నియోజకవర్గం : అసెంబ్లీ

స్టేషన్ ఘన్‌పూర్

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
వరంగల్
మొత్తం ఓటర్లు :
222148
పురుషులు :
111282
స్త్రీలు :
110863
ప్రస్తుత ఎమ్మెల్యే :
తాటికొండ రాజయ్య
ప్రస్తుత ఎంపీ :
పసూనూరి దయాకర్

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 222148
పురుషులు: 111282
స్త్రీలు: 110863
ఇతరులు: 03
నియోజకవర్గంలో కీలక వర్గాలు:
ఎస్సీలు నియోజకవర్గంలో అధికంగా ఉన్నారు. ఆ తరువాత బీసీలు ఉన్నారు. నియోజకవర్గంలో ఈ రెండు వర్గాలే కీలక పాత్ర పోషించనున్నాయి.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: ఎస్సీ
నియోజకవర్గంలోని మండలాలు:
1.స్టేషన్‌ఘన్‌పూర్‌, 2.లింగాలఘణపురం, 3.రఘునాథపల్లి, 4.చిలుపూరు, 5.ధర్మసాగర్‌, 6.వేలేరు, 7.జఫర్‌గఢ్‌.
ఏ లోక్‌సభ నియోజకవర్గంలో ఉంది: వరంగల్‌.
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 తాటికొండ రాజయ్య టీఆర్‌ఎస్ సింగపురం ఇందిర కాంగ్రెస్ 35790
2014 డాక్టర్‌ టి.రాజయ్య టీఆర్‌ఎస్‌ జి.విజయరామారావు కాంగ్రెస్‌ 58687
2012 డాక్టర్‌ టి.రాజయ్య టీఆర్‌ఎస్‌ కడియం శ్రీహరి టీడీపీ 32638
2009 డాక్టర్‌ టి.రాజయ్య కాంగ్రెస్‌ కడియం శ్రీహరి టీడీపీ 11244
2008 కడియం శ్రీహరి టీడీపీ జి.విజయరామారావు టీఆర్‌ఎస్‌ 7766
2004 జి.విజయరామారావు టీఆర్‌ఎస్‌ కడియం శ్రీహరి టీడీపీ 18120
1999 కడియం శ్రీహరి టీడీపీ డాక్టర్‌ టి.రాజయ్య కాంగ్రెస్‌ 4560
1994 కడియం శ్రీహరి టీడీపీ బోనగిరి ఆరోగ్యం కాంగ్రెస్‌ 40051
1989 బోనగిరి ఆరోగ్యం కాంగ్రెస్‌ బొజ్జపల్లి రాజయ్య టీడీపీ 5556
1985 బొజ్జపల్లి రాజయ్య టీడీపీ బోనాల ఆనందం కాంగ్రెస్‌ 19283
1983 గోక రామస్వామి కాంగ్రెస్‌ సుదర్శన్‌రావు టీడీపీ 774
1978 గోక రామస్వామి కాంగ్రెస్(ఐ) కె.లింగయ్య జనతాపార్టీ 14369
1972 టి.హయగ్రీవాచారి కాంగ్రెస్‌ ఆరుట్ల రమాదేవి సీపీఐ 11672
1967 తోకల లక్ష్మారెడ్డి స్వతంత్ర హయగ్రీవాచారి కాంగ్రెస్‌ 3256
1962 ఎన్‌వీసీ. మోహన్‌రెడ్డి సీపీఐ బీ.కే.రెడ్డి కాంగ్రెస్‌ 2585
1957 భేతి కేశవరెడ్డి కాంగ్రెస్‌ సీకేకేరెడ్డి పీడీఎఫ్‌ 5555

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

లేరు

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

ధర్మసాగర్‌, అశ్వరావుపల్లి, నవాబుపేట రిజర్వాయర్లు ఉన్నాయి. ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి స్టేషన్‌ఘన్‌పూర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను నింపి దాని ద్వారా ఆశ్వరావుపల్లి, నవాబుపేట రిజర్వాయర్లకు గ్రావిటీ కెనాల్‌ ద్వారా నీటిని పంపిణీ చేస్తున్నారు.

అభివృద్ధి ప‌థ‌కాలు

1.మిషన్‌ కాకతీయ,
2.మిషన్‌ భగీరథ,
3.డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం పనులు.

పెండింగ్ ప్రాజెక్టులు

నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. మెగా లెదర్‌ పార్కు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మెగా లెదర్‌ పార్క్‌ నిర్మాణానికి ప్రభుత్వం ప్రకటన చేసింది. అదే విధంగా లింగాలఘణపురం మండలం కళ్లెం వద్ద ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌, వేలేరు మండలంలో టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ముఖ్య ప్రాంతాలు

1.జీడికల్‌లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం,
2.చిలుపూరులో శ్రీ బుగులు వెంకటేశ్వరస్వామి ఆలయం,
3.రఘునాథపల్లి మండలం ఖిలాషాపూరం, స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం తాటికొండ లో సర్దార్‌ సర్వాయి పాపన్న నిర్మించిన కోటలు, గడీలు, జఫర్‌గఢ్‌ మండల కేంద్రంలో జాఫర్‌ గౌలా నిర్మించిన కోటలు చరిత్రకు ఆనవాళ్లుగా ఉన్నాయి.

ఇతర ముఖ్యాంశాలు

ఏమీ లేవు.

వీడియోస్

ADVT