నియోజకవర్గం : అసెంబ్లీ

పరకాల

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
వరంగల్
మొత్తం ఓటర్లు :
194983
పురుషులు :
96052
స్త్రీలు :
98926
ప్రస్తుత ఎమ్మెల్యే :
చల్లా ధర్మారెడ్డి
ప్రస్తుత ఎంపీ :
పసూనూరి దయాకర్

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 194983
పురుషులు: 96052
స్త్రీలు: 98926
ఇతరులు : 5
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు: 
నియోజకవర్గంలో బీసీలు 52 శాతం ఉండగా ఎస్సీలు, ఎస్టీలు, ఇతర వర్గాలకు చెందిన వారు 48 శాతం ఉన్నారు. ఇందులో ముఖ్యంగా బీసీ వర్గంలో ముదిరాజ్‌లు ముందువరుసలో ఉండగా తర్వాతి స్థానంలో యాదవులు, గౌడ, మున్నూరుకాపు, పద్మశాలి, రజక, విశ్వబ్రాహ్మణ తదితర వర్గాలు ఉన్నాయి.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: జనరల్‌
నియోజకవర్గంలోని మండలాలు: 
పరకాల, ఆత్మకూరు, సంగెం, గీసుగొండ, దామెర, భూపాలపల్లి జిల్లాకు చెందిన శాయంపేట
ఏ లోక్‌సభ పరిధలోకి వస్తుంది: వరంగల్
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 చల్లా ధర్మారెడ్డి టీఆర్‌ఎస్ కొండా సురేఖ కాంగ్రెస్ 46519
2014 చల్లా ధర్మారెడ్డి టీడీపీ ముద్దసాని సహోదర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ 58324
2012 మొలుగూరి భిక్షపతి(ఉ.ఎ) టీఆర్‌ఎస్ కొండా సురేఖ వైఎస్సార్‌సిపి 50374
2009 కొండా సురేఖ కాంగ్రెస్ మొలుగూరి బిక్షపతి టీఆర్‌ఎస్‌ 56335
2004 బండారి శారారాణి టీఆర్‌ఎస్ దొమ్మటి సాంబయ్య టీడీపీ 37176
1999 బొజ్జపెల్లి రాజయ్య టీడీపీ పుల్లా పద్మావతి కాంగ్రెస్‌ 33202
1994 పోతరాజు సారయ్య సీపీఐ బొచ్చు సమ్మయ్య కాంగ్రెస్‌ 29245
1989 ఒంటేరు జయపాల్ బీజేపీ బొచ్చు సమ్మయ్య కాంగ్రెస్‌ 36933
1985 జయపాల్‌ బీజేపీ బొచ్చు సమ్మయ్య కాంగ్రెస్‌ 17794
1983 బొచ్చు సమ్మయ్య కాంగ్రెస్‌ జయపాల్‌ బీజేపీ 18845
1978 బొచ్చు సమ్మయ్య కాంగ్రెస్ మర్రిపెల్లి ఎల్లయ్య జేఎన్‌పి 16869
1972 పింగిళి ధర్మారెడ్డి కాంగ్రెస్ చందుపట్ల జంగారెడ్డి బీజేఎస్‌ 18427
1967 సి.జె రెడ్డి బీజేఎస్ బి. కైలాసం కాంగ్రెస్ 16889
1962 రౌతు నర్సింహరామయ్య కాంగ్రెస్ దోడపాక నర్సింహరాజయ్య సీపీఐ 7442
1957 మంద సాయిలు కాంగ్రెస్‌ కేశవరెడ్డి ఇండి 18923

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

నియోజకవర్గంలో దామెర మండలంలోని చంద్రగిరి చెన్నకేశవస్వామి గుట్టలపై మిషన్‌భగీరథ కోసం ఏర్పాటు చేస్తున్న పంప్‌హౌజ్‌ పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా గీసుకొండ మండల కేంద్రంలో టెక్స్‌టైల్‌పార్కును ప్రారంభించారు.

అభివృద్ధి ప‌థ‌కాలు

గీసుగొండ మండలం టెక్స్‌టైల్‌ పార్కు.

పెండింగ్ ప్రాజెక్టులు

నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా నియోజకవర్గ కేంద్రంలో నాలుగు నూతన వాటర్‌ ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా మిషన్‌ భగీరథ నీరు అందినట్లయితే సమస్య పూర్తిగా తీరుతుంది.

ముఖ్య ప్రాంతాలు

పరకాల అమరధామం.

ఇతర ముఖ్యాంశాలు

జిల్లాల పునర్విభజనలో భాగంగా రూరల్‌ జిల్లా కేంద్రం ఇప్పటివరకు ఎక్కడ అనేది నిర్ధారణ కాలేదు.

వీడియోస్

ADVT