నియోజకవర్గం : అసెంబ్లీ

డోర్నకల్

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
వరంగల్
మొత్తం ఓటర్లు :
191641
పురుషులు :
95714
స్త్రీలు :
95922
ప్రస్తుత ఎమ్మెల్యే :
ధరంసోత్‌ రెడ్యానాయక్‌
ప్రస్తుత ఎంపీ :
అజ్మీరా సీతారాం నాయక్

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 191641
పు: 95714
స్త్రీలు: 95922
ఇతరులు: 5
నియోజకవర్గంలో కీలకవర్గాలు:
గిరిజన లంబాడాలు ప్రథమస్థానంలో, బీసీలు ద్వితీయ స్థానంలో, ఎస్సీలు తృతీయస్థానంలో ఉన్నారు. ఎస్టీ రిజర్వుడు స్థానం కావడంతో వీరే జయాపజయాల్లో కీలకభూమిక పోషిస్తారు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: (ఎస్టీ)
నియోజకవర్గంలో మండలాలు :
1)డోర్నకల్‌, 2.కురవి, 3.మరిపెడ, 4.నర్సింహులపేట, 5.దంతాలపల్లి, 6.చిన్నగూడూరు
ఏ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది: మహబూబాబాద్‌
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 డి.ఎస్.రెడ్యానాయక్ టీఆర్‌ఎస్ రాంచందర్ నాయక్ కాంగ్రెస్ 17381
2014 డీ.ఎస్.రెడ్యానాయక్‌ కాంగ్రెస్‌ సత్యవతిరాథోడ్‌ టీడీపీ 23475
2009 సత్యవతి రాథోడ్‌ టీడీపీ డీ.ఎస్.రెడ్యానాయక్‌ కాంగ్రెస్‌ 4623
2004 డీ.ఎస్.రెడ్యానాయక్‌ కాంగ్రెస్‌ జయంత్‌నాథ్‌ టీడీపీ 19000
1999 డీ.ఎస్.రెడ్యానాయక్‌ కాంగ్రెస్‌ నూకల నరే్‌షరెడ్డి టీడీపీ 8036
1994 డీ.ఎస్.రెడ్యానాయక్‌ కాంగ్రెస్‌ నూకల నరే్‌షరెడ్డి స్వతంత్ర 26094
1989 డీ.ఎస్.రెడ్యానాయక్‌ కాంగ్రెస్‌ సత్యవతిరాథోడ్‌ టీడీపీ 5085
1985 ఆర్‌.సురేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ జె.జితేందర్‌రెడ్డి టీడీపీ 15283
1983 ఆర్‌.సురేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ (ఐ) జాన్‌రెడ్డి టీడీపీ 34244
1978 ఆర్‌ సురేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ వై.నర్సింహారెడ్డి కాంగ్రెస్‌ (ఐ) 13609
1974 ఆర్‌.సురేందర్‌రెడ్డి కాంగ్రెస్‌(ఏకగ్రీవం) ------ ------- 0
1972 ఎన్‌.రామచంద్రారెడ్డి కాంగ్రెస్‌(ఏకగ్రీవం) ------ ----- 0
1967 ఎన్‌.రామచంద్రారెడ్డి కాంగ్రెస్‌ వి.లక్ష్మినారాయణ స్వతంత్ర 21742
1962 ఎన్‌.రామచంద్రారెడ్డి కాంగ్రెస్‌ జె.జనార్థన్‌రెడ్డి స్వతంత్ర 7468
1957 ఎన్‌.రామచంద్రారెడ్డి కాంగ్రెస్‌ టీఎస్.రావు పీడీఎఫ్‌ 8864

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

ఎవరూ లేరు.

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

ఏమి లేవు...

అభివృద్ధి ప‌థ‌కాలు

మిషన్‌ భగీరథతో ఇంటింటికి స్వచ్చమైన తాగునీరందించే పనులు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో మిషన్‌ కాకతీయ 4వ దశ పనులు వివిధ చెరువుల్లో జరుగుతున్నాయి. డబుల్‌బెడ్‌రూంలు పూర్తవుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

శాశ్వత తాగునీటి పరిష్కారం ఇప్పటికీ తీరలేదు. విద్యారంగంలో ప్రభుత్వ డిగ్రీ, ఆపై ఉన్నత చదువుల కళాశాలలు లేవు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమల ఏర్పాటు జరగలేదు. ఈ దిశగా ప్రయత్నాలు కూడా జరగడం లేదు.

ముఖ్య ప్రాంతాలు

  • కాకతీయుల సామ్రాజ్య చరిత్రతో ఆనుబంధం కలిగిన కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేతా వీరభద్రస్వామి ఆలయం తెలంగాణలోనే గిరిజన లంబాడాలు కొలిచే కురవీరన్నగా ప్రసిద్ది పొందింది. ప్రతియేటా శివరాత్రి నాడే దాదాపు లక్ష మంది భక్తులు హాజరవుతుంటారు. ఆ నాటి నుంచి నెల రోజుల పాటు కొనసాగే జాతరగా కురవి ఆలయానికి ప్రాముఖ్యత ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రతియేటా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు.
  • కురవి మండలం కందగిరి పర్వతంపై ప్రతియేటా కార్తీక పౌర్ణమి నాడు ఒకరోజు పాటు జరిగే కందికొండ జాతరకు గిరిజనులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఈ గుట్టపై శ్రీలక్ష్మినర్సింహస్వామి ఆలయం ఉంది. ఆనపోతుని శాసనంలోనూ కందగిరి ఉందని చరిత్ర ఆధారాలు పేర్కొంటున్నాయి.
  • ఆసియా ఖండంలోనే మెదక్‌ తర్వాతి స్థానాన్ని ఆక్రమించిన డోర్నకల్‌ సీఎస్ఐ చర్చి అత్యంత ప్రాధాన్యత పొందింది. దేశవిదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు.

ఇతర ముఖ్యాంశాలు

ఏమి లేవు

వీడియోస్

ADVT