నియోజకవర్గం : అసెంబ్లీ

ఇల్లెందు

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
ఖమ్మం
మొత్తం ఓటర్లు :
193204
పురుషులు :
95932
స్త్రీలు :
97256
ప్రస్తుత ఎమ్మెల్యే :
హరిప్రియ నాయక్
ప్రస్తుత ఎంపీ :
అజ్మీరా సీతీరాం నాయక్

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 193204
పురుషులు: 95932
స్త్రీలు: 97256
ఇతరులు: 16
నియోజకవర్గంలో కీలక వర్గాలు: నియోజకవర్గంలో గిరిజనులు ఎక్కువ, ఎస్టీల్లో లంబాడా ఓటర్లు అధికం. గిరిజనేతరుల ఓటర్లు ఎక్కువగా వున్నారు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

1952లో ఏర్పడిన ఇల్లెందు నియోజకవర్గంలో 14 పర్యాయాలు శాసనసభ ఎన్నికలు జరిగాయి. 1952 నుంచి 1972 వరకు జనరల్‌ స్థానంగా వున్న ఇల్లెందు సెగ్మెంట్‌ 1978 నుంచి గిరిజనులకు రిజర్వ్‌ చేయబడింది. 1952, 1957ల్లో ఇద్దరేసి ఎమ్మెల్యేల ప్రాతినిధ్యంతో ద్విసభ నియోజకవర్గంగా ఉంది. ఇల్లెందు నియోజకవర్గంలో ఇప్పటి వరకు నక్సలైట్‌ పార్టీలు 6 పర్యాయాలు, కాంగ్రెస్‌ 4 పర్యాయాలు, సీపీఐ 2 పర్యాయాలు, తెలుగుదేశం ఒక పర్యాయం గెలుపొందడం విశేషం. నియోజకవర్గం గిరిజనులకు రిజర్వ్‌ చేసినప్పటికీ అభ్యర్థుల జయాపజయాలను ప్రభావితం చేసే రీతిలో అత్యధికంగా గిరిజనేతర ఓటర్లు ఉండటం గమనార్హం. గిరిజన మండలాలతో ఏర్పడిన ఇల్లెందు నియోజకవర్గం నేడు మూడు జిల్లాల పరిధిలో విభజనకు గురైంది. ఇల్లెందు నియోజకవర్గానికి చెందిన గార్ల, బయ్యారం మండలాలు మహబూబాబాద్‌ జిల్లాలో, కామేపల్లి మండలం ఖమ్మం జిల్లాలో, ఇల్లెందు, టేకులపల్లి మండలాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేరాయి.
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 హరిప్రియ నాయక్ కాంగ్రెస్ కోరం కనకయ్య టీఆర్‌ఎస్ 2654
2014 కోరం కనకయ్య కాంగ్రెస్‌ బానోత్‌ హరిప్రియ టీడీపీ 11286
2009 ఊకె అబ్బయ్య టీడీపీ కోరం కనకయ్య కాంగ్రెస్‌ 2946
2004 గుమ్మడి నర్సయ్య ఎన్డీ కల్పనబాయి టీడీపీ 11926
1999 గుమ్మడి నర్సయ్య ఎన్డీ దళ్‌సింగ్‌ కాంగ్రెస్‌ 19227
1994 ఊకె అబయ్య సీపీఐ గుమ్మడి నర్సయ్య ఎన్డీ 6076
1989 గుమ్మడి నర్సయ్య ఎన్డీ ఊకె అబ్బయ్య సీపీఐ 7683
1985 గుమ్మడి నర్సయ్య ఎన్డీ పాయం ముత్తయ్య సీపీఐ 5796
1983 గుమ్మడి నర్సయ్య ఎన్డీ బీ. సోమ్లనాయక్‌ కాంగ్రెస్‌ 2467
1978 చాపల ఎర్రయ్య సీపీఐ(ఎంఎల్‌) కంగల బుచ్చయ్య సీపీఎం 338
1972 వంగ సుబ్బారావు కాంగ్రెస్‌ బీపీ. రావు సీపీఐ 11826
1967 జీ. సత్యనారాయణ కాంగ్రెస్‌ బీ. రామకోటేశ్వర్‌రావు సీపీఐ 5748
1962 కేఎల్‌. నర్సింహరావు సీపీఐ బీఎస్‌.రావు కాంగ్రెస్‌ 13020

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

జుగల్‌కిషోర్‌ ఖండెల్‌వాల్‌(వ్యాపారవేత్త)
చాడ నారాయణరెడ్డి(పారిశ్రామికవేత్త)
ఎం.సీ. నాగిరెడ్డి(విద్యావేత్త)
కల్తీ వీరమల్లు(రిటైర్ట్‌ జాయింట్‌ కలెక్టర్‌, చెల్లప్ప కమిటీ సభ్యుడు)

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

బేతంపూడి ప్రాజెక్ట్‌(టేకులపల్లి మండలం)
తులారాం ప్రాజెక్ట్‌(బయ్యారం మండలం)
బయ్యారం పెద్దచెరువు(బయ్యారం మండలం)
సింగరేణి కాలరీస్‌ బొగ్గుగనులు(ఇల్లెందు)
గార్ల మండలంలో బైరటీస్‌ ఖనిజ నిక్షేపాలు
బయ్యారం మండలంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు
ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో బొగ్గు నిక్షేపాలు
ఇల్లెందు ఏరియాలో టైల్స్‌ ఫ్యాక్టరీలు

అభివృద్ధి ప‌థ‌కాలు

ఇల్లెందు పట్టణంలో రహదారుల అభివృద్ధి కార్యక్రమాలు, మిషన్‌భగీరథ పనులు, అన్ని మండలాల్లో డబుల్‌ బెడ్‌రూం గృహాల నిర్మాణం, చెరువుల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే విధంగా డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫౌండేషన్‌ నిధులతో ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో రహదారుల నిర్మాణం, సెంట్రల్‌ లైటింగ్‌, కమ్యూనిటీ హాళ్ళు, పార్కుల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. అదే విధంగా ఇల్లెందు పట్టణంలో సెంట్రల్‌ లైటింగ్‌ ఆధునీకరణ, డివైడర్ల పునర్‌నిర్మాణానికి సింగరేణి కాలరీస్‌ సంస్థ నిధులు మంజూరు చేసింది.

పెండింగ్ ప్రాజెక్టులు

ఉక్కు ఫ్యాక్టరీ బయ్యారం మండల ప్రజల చిరకాల వాంచ. ఐదున్నర దశాబ్దాలుగా ప్రజల ఆకాంక్ష నెరవేరలేదు. ఇల్లెందులో బస్‌డిపో నిర్మాణం జరగలేదు. ఇల్లెందుకు ప్యాసింజర్‌ రైలు సౌకర్యం పునరుద్దరించలేదు. గార్ల మండలంలో మున్నేరు ప్రాజెక్ట్‌ నిర్మాణం జరగలేదు. బయ్యారం పెద్దచెరువు, తులారాం ప్రాజెక్ట్‌, బేతంపూడి ప్రాజెక్ట్‌ కాల్వల మరమ్మత్తులు జరగలేదు. ఇల్లెందు పట్టణంలో కూరగాయల మార్కెట్‌ నిర్మాణం జరగలేదు.

ముఖ్య ప్రాంతాలు

కాకతీయుల శిలాశాసనాలు(బయ్యారం మండలం), వేట వెంకటేశ్వరస్వామి దేవాలయం(గార్ల మండలం), ఏడు బావులు(బయ్యారం మండలం)

వీడియోస్

ADVT