నియోజకవర్గం : అసెంబ్లీ

ఎల్లారెడ్డి

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
నిజామాబాద్
మొత్తం ఓటర్లు :
191589
పురుషులు :
92308
స్త్రీలు :
99267
ప్రస్తుత ఎమ్మెల్యే :
జాజుల సురేందర్
ప్రస్తుత ఎంపీ :
బీబీ పాటిల్

ఓట‌ర్లు

మొత్తం ఓట్లు: 1,91,589
పురుషులు: 92,308
స్త్రీలు: 99,267
 
నియోజకవర్గంలో కీలవర్గాలు:
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మున్నూరు కాపులు, రెడ్లు, ముదిరాజ్‌లు, గిరిజనుల ఓట్లు కీలకం కానున్నాయి.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

ఎల్లారెడ్డి నియోజవకర్గం జనరల్ కేటగిరీలో ఉంది. నాగిరెడ్డిపేట్‌, ఎల్లారెడ్డి, గాంధారి, తాడ్వాయి, లింగంపేట్‌, సదాశివనగర్‌ మండలాల్లోని అన్ని గ్రామాలు ఉండగా రామారెడ్డి, రాజంపేట్‌ మండలాల్లోని కొన్ని గ్రామాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. జహీరాబాద్‌ లోక్‌సభ పరిధిలో ఈ నియోజకవర్గం ఉంది.
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 జాజుల సురేందర్ కాంగ్రెస్ ఏనుగు రవీందర్ రెడ్డి టీఆర్ఎస్ 35148
2014 ఏనుగు రవీందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ సురేందర్‌ కాంగ్రెస్ 24009
2009 రవీందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ జనార్ధన్‌గౌడ్‌ కాంగ్రెస్ 36859
2004 ఏనుగు రవీందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ జనార్ధన్‌గౌడ్‌ కాంగ్రెస్ 10267
1999 ఆంజనేయులు టీడీపీ జనార్దన్‌గౌడ్‌ కాంగ్రెస్ 1317
1994 ఆంజనేయులు టీడీపీ కిషన్‌రెడ్డి కాంగ్రెస్ 15707
1989 ఆంజనేయులు టీడీపీ కిషన్‌రెడ్డి కాంగ్రెస్ 1716
1985 శ్రీనివాస్‌రెడ్డి టీడీపీ కేశవరెడ్డి కాంగ్రెస్ 13028
1983 కిషన్‌రెడ్డి టీడీపీ బాలాగౌడ్‌ కాంగ్రెస్ 7726
1978 బాలాగౌడ్‌ కాంగ్రెస్‌ వెంకట్‌రాంరెడ్డి జేఎన్‌పీ 25310
1972 ఈశ్వరిబాయి రిపబ్లికన్‌ ఎల్లయ్య కాంగ్రెస్ 1372
1967 ఈశ్వరిబాయి రిపబ్లికన్‌ సదాలక్ష్మి కాంగ్రెస్ 4443
1962 సదాలక్ష్మీ కాంగ్రెస్‌ ఈశ్వరీబాయి రిపబ్లికన్ పార్టీ 3987

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

విద్యారంగంలో పనిచేసిన శ్రీధర్‌ ప్రస్తుతం గ్రంథాలయ చైర్మన్‌గా ఉన్నారు. నాగిరెడ్డిపేటకు చెందిన రచణరెడ్డి హైకోర్టులో లీడింగ్‌ లాయర్‌గా కొనసాగుతున్నారు. ఈ నియోజకవర్గానికి చెందిన అనేక మంది అమెరికా, ఇతర ప్రాంతాల్లో వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు.

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలంలో పోచారం ప్రాజెక్టు ఉంది. అదే విధంగా మాలుత్తుమెదలో ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్‌తో పాటు విత్తన అభివృద్ది వ్యవసాయ క్షేత్రం ఉంది. సదాశివనగర్‌, గాంధారి, తాడ్వాయి మండలాల్లో కాళేశ్వరం ప్రాజెక్టులో 22వ ప్యాకేజి పనులు కొనసాగుతున్నాయి.

అభివృద్ధి ప‌థ‌కాలు

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏళ్లుగా తాగు నీటి సమస్య నెలకొంది. ప్రస్తుతం జరుగుతున్న మిషన్‌ భగీరథతో ఈ సమస్య తీరనుంది. మిషన్‌ కాకతీయ పనుల్లో భాగంగా చెరువుల పునరుద్దరణ కొనసాగుతోంది. జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా తాడ్వాయి నుంచి ఎల్లారెడ్డ్డి వరకు పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలంలోని గోలిలింగాల తాగునీటి ఎత్తీపొతల పథకం అసంపూర్తిగా ఉండిపోయింది.

ముఖ్య ప్రాంతాలు

పోచారం ప్రాజెక్టు పర్యాటక కేంద్రంగా ఉంది. రామారెడ్డి మండలంలోని శ్రీ కాలభైరవ స్వామి చారిత్రక ఆలయం ఉంది. గాంధారి మండలంలో సంగమేశ్వర్‌ ఆలయం, లింగంపేటలోని రామాలయంలో ఊగే ద్వజస్థంభం ఉన్నాయి.

ఇతర ముఖ్యాంశాలు

ఈ ప్రాంతంలోని ప్రాజెక్టుల వద్దకు చలికాలంలో లవ్‌బడ్స్‌ అనే విదేశీ పక్షులు వలస వస్తాయి.

వీడియోస్

ADVT