నియోజకవర్గం : అసెంబ్లీ

మహబూబాబాద్

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
వరంగల్
మొత్తం ఓటర్లు :
211688
పురుషులు :
105854
స్త్రీలు :
105809
ప్రస్తుత ఎమ్మెల్యే :
బానోత్‌ శంకర్‌నాయక్
ప్రస్తుత ఎంపీ :
అజ్మీరా సీతారం నాయక్

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 211688
పు: 105854
స్త్రీలు: 105809
ఇతరులు: 25
 
నియోజకవర్గంలో కీలకవర్గాలు:
గిరిజన లంబాడాలు ప్రథమస్థానంలో, బీసీలు ద్వితీయ స్థానంలో, ఎస్సీలు తృతీయస్థానంలో ఉన్నారు. ఎస్టీ రిజర్వుడు స్థానం కావడంతో వీరే జయపజయాల్లో కీలకభూమిక పోషిస్తారు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: ఎస్టీ 
నియోజకవర్గంలో మండలాలు:
1)మహబూబాబాద్‌, 2)కేసముద్రం, 3)గూడూరు, 4)నెల్లికుదురు
ఏ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది: మహబూబాబాద్‌
 
మహబూబాబాద్‌ నియోజకవర్గం: (1952 ద్విసభ్య నియోజకవర్గం)
(మహబూబాబాద్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ 1957,1962లో జరిగిన ఎన్నికల్లో చిల్లంచెర్ల నియోజకవర్గంగా పేరు మార్చారు.)  
(1967 నుంచి తిరిగి మహబూబాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంగా మారింది.)
 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 బి.శంకర్ నాయక్ టీఆర్‌ఎస్ బలరాం నాయక్ కాంగ్రెస్ 13534
2014 బి.శంకర్‌నాయక్‌ టీఆర్‌ఎస్‌ మాలోతు కవిత కాంగ్రెస్‌ 9602
2009 మాలోతు కవిత కాంగ్రెస్‌ అజ్మీర చందూలాల్‌ టీఆర్‌ఎస్‌ 15367
2004 వేం నరేందర్‌రెడ్డి టీడీపీ భరత్‌చందర్‌రెడ్డి జనతా పార్టీ 4800
1999 శ్రీరాం భద్రయ్య టీడీపీ వి.రాజవర్థన్‌రెడ్డి కాంగ్రెస్‌ 12428
1994 బండి పుల్లయ్య సీపీఐ జె.జనార్థన్‌రెడ్డి కాంగ్రెస్‌ 10114
1989 జె.జనార్థన్‌రెడ్డి కాంగ్రెస్‌ బండిపుల్లయ్య సీపీఐ 3213
1985 జె.జనార్థన్‌రెడ్డి కాంగ్రెస్‌ రావూరి వీరయ్య టీడీపీ 7684
1983 జె.జనార్థన్‌రెడ్డి కాంగ్రెస్‌ జి.ఐలయ్య టీడీపీ 22187
1978 జె.జనార్థన్‌రెడ్డి కాంగ్రెస్‌ బి. బాబునాయక్‌ కాంగ్రెస్‌ (ఐ) 3041
1972 జె.జనార్థన్‌రెడ్డి కాంగ్రెస్‌ సత్యనారాయణరావు సీపీఐ 42465
1967 టి.సత్యనారాయణ సీపీఐ జి.మల్లికార్జున్‌రావు కాంగ్రెస్‌ 3471
1962 జి.మల్లికార్జున్‌రావు కాంగ్రెస్‌ కె.జి.రావు సీపీఐ 5419
1957 ఎంఎస్.రాజలింగం కాంగ్రెస్‌ కె.జిరావు పీడీఎఫ్‌ 164
1952 కె.శ్రీనివాసరావు పీడీఎఫ్‌ ఎన్‌.రెడ్డి కాంగ్రెస్‌ 15668
1952 బీఎన్‌.చందర్‌రావు ఎస్‌సీఎఫ్‌ ఎ.రాజయ్య స్వతంత్ర 3241

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

1.వద్దిరాజు రవిచంద్ర (ప్రముఖ గ్రనైట్‌ వ్యాపారి, కేసముద్రం)
2.గొడిశాల జయరాజ్‌ (ప్రజా గాయకుడు, రచయిత, మానుకోట)

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

500 ఏళ్ల కిందటి అతిపురాతన బీ.ఎన్‌.గుప్తా స్మారక తులారాం ప్రాజెక్ట్‌. దీనికింద 500 ఎకరాలకు సాగునీరు, అనేక గ్రామాలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా గ్రౌండ్‌వాటర్‌ ఉంటుంది.

అభివృద్ధి ప‌థ‌కాలు

మిషన్‌ భగీరథతో ఇంటింటికి స్వచ్చమైన తాగునీరందించే పనులు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో మిషన్‌ కాకతీయ 4వ దశ పనులు వివిధ చెరువుల్లో జరుగుతున్నాయి. డబుల్‌ బెడ్‌రూం నిర్మాణ పనులు పూర్తవుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

నియోజకవర్గంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇంకా ఊగిసలాటలోనే ఉంది. మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం, ఉద్యానవన ఫల పరిశోధన కేంద్రానికి అనుగుణంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పాలిటెక్నిక్‌ ఏర్పాటు తీరని కలగానే మిగిలిపోయింది.  వీటితో పాటు ఇంజనీరింగ్‌, మెడికల్‌ కళాశాలలు, డీఈడీ, బీఈడీ కళాశాలలు కోరుతున్నారు.

ముఖ్య ప్రాంతాలు

500 ఏళ్ల కిందటి అతి పురాతన స్వయంభూ శ్రీ జగన్నాథ వేంకటేశ్వరస్వామి ఆలయం అనంతాద్రిలో ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాధాన్యతను పొందుతోంది. గూడూరు మండల ఏజెన్సీలో భీముని పాదం జలపాతం పర్యాటకంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. మహబూబాబాద్‌లో జిల్లా కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలతో పాటు అన్ని జిల్లాస్థాయి కార్యాలయాలు ఉన్నాయి.

ఇతర ముఖ్యాంశాలు

ఏమి లేవు

వీడియోస్

ADVT