నియోజకవర్గం : అసెంబ్లీ

భూపాలపల్లి

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
వరంగల్
మొత్తం ఓటర్లు :
245307
పురుషులు :
123964
స్త్రీలు :
121302
ప్రస్తుత ఎమ్మెల్యే :
గండ్ర వెంకట రమణారెడ్డి
ప్రస్తుత ఎంపీ :
పసూనూరి దయాకర్

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 245307
పురుషులు: 123964
స్త్రీలు: 121302
ఇతరులు: 41
నియోజకవర్గంలో కీలకవర్గాలు: భూపాలపల్లి నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఈ రెండు వర్గాలు ఎటువైపు ఎక్కువగా ఓట్లు వేస్తే ఆ పార్టీ వ్యక్తే గెలుస్తాడు. బీసీల్లో గౌడ, పద్మశాలి, ముదిరాజ్‌ కులస్థులు అధికంగా ఉంటారు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 గండ్ర వెంకటరమణా రెడ్డి కాంగ్రెస్ సిరికొండ మధుసూదనా చారి టీఆర్‌ఎస్ 15635
2014 సిరికొండ మధుసూదనాచారి టీఆర్‌ఎస్‌ గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్‌ 7214
2009 గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్‌ సిరికొండ మధుసూదనాచారి టీఆర్‌ఎస్‌ 11967

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

లేరు

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంటు(కేటీపీపీ)
వెలుగుల కేటీపీపీ
భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్న ఏకైక ప్రాజెక్టు కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంటు. జెన్‌కో ఇక్కడ 1100 మెగావాట్ల ప్లాంట్లు నిర్మించింది. జయశంకర్‌ జిల్లా గణపురం మండలం చెల్పూర్‌ సమీపంలోని దుబ్బపల్లి వద్ద కేటీపీపీ మొదటి దశ 500, రెండవ దశ 600ల మెగావాట్ల ప్లాంట్లను నిర్మించారు. మొదటి దశ నిర్మాణానికి జెన్‌కో రూ.3600 కోట్లు కేటాయించగా 9 అక్టోబర్‌ 2010న విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభమైంది. ప్రతీ రోజు 12 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుంది. రెండవ దశ 600ల మెగావాట్ల ప్లాంట్‌ నిర్మాణం కోసం రూ.4200 కోట్లను కేటాయించగా 31 మార్చి 2016న విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభమైంది. ప్రతీ రోజు 14.4 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. కేటీపీపీలో ఉత్పత్తి అయిన విద్యుత్‌ను వరంగల్‌, గజ్వేల్‌ పవర్‌గ్రిడ్‌లకు అనుసంధానం చేస్తారు. కేటీపీపీలో ఉద్యోగులు వెయ్యి మంది పనిచేస్తుండగా వెయ్యికి పైగా కార్మికులు పని చేస్తున్నారు.

అభివృద్ధి ప‌థ‌కాలు

రూ.108 కోట్లతో కొత్త రోడ్ల నిర్మాణాలను చేపట్టగా అందులో రూ.46 కోట్లు ఖర్చుచేసి 55 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం పూర్తిచేశారు. రూ.89 కోట్లతో 28వంతెనల నిర్మాణం చేపట్టగా ఇంకా 8 వంతెనల పనులు జరుగుతున్నాయి. రూ.4 కోట్లతో కలెక్టర్‌ కాంప్లెక్స్‌, రూ.3 కోట్లతో గెస్ట్‌హౌజ్‌ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. రూ.104 కోట్ల పీఎంజీఎస్‌వై, నాబార్డు నిధులతో గ్రామీణ రహదారులు, వంతెనలు, కల్వర్టుల పనులు ప్రారంభమయ్యాయి. రూ.14 కోట్ల ఎన్‌ఆర్‌జీఈఎస్ నిధులతో కొత్త గ్రామపంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాలు, వ్యవసాయ గోదాంలు, మండల సమైఖ్య భవన నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

గోదావరి జలాలు అందించేందుకు మిషన్‌ భగీరథ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. భూపాలపల్లి పట్టణంలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు అనుకున్న స్థాయిలో జరగడం లేదు. గణపురం చెరువును రిజర్వాయర్‌గా చేసే పనులు కొనసాగుతున్నాయి. గొల్లబుద్దారం వద్ద నిర్మించిన డీఫ్లోరెడ్‌ ప్రాజెక్ట్‌ 6 సంవత్సరాలు గడిచినా ఇంకా వినియోగంలోకి రాలేదు. పలుచోట్ల వంతెన నిర్మాణాలు, పలు గ్రామాలకు రోడ్డు నిర్మాణాలు పూర్తికాలేదు.

ముఖ్య ప్రాంతాలు

రేగొండ మండలంలోని కొత్తపల్లి సమీపంలో పాండవులగుట్ట పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతోంది. ఇక్కడ రాక్‌క్లైంబింగ్‌ కూడా జరుగుతుంది. గణపురం మండల కేంద్రంలోని కోటగూళ్లు కాకతీయ కళానైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. అయితే ప్రస్తుతం ఈ కాకతీయ కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక రేగొండ మండలంలోని ప్రఖ్యాత కొడవటంచ ఆలయం భక్తులకు ఇలవేల్పుగా ఉంది.

ఇతర ముఖ్యాంశాలు

భూపాలపల్లి నియోజకవర్గానికి స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రాజ్యంగబద్ధమైన పదవిలో ఉన్నప్పటికీ నెలలో 20 రోజులు నియోజకవర్గంలోనే స్పీకర్‌ మకాం వేస్తున్నారు. అలాగే 2009లో కొత్తగా ఏర్పడిన భూపాలపల్లి నియోజకవర్గానికి కాంగ్రెస్‌ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలువగా, ఆ ఏడాది కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. 2014లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలువగా టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చింది. భూపాలపల్లిలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే ప్రచారం ఉంది. ఈ నియోజకవర్గం నుంచి ఈసారి కూడా మధుసూదనా చారినే బరిలో నిలవనున్నారు. 2019లో ఆనవాయితీ ప్రకారం ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం రాజకీయ పక్షాల్లో నెలకొంది. మధుసూదనాచారి మరో సారి టీఆర్‌ఎస్ నుంచి గెలుస్తారా లేదా అనేది వేచిచూడాలి.

వీడియోస్

ADVT