నియోజకవర్గం : అసెంబ్లీ

నర్సంపేట

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
వరంగల్
మొత్తం ఓటర్లు :
204450
పురుషులు :
101609
స్త్రీలు :
102825
ప్రస్తుత ఎమ్మెల్యే :
పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి
ప్రస్తుత ఎంపీ :
అజ్మీరా సీతారం నాయక్

ఓట‌ర్లు

నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు: 204450
పురుషులు:101609
స్త్రీలు: 102825
ఇతరులు : 16

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: జనరల్‌
నియోజకవర్గంలోని మండలాలు:
1)నర్సంపేట, 2) నల్లబెల్లి, 3) దుగ్గొండి, 4) ఖానాపురం, 5) చెన్నారావుపేటచ 6) నెక్కొండ
ఏ లోకసభ పరిధిలో ఉంది: మహబూబాబాద్‌
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 పెద్ది సుదర్శన్ రెడ్డి టీఆర్‌ఎస్ దొంతి మాధవ రెడ్డి కాంగ్రెస్ 16949
2014 దొంతి మాధవరెడ్డి ఇండి పెద్ది సుదర్శన్ రెడ్డి టీఆర్ఎస్ 18376
2009 రేవూరి ప్రకాశ్‌రెడ్డి టీడీపీ దొంతి మాధవ రెడ్డి కాంగ్రెస్ 8623
2004 కంభంపాటి లక్ష్మారెడ్డి టీఆర్‌ఎస్ రావూరి ప్రకాష్ రెడ్డి టీడీపీ 14908
1999 రేవూరి ప్రకాశ్‌రెడ్డి టీడీపీ దొంతి మాధవ రెడ్డి కాంగ్రెస్ 13585
1994 రేవూరి ప్రకాశ్‌రెడ్డి టీడీపీ మద్దికాయల ఓంకార్ సీపీఐ(ఎం) 87
1989 మద్దికాయల ఓంకార్ సీపీఐ(ఎం) (ఇండి) జనార్థన్ రెడ్డి ఏపూరు కాంగ్రెస్ 11095
1985 మద్దికాయల ఓంకార్ సీపీఐ(ఎం) (ఇండి) మండవ ఉపేందర్ రావు కాంగ్రెస్ 21398
1983 మద్దికాయల ఓంకార్ సీపీఎం పెండెం కట్టయ్య కాంగ్రెస్ 3575
1978 మద్దికాయల ఓంకార్ సీపీఎం ఘంటా ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ 21513
1972 మద్దికాయల ఓంకార్ సీపీఎం పెండెం కట్టయ్య కాంగ్రెస్ 3146
1967 కాసర్ల సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్‌ ఎ.వి.రావు సీపీఎం 6240
1962 ఏ.వెంకటేశ్వర్‌రావు పీడీఎఫ్ కాసర్ల సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ 4418
1957 కె.కనకరత్తమ్మ కాంగ్రెస్ ఎం. వెంకటేశ్వర రావు పీడీఎఫ్ 2689

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

ఎవరూ లేరు

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

నర్సంపేట నియోజకవర్గంలో పాకాల సరస్సు ఉంది. కాకతీయుల ఇంజనీరింగ్‌ నైపుణ్యానికి నిలువుటద్దంలా ఉంది. దీంతో పాటు ఇంజనీరింగ్‌ కాలేజీలు రెండు నర్సంపేటలో ఉన్నాయి. ఇటీవల ఖానాపూర్‌ మండలం అశోక్‌నగరంలో ప్రభుత్వం గిరిజన సైనిక్‌ స్కూల్‌ను ప్రారంభించింది.

అభివృద్ధి ప‌థ‌కాలు

నియోజకవర్గ కేంద్రానికి ఇటీవల రూ.50 కోట్ల ప్రత్యేక నిధిని ప్రభుత్వం కేటాయించింది. దీంతో పాటుగా రామప్ప- పాకాల సరస్సు లింక్‌ కోసం రూ. 378 కోట్లను మంజూరు చేసింది. పాకాలను 6 టీఎంసీలకు పెంచి గోదావరి నదీ జలాలను తరలించడంతో ఆరు మండలాలకు లబ్ధి చేకూరుతుంది.

పెండింగ్ ప్రాజెక్టులు

నర్సంపేటను మున్సిపాలిటీగా ప్రభుత్వం మార్చినప్పటికీ అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంది. దీంతో పాటుగా నర్సంపేటకు మంజూరు చేసిన మిర్చి పరిశోధన కేంద్రం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంది.

ముఖ్య ప్రాంతాలు

నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్‌ మండలం అశోక్‌నగర్‌ సమీపంలో పాకాల సరస్సు పర్యాటక ప్రాంతంగా ఉంది. వారసత్వ సంపదలో చోటు సంపాదించుకున్న పాకాల సరస్సు ప్రాంతంలో పర్యాటక శాఖ గెస్ట్‌హౌజ్‌ల నిర్మాణం చేపట్టింది.

ఇతర ముఖ్యాంశాలు

నర్సంపేట నియోజకవర్గం ఆవిర్భవించిన నాటినుంచి 13 పర్యాయాలు ఎన్నికలు జరిగితే ఐదు పర్యాయములు మద్దికాయల ఓంకార్‌ విజయం సాధించి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కొనసాగారు. 1957లో కె.కనకరత్తమ్మ(కాంగ్రెస్‌), 1967లో కాసర్ల సుదర్శన్‌రెడ్డి(కాంగ్రెస్‌) గెలిచిన సమయంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పటికీ ఎవరికీ మంత్రి పదవులు దక్కలేదు. 1994, 1999లో రెండు సార్లు ఎమ్మెల్యేగా రేవూరి ప్రకాశ్‌రెడ్డి గెలిచినప్పటికీ టీడీపీ నుంచి రేవూరికి కూడా మంత్రి పదవి వరించలేదు. కాంగ్రెస్‌ పార్టీ రెబల్‌ అభ్యర్థిగా బరిలో దిగిన దొంతి మాధవరెడ్డి అనూహ్యంగా గెలుపొందారు.

వీడియోస్

ADVT