నియోజకవర్గం : అసెంబ్లీ

ఖమ్మం

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
ఖమ్మం
మొత్తం ఓటర్లు :
258440
పురుషులు :
125186
స్త్రీలు :
133217
ప్రస్తుత ఎమ్మెల్యే :
పువ్వాడ అజయ్‌కుమార్
ప్రస్తుత ఎంపీ :
పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు : 258440
పురుషులు :125186
స్త్రీలు :133217
ఇతరులు :37

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

నియోజకవర్గంలో కీలక వర్గాలు
నియోజకవర్గంలో కీలకంగా మైనార్టీలు, ఓసీ కులాలకు చెందిన వారు ఉన్నారు. ఆ తరువాతి స్థానంలో బీసీలు ఉన్నారు. రాజకీయంగా ఖమ్మం నియోజకవర్గం వామపక్షాలకు పట్టుగా ఉండేది. నియోజకవర్గంలో వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీల బలాబలాలు సమానంగా ఉంటాయి. అయితే మారిన రాజకీయ నేపథ్యంలో ఖమ్మం కార్పొరేషన్‌ను 2016 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. టీఆర్‌ఎస్‌ మెదటి స్థానంలో నిలవగా కాంగ్రెస్‌ రెండోస్థానంలో, టీడీపీ మూడో స్థానంలో, వామపక్షాలు నాలుగో స్థానంలో నిలిచాయి.
 
నియోజకవర్గ చరిత్ర : 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా ఏర్పాటయ్యింది. అప్పట్లో పీడీఎఫ్‌ నుంచి శాసనసభ్యులుగా బి కృష్ణయ్య, ఆర్‌.ఓ.గురుమూర్తి గెలుపొందారు. కమ్యునిస్టుల ఉద్యమ కేంద్రంగా ఉన్న ఖమ్మంలో 10సార్లు వామపక్షాలు గెలుపొందాయి. 1952,57లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. మొత్తం 14సార్లు ఎన్నికలు జరగ్గా పీడీఎఫ్‌, సీపీఐ కలిసి ఐదుసార్లు, సీపీఎం నాలుగుసారు, కాంగ్రెస్‌, కాంగ్రెస్‌-ఐ నాలుగుసార్లు, టీడీపీ ఒకసారి గెలుపొందాయి. 2009లో ఖమ్మం నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్‌ టిక్కెట్‌ కోసం ప్రయత్నించిన సత్తుపల్లి సిట్టింగ్‌ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్‌ టిక్కెట్‌ రాకపోవడంతో తిరుగుబాటు చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. 2009లో ఖమ్మం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ నుంచి గెలుపొందారు.
 
2014 ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలవ్వగా కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన పువ్వాడ అజయ్‌కుమార్‌ గెలుపొందారు. తుమ్మల ఖమ్మం నియోజకవర్గం నుంచి ఓడిపోయినప్పటికీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కింది. దీంతో ఆయన 2016లో పాలేరు ఉప ఎన్నికల్లో శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. కాగా కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన పువ్వాడ అజయ్‌కుమార్‌ పాలేరు ఉపఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌లో చేరారు.
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 పువ్వాడ అజయ్ కుమార్ టీఆర్‌ఎస్ ఎన్.నాగేశ్వర రావు టీడీపీ 10991
2014 పువ్వాడఅజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌ తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ 5609
2009 తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ జలగం వెంకట్రావ్‌ ఇండిపెండెంట్ 2472
2004 తమ్మినేని వీరభద్రం సీపీఎం బి లక్ష్మీనారాయణ టీడీపీ 9819
1999 యూనిస్‌సుల్తాన్‌ కాంగ్రెస్‌ బి లక్ష్మీనారాయణ టీడీపీ 6787
1994 పువ్వాడ నాగేశ్వరరావు సీపీఐ జహీర్‌అలీమహ్మద్‌ కాంగ్రెస్ 23938
1989 పువ్వాడనాగేశ్వరరావు సీపీఐ కె దుర్గానర్సింహారావు కాంగ్రెస్ 8095
1985 ఎం రాంకిషన్‌రావు సీపీఎం ముజాఫరుద్దీన్‌ కాంగ్రెస్ 2670
1983 ఎం రాంకిషన్‌రావు సీపీఎం కె అనంతరెడ్డి కాంగ్రెస్ 8450
1978 కీసర అనంతరెడ్డి కాంగ్రెస్‌-ఐ సి లక్ష్మీనర్సయ్య సీపీఎం 10420
1972 ఎండీ రజబ్‌అలీ సీపీఐ ఎంకె ఖాన్‌ కాంగ్రెస్ 1747
1967 ఎండీ రజబ్‌అలీ సీపీఎం ఎస్‌ సూర్యప్రకాష్‌రావు కాంగ్రెస్ 9524
1962 నల్లమల గిరిప్రసాదరావు సీపీఐ పీఎస్‌ రావు కాంగ్రెస్ 21673

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

కొప్పు నరేష్‌: ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ఖమ్మం,
మేళ్లచెరువు వెంకటేశ్వర్లు, డాక్టర్‌ గోపీనాధ్‌, క్రాంతి శ్రీనివాస్‌, నాగబత్తిని రవి, వద్దిరాజు రవిచంద్ర, పారా నాగేశ్వరరావు గ్రానైట్‌ వ్యాపారులు.

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

ఖమ్మం నియోజకవర్గంలో నాగార్జున సాగర్‌ ప్రధాన కాలువ విశిష్టమైనది. రాజకీయంగా, విద్య, వ్యాపార ,వ్యవసాయపరంగా తెలంగాణలోనే ప్రత్యేకస్థానం సాధించింది. వామపక్ష పార్టీలకు ఉద్యమాల ఖిల్లాగా ఖమ్మం నిలిచింది. అన్ని రకాల కమ్యునిస్టు పార్టీలకు ఇక్కడ స్థానం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన మార్కెట్లలో ఖమ్మం మార్కెట్‌ ప్రధానమైనది. మిర్చి, పత్తి విక్రయాల లవాదేవీలు కోట్లలో  జరుగుతాయి. ఇక్కడి పంటలు విదేశాలకు, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగగుమతి అవుతున్నాయి.
 
మమత మెడికల్‌ క ళాశాల రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్‌ విద్యలో పేరుగాంచినది. ఇక్కడి నుంచి విదేశాలకు గ్రనైట్‌ను ఎగుమతి చేస్తారు. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం కూడా ఊపందుకుది. విద్యారంగంలోనూ ఖమ్మం అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడి అనేక విద్యాసంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఖమ్మం ఖిల్లా నియోజకవర్గానికి ప్రధాన ఆకర్షణ. దీనితో పాటు స్థంబాద్రి లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం, రఘునాధపాలెంలో షిర్డీసాయి దేవాలయం ఆధ్మాత్మికంగా పేరుగాంచాయి. లకారం ట్యాంకుబండ్‌ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది.

అభివృద్ధి ప‌థ‌కాలు

నియోజకవర్గంలో ప్రస్తుతం రహదారులు, చెరువులు, మిషన్‌ భగీరథ ద్వారా పైపులైన్ల పనులు, భారీ వంతెనలు, డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గానికి ముకుటాయంగా ఉన్న ఖమ్మం కార్పొరేషన్‌లో 1000 కోట్లతో అభివృద్ధిపనులు జరుగుతున్నాయి. ఖమ్మం చుట్టూ బాహ్యవలయం రోడ్డు నిర్మాణానికి సరే కొనసాగుతోంది. ఖమ్మంలో 25 కోట్లతో ఆధునిక బస్టాండు నిర్మాణం కొనసాగుతోంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ఖమ్మంలో ఐటీహబ్‌ నిర్మాణం సాగుతోంది.
 
నగర సుందరీకరణలో భాగంగా ఖమ్మంలో పలు సెంటర్లలో సర్కిళ్ల నిర్మాణాలు సాగుతున్నాయి. అందంగా ముస్తాబు చేయడంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా పార్కుల అభివృద్ధి, లకారం చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేశారు.

పెండింగ్ ప్రాజెక్టులు

నియోజకవర్గ కేంద్రమైన ఖమ్మంలో ఇంకా సమస్యలు అనేకం ఉన్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరంలో రోడ్లను విస్తరించాల్సి ఉంది. ట్రాఫిక్‌ సమస్య ప్రజలను పట్టి పీడిస్తోంది.ప్రధానంగా ఖమ్మం నగరంలో భూగర్భ డ్రైనేజీలు లేకపోవడంతో చిన్న వర్షానికే రోడ్లన్నీ చెరువుల్లా దర్శనమిస్తున్నాయి. దీంతో వర్షాకాలంలో ప్రజలు రోడ్లపై అవస్థలు పడాల్సి వస్తోంది. బస్టాండు సెంటర్‌లో ప్రజలకు, పాదచారులకు వెసులుబాటుగా పుట్‌ ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. తాగునీటి సమస్యను తీర్చాల్సి ఉంది. డంపింగ్‌ యార్డు ప్రధానంగా పట్టణ ప్రజలను పట్టిపీడిస్తోంది.
 
నగరానికి సమీపంలో ఉన్న దానవాయిగూడెం డంపింగ్‌యార్డుకు తీసుకెళ్లే చెత్తాచెదారం రోడ్లపై పడుతోంది. డంపింగ్‌యార్డు నుంచి తరచుగా పొగ లేస్తుండడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవతున్నారు. దీంతో దోమల దాటికి ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారు. ఖమ్మం నగరంలో గోళ్లపాడు ఛానెల్‌ ఆధునీకరణ పనులు కొనసాగుతున్నా వాటిని ఇంకా వేగవంతం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. నిరుపేదలకు అందించనున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాల్సి ఉంది. మురికివాడల అభివృద్ధి రేస్‌ పథకాన్ని విస్తృత పరచాల్సి ఉంది.

ముఖ్య ప్రాంతాలు

నియోజకవర్గంలో స్థంబాద్రి లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం ఆధ్మాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. గుంటుమల్లేశ్వరస్వామి దేవస్థానం, టేకులపల్లి సమీపంలోని గోశాల భక్తులను అలరిస్తున్నాయి. ఖమ్మం ఖిల్లా, లకారం చెరువు పర్యాటక కేంద్రాలుగా విరజిల్లుతున్నాయి.

ఇతర ముఖ్యాంశాలు

నియోజకవర్గం అనేక మతాలు, కులాలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్, పంజాబ్‌, ఒరిస్సా రాష్ట్రాల నుంచి వలస వచ్చిన ఎంతో మంది వ్యాపారులు, కార్మికులు నగరంలో స్థిరపడ్డారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ తర్వాత వ్యాపార లావాదేవీలతో పాటు అన్నిరంగాల్లోనూ  ఖమ్మం ముందుకు దూసుకెళ్తోంది. ఖమ్మం నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో మిర్చి, పత్తి పంటలు విస్తారంగా పండుతున్న నేపథ్యంలో వాటికి అనుగుణంగా పరిశ్రమలు వెలుస్తున్నాయి.
 
మిర్చి నూనె తీసే ఫ్యాక్టరీలతో పాటు, మిర్చి తొడిమలు తీసే పరిశ్రమలు, వెలిశాయి. పత్తి జిన్నింగ్‌ మిల్లులు కూడా నగరంలో వెలిశాయి.నగరంలో కోల్డ్‌స్టోరేజీల నిర్మాణాలు కూడా విస్తృతమవుతున్నాయి. గత పదేళ్లుగా రియల్ ఎస్టేట్‌ రంగం విస్తరించడంతో స్థిరాస్తి వ్యాపారం బాగా పెరిగిపోయింది. దీంతో నిర్మాణ రంగం బాగా విస్తరిస్తోంది. హోటళ్లు, పర్యాటక ప్రాంతాలు, ప్రైవేటు పార్కులు వెలుస్తున్నాయి. దీంతో అభివృద్ధిలో నగరం ముందంజలో ఉంది.

వీడియోస్

ADVT