశ్‌గౌడ్‌ కూడా ప్రజలకు ముఖ్యంగా ఉద్యోగులకు చిరపరిచితుడు. టీఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్న రాజేష్‌ గౌడ్‌ తెలంగాణ ఉద్యమం సందర్భంగా ముఖ్య భూమిక పోషించడం ద్వారా క్రీయాశీల నేతగా ఎదిగారు. ప్రముఖుల్లో ఒకరిగా నిలిచారు. రాజకీయేతర ప్రముఖుల్లో ఒకరిగా ఎదుగుతున్న మరొకరు కాంట్రాక్టర్‌ వేముల సత్యమూర్తి. ఈయన రాజకీయాలకు దూరంగా ఉన్నా ప్రజాప్రతినిధులందరితోనూ సత్సంబంధాలు కలిగి ఉన్నారు.

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

బాలవికాస అనే ప్రముఖ క్రిష్టియన్‌ స్వచ్ఛంద సంస్థ ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉంది. పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఈ సంస్థ పట్ల ప్రజల్లో మంచి పేరున్నది. గత మూడు దశాబ్దాలుగా ఈ సంస్థ సేవా రంగంలో క్రియాశీల భూమిక పోషిస్తోంది. నియోజకవర్గం పరిధిలో ప్రాజెక్టులేమీ లేవు.

అభివృద్ధి ప‌థ‌కాలు

సీఎం కేసీఆర్‌ వరంగల్‌ నగరంపై ప్రత్యేక దృష్టి సారించి ఏటా రూ.300 కోట్లు ప్రత్యేక నిధులుగా ఇస్తుండడం వల్ల నియోజవర్గంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వరంగల్‌ను స్మార్ట్‌సిటీగా ప్రకటించడం వల్ల ఇందులో భాగమైన పశ్చిమ నియోజకవర్గం కూడా లబ్ధిపొందుతోంది. స్మార్ట్‌ పనులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన పూర్తయింది. ఆమోదం కూడా పొందింది. ప్రాంతీయ రింగ్‌ రోడ్డు, అంతర్గత రింగ్‌ రోడ్ల నిర్మాణానికి పనులు మొదలయ్యాయి. నియోజకవర్గంలో హృదయ్‌ కింద పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అమృత్‌ పథకం కింద తాగునీటి సరఫరా మెరుగు పనులు జరుగుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

నియోజకవర్గంలో ఉన్న దీర్గకాలిక సమస్యలు ట్రాఫిక్‌, డ్రైనేజీ, అంతర్గత రోడ్లు.
స్మార్ట్‌ సిటీ పనుల కింద నియోజకవర్గంలో కాజీపేట నుంచి హన్మకొండ వరకు ప్రధాన రహదారి విస్తరణ జరుగుతోంది. రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ట్రాఫిక్‌ సమస్య పరిష్కారంలో భాగంగా నియోజకవర్గం మీదుగా రింగ్‌ రోడ్ల నిర్మాణం పనులు మొదలయ్యాయి.

ముఖ్య ప్రాంతాలు

నియోజవర్గం పర్యాటక ప్రాంతానికి ప్రసిద్ధి. హన్మకొండలో కాకతీయుల కాలం నాటి వేయిస్తంభాలగుడి, సిద్దేశ్వరాలయం, చాలుక్యుళ కాలం నాటి పద్మాక్షి దేవాలయం, జౌన తీర్థంకరుల విగ్రహాలు, ఆరామాలకు నిలయమైన అగ్గలయ్యగుట్ట, మడికొండలోని సుప్రసిద్ధ మెట్టు రామలింగేశ్వరాలయం తదితర పర్యాటక ప్రదేశాలు ఈ నియోకవర్గంలో ఉన్నాయి. ఉత్తర, దక్షిణ భారత దేశాలను కలిపే కాజీపేట రైల్వే జంక్షన్‌, దేశంలోనే అత్యుత్తమైన జాతీయ సాంకేతిక కశాశాల (నిట్‌), కాకతీయ విశ్వవిద్యాలయం, ప్రముఖ క్రైస్తవ స్వచ్ఛంద సంస్థ బాలవికాస ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి.

ఇతర ముఖ్యాంశాలు

వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గానికి ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ఈ నియోజకవర్గం 1952 నుంచి పలుమార్పులకు లోనవుతూ వచ్చింది. 1952లో ఆవిర్భవించింది. 1957లో కనుమరుగైంది. హసన్‌పర్తి, ధర్మసాగర్‌ నియోజకవర్గాల్లో విలీనమైంది. ఆ తర్వాత 1978లో మళ్లీ అవిర్భవించింది. 2009లో మళ్లీ రద్దయింది. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంగా మారింది. ఈ నియోజకవర్గంలో నుండి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన పివి రంగారావు మాజీ ప్రధాని పివి నర్సింహరావు కుమారుడు. ఈ నియోజవర్గంలో వరుసగా మూడు సార్లు గెలిచిన దాస్యం వినయ్‌భాస్కర్‌ ఇదే నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రి అయిన స్వర్గీయ ప్రణయ్‌భాస్కర్‌ సోదరుడు.

వీడియోస్

ADVT