నియోజకవర్గం : అసెంబ్లీ

జనగామ

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
వరంగల్
మొత్తం ఓటర్లు :
206790
పురుషులు :
103418
స్త్రీలు :
103360
ప్రస్తుత ఎమ్మెల్యే :
ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
ప్రస్తుత ఎంపీ :
బూర నరసయ్య గౌడ్

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు : 206790
పురుషులు : 103418
స్త్రీలు : 110863
ఇతరులు: 3
నియోజకవర్గంలో కీలక వర్గాలు:
రెడ్డి, మాదిగ, యాదవులు, కురుమలు. నియోజకవర్గంలో రెడ్డి వర్గీయులే కీలకంగా ఉన్నారు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: జనరల్‌
నియోజకవర్గంలోని మండలాలు:
1.జనగామ 2.బచ్చన్నపేట 3. చేర్యాల 4. కొమురవెళ్లి 5. మద్దూరు
6. నర్మెట్ట 7. తరిగొప్పుల
ఏ లోక్‌సభ నియోజకవర్గంలో ఉంది: భువనగిరి
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి టీఆర్‌ఎస్ పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ 29568
2014 ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి టీఆర్‌ఎస్‌ పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌ 32695
2009 పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి టీఆర్‌ఎస్‌ 236
2004 పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌ ఎ.బస్వారెడ్డి టీడీపీ 23293
1999 పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌ జి.ప్రేమలతారెడ్డి టీడీపీ 10883
1994 సీహెచ్‌.రాజారెడ్డి సీపీఎం పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌ 24508
1989 పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌ సీహెచ్‌.రాజారెడ్డి సీపీఎం 6665
1985 ఎ.నరసింహారెడ్డి సీపీఎం పి.లక్ష్మయ్య కాంగ్రెస్‌ 22217
1983 ఆర్‌. లక్ష్మారెడ్డి టీడీపీ కె.వరదారెడ్డి కాంగ్రెస్‌ 9909
1978 కె.వరదారెడ్డి కాంగ్రెస్‌(ఐ) ఎ.నరసింహారెడ్డి సీపీఎం 2371
1972 కె.నారాయణ కాంగ్రెస్‌ డీఎస్ఆర్‌ రెడ్డి స్వతంత్ర 6728
1967 ఎండీ.కమాలుద్దీన్‌ అహ్మద్‌ కాంగ్రెస్‌ ఎ.నర్సింహ రెడ్డి సీపీఎం 3782
1962 గోక రామలింగం కాంగ్రెస్‌ కె.రాఘవులు సీపీఐ 14
1957 జి.గోపాల్‌రెడ్డి పీడీఎఫ్‌ జె.రెడ్డి కాంగ్రెస్‌ 2996
1957 గోక రామలింగం కాంగ్రెస్‌ కె.రాఘవులు పీడీఎఫ్‌ 4264
1952 సయిద్‌ ఎ. హుస్సేన్ పీడీఎఫ్‌ ఎండీ.ఆబిద్‌ కాంగ్రెస్‌ 7871

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

1.డాక్టర్‌ సీహెచ్‌.రాజమౌళి.(డాక్టర్‌)
ప్రముఖ సర్జన్‌, రవళి నర్సింగ్‌ హోం. 2009 లో వరంగల్‌ ఎంపీగా పీఆర్‌పీ నుండి పోటీ చేశారు.
2.డాక్టర్‌ డి.లవకుమార్‌ రెడ్డి (డాక్టర్‌),
జనగామ అసెంబ్లీ నుండి 2009లో ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. ప్రస్తుతం శ్రీనివాస నర్సింగ్‌ హోం, జిప్స్‌ ఫార్మసీ కళాశాల చైర్మెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
3. డాక్టర్‌ పి.సుగుణాకర్‌రాజు
జనగామ ఏరియా ఆసుపత్రి ఆర్‌ఎంఓగా పనిచేస్తున్నాడు. ఇటీవల ఆయన సతీమణి డాక్టర్‌ సుధా టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.
4. డాక్టర్‌ ఆరుట్ల దశమంత్‌రెడ్డి
హైకోర్టు న్యాయవాదిగా ఉన్నారు. తెలంగాణ సాధన ఉద్యమంతో పాటు జనగామ జిల్లా కోసం జిల్లా సాధన సమితి చైర్మన్‌గా కీలక పాత్ర పోషించారు.

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

1.చీటకోడూరు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌
0.03 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ప్రధానంగా జనగామ పట్టణ ప్రజల తాగునీటి అవసరాలకు, భవిష్యత్తులో 4 వేల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో రిజర్వాయర్‌ నిర్మించారు.
2.మల్లన్న గండి రిజర్వాయర్‌
0.04 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. నర్మెట్ట మండలంలో నిర్మించిన ఈ రిజర్వాయర్‌ నుండి పైప్‌లైన్‌ ద్వారా బొమ్మకూర్‌, వెల్దండ, లద్నూర్‌, కొమురవెల్లి మండలంలోని తపాస్‌పల్లి రిజర్వాయర్లకు నీటిని పంపిణీ చేసే ఉద్దేశంతో నిర్మించారు.
3. తపాస్‌పల్లి రిజర్వాయర్‌
0.03 టీఎంసీల సామర్థ్యంతో కొమురవెల్లి మండలంలోని ఐనాపూర్‌ వద్ద నిర్మించిన ఈ రిజర్వాయర్‌ ద్వారా చేర్యాల, కొమురవెల్లి, కొండపాక మండలాలకు సాగునీరు అందించాలని నిర్దేశించారు.

అభివృద్ధి ప‌థ‌కాలు

1. మిషన్‌ కాకతీయ,
2.మిషన్‌ భగీరథ,
3.జాతీయ రహదారి విస్తరణ పనులు,
4.సమీకృత కలెక్టరేట్‌ భవన నిర్మాణం.

పెండింగ్ ప్రాజెక్టులు

నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి మిషన్‌ భగీరథ పనులు 90 శాతం పూర్తయ్యాయి. రిజర్వాయర్ల ద్వారా సాగునీరు అందించేందుకు కాల్వల నిర్మాణ పనులు సాగుతున్నాయి. నిరుద్యోగ సమస్య నివారణకు నియోజకవర్గంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ముఖ్య ప్రాంతాలు

1.నియోజకవర్గంలో చారిత్రక కొమురవెల్లి మల్లన్న దేవాలయం.
2.బచ్చన్నపేట మండలం కొడ్వటూరులో సిద్దేశ్వరాలయం.
3.మల్లన్న గండి రిజర్వాయర్‌.

ఇతర ముఖ్యాంశాలు

ఏమీ లేవు.

వీడియోస్

ADVT