నియోజకవర్గం : అసెంబ్లీ

వరంగల్ తూర్పు

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
వరంగల్
మొత్తం ఓటర్లు :
206040
పురుషులు :
101691
స్త్రీలు :
104191
ప్రస్తుత ఎమ్మెల్యే :
నన్నపనేని రవీందర్
ప్రస్తుత ఎంపీ :
పసూనూరి దయాకర్

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 206040
పురుషులు:101691
స్త్రీలు: 104191
ఇతరులు : 158 
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు:
వరంగల్‌ తూర్పు నియోజవర్గంలో బీసీ ఓటర్లే అధికంగా ఉన్నారు. ముస్లిం మైనారిటీలు కూడా గెలుపు ఓటముల నిర్ణాయకశక్తిగా ఉన్నారు. పద్మశాలీ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: ఓపెన్‌
నియోజకవర్గంలోని మండలాలు: వరంగల్‌, ఖిలా వరంగల్‌
ఏ లోకసభ నియోజకవర్గం పరిధిలో ఉంది: వరంగల్‌
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 నన్నపనేని రవీందర్ టీఆర్‌ఎస్ వద్దిరాజు రవిచంద్ర కాంగ్రెస్ 28782
2014 కొండా సురేఖ టీఆర్‌ఎస్ బస్వరాజు సారయ్య కాంగ్రెస్ 55085
2009 బస్వరాజు సారయ్య కాంగ్రెస్ ప్రదీప్ రావు ప్రదీప్ రావుపీఆర్‌పీ 7255
2004 బస్వరాజు సారయ్య కాంగ్రెస్ గుండు సుధారాణి టీడీపీ 0
1999 బస్వరాజు సారయ్య కాంగ్రెస్ దోనేపూడి రమేష్ బాబు టీడీపీ 0
1994 దోనేపూడి రమేష్ బాబు టీడీపీ టి పురుషోత్తమరావు కాంగ్రెస్ 0
1989 టి పురుషోత్తం రావు కాంగ్రెస్‌ బస్వరాజు సారయ్య స్వతంత్ర 0
1985 బి. నాగభూషన్‌రావు టీడీపీ అబ్దుల్‌ ఖాదర్‌ కాంగ్రెస్ 0
1983 బి నాగభూషన్‌రావు టీడీపీ భూపతి క్రిష్ణమూర్తి కాంగ్రెస్ 0
1978 ఆరెల్లి బుచ్చయ్య కాంగ్రెస్‌ ఐ భూపతి క్రిష్ణమూర్తి జనతా 0
1972 పి ఉమారెడ్డి కాంగ్రెస్ భూపతి క్రిష్ణమూర్తి ఎస్‌టీపీఎస్ 0
1967 టీఎస్‌ మూర్తి స్వతంత్ర బి నాగభూషన్‌రావు కాంగ్రెస్ 0
1962 బి. నాగభూషణ్‌రావు స్వతంత్ర మీర్జా షుకుర్‌ బేగ్‌ కాంగ్రెస్ 0
1957 మీర్జా షుకుర్‌బేగ్‌ కాంగ్రెస్ ఎ సత్యనారాయణ స్వతంత్ర 0
1952 ఎంఎస్‌ రాజలింగం కాంగ్రెస్ ఎ. సత్యనారాయణ స్వతంత్ర 0

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

ప్రముఖ నవలా రచయిత రామా చంద్రమౌళి, అర్జున్‌ అవార్డు గ్రహీత పిచ్చయ్య, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి తదితరులు.

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

తూర్పు నియోజకవర్గంలో కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం, ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌, ఎంజీఎం ఆసుపత్రి, ప్రాంతీయ నేత్ర వైద్యశాల, కాకతీయ వైద్య కళాశాల, ఆయుర్వేద కళాశాల మొదలైనవి ఉన్నాయి. ప్రాజెక్టులు ఏమీ లేవు.

అభివృద్ధి ప‌థ‌కాలు

వరంగల్‌ తూర్పు నియోజవర్గంలో రైల్వే ఓవర్‌ బిడ్రి నిర్మాణం జరుగుతున్నది. మాడల్‌ షాదీ ఖానా నిర్మాణం కొనసాగుతోంది. తూర్పు నియోజకవర్గం మీదుగా ఖమ్మం రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఓసిటీలో తాగునీటి రిజర్వాయర్‌ నిర్మాణమవుతోంది. ఓరుగల్లు కోటలో మ్యూజియం పనులు పూర్తికావచ్చాయి. హృదయ్‌ పథకం కింద రూ. 9 కోట్లతో ఓరుగుల్లు కోట పనులు జరుగుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

తూర్పు నియోజకవర్గంలో వరంగల్‌ బస్‌స్టేషన్‌ అధ్వానంగా ఉంది. అనేక సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. వరంగల్‌ ఆర్‌ఓబీ పనులు నత్తనడకగా సాగుతున్నాయి. ఆర్‌యూబీ శంకుస్థాపనకే పరిమితమైంది. అంతర్గత రోడ్లు దారుణంగా ఉన్నాయి. ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంది. ఆర్‌ఓబీ పూర్తయితే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. మురుగు కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు కాగితాలకే పరిమితమైంది. జంక్షన్ల అభిృవృద్ధి ముందుకు సాగడం లేదు. పార్కుల అభివృద్ధి ఏనాడో అటకెక్కింది.

ముఖ్య ప్రాంతాలు

తూర్పులో కాకతీయుల నాటి సుప్రసిద్ధ ఓరుగల్లు కోట ఉంది. ప్రముఖ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది

ఇతర ముఖ్యాంశాలు

వరంగల్‌ నియోజకవర్గంగా ఉన్న ప్రాంతం ఇప్పుడు తూర్పు నియోజకవర్గంగా మారింది. 2009లో వరంగల్‌ నియోజకవర్గం రద్దయి వరంగల్‌ తూర్పుగా అవతరించింది

వీడియోస్

ADVT