నియోజకవర్గం : అసెంబ్లీ

భద్రాచలం

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
ఖమ్మం
మొత్తం ఓటర్లు :
133756
పురుషులు :
64993
స్త్రీలు :
68745
ప్రస్తుత ఎమ్మెల్యే :
సున్నం రాజయ్య
ప్రస్తుత ఎంపీ :
అజ్మీరా సీతారాం నాయక్

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు :133756
పురుషులు :64993
స్త్రీలు :68745
ఇతరులు :18

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌ : ఎస్టీ
నియోజకవర్గంలో ఏఏ మండలాలు ఉన్నాయి : భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు
ఏ లోక్‌ సభ నియోజకవర్గం పరిధిలో ఉంది : మహాబూబాబాద్‌ 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2014 సున్నం రాజయ్య సీపీఎం కొమరం ఫణీశ్వరమ్మ టీడీపీ 1815
2009 కుంజా సత్యవతి కాంగ్రెస్‌ సున్నం రాజయ్య సీపీఎం 6956
2004 సున్నం రాజయ్య సీపీఎం సోడే రామయ్య టీడీపీ 14585
1999 సున్నం రాజయ్య సీపీఎం చిచ్చడి శ్రీరామమూర్తి టీడీపీ 6349
1994 కుంజాబొజ్జి సీపీఎం సోడే భద్రయ్య కాంగ్రెస్‌ 39301
1989 కుంజాబొజ్జి సీపీఎం కేడీ సుశీల కాంగ్రెస్‌ 7776
1985 కుంజాబొజ్జి సీపీఎం సోడే భద్రయ్య కాంగ్రెస్‌ 21504
1983 ముర్ల ఎర్రయ్యరెడ్డి సీపీఎం ఎట్టి అశ్వపతి టీడీపీ 2745
1978 ముర్ల ఎర్రయ్యరెడ్డి సీపీఎం పి. తిరుపతయ్య కాంగ్రెస్‌ ఐ 16388
1972 మట్టా రామచంద్రయ్య కాంగ్రెస్‌ ముర్ల ఎర్రయ్యరెడ్డి సీపీఎం 776
1967 కన్నయ్యదొర కాంగ్రెస్‌ శ్యామల సీతారామయ్య సీపీఎం 6936
1962 మహ్మద్‌ తహసీల్‌ సీపీఐ పీవీఆర్‌రావు కాంగ్రెస్‌ 8276

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

అభినవమొల్ల చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ
భద్రాచలంకు చెందిన అభినవమొల్ల చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ ప్రముఖ కవయిత్రి. రెండు తెలుగు రాష్ర్టాల్లో ఎన్నోసార్లు సన్మానాలు, సత్కారాలు పొందారు.
 
పాకాల దుర్గా ప్రసాద్‌
భద్రాచలంకు చెందిన పాకాల దుర్గా ప్రసాద్‌ లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు. భద్రాచలం బ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. సేవా కార్యక్రమాలకు తనవంతు చేయూతనందించడంలో ముందుంటారు.
 
బూసిరెడ్డి శంకర్‌రెడ్డి
అంతర్జాతీయ గాంధీపథం కన్వీనర్. సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. భద్రాచలం అభివృద్ధి గురించి ప్రభుత్వాలకు నివేదికలు పంపడం, ప్రశ్నించడంలో ముందుంటారు.
 
కోటా దేవదానం
భద్రాచలం బార్‌ అసోసియేసన్‌ అధ్యక్షులు. గతంలో అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా బాధ్యతలు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసారు. నిరుపేదలకు న్యాయ సేవ అందించడంలో ముందుంటారు.

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

భద్రాద్రి రామాలయం, ఐటీడీఏ, గిరిజన బీఈడీ, డీఎడ్‌ కళాశాలలు ఉన్నాయి.
 
దుమ్ముగూడెం మండలంలో పర్ణశాల, చర్ల మండలంలో తాలిపేరు ప్రాజెక్టు, వెంకటాపురం మండలంలో పాలెంవాగు ప్రాజెక్టు, వాజేడు
మండలంలో గుండ్లవాగు ప్రాజెక్టు, బొగత జలపాతం ఉన్నాయి.
 
మోడికుంట ప్రాజెక్టు ఈ మండలంలోనే ఉన్నా ఎటువంటి పనులు ప్రారంభం కాలేదు.

అభివృద్ధి ప‌థ‌కాలు

భద్రాచలం నియోజకవర్గంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నాయి. అలాగే మిషన్‌ కాకతీయ కింద పలు గ్రామాల్లో చెరువులను పునరుద్దరిస్తున్నారు. అలాగే మిషన్‌ భగీరథలో దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో వాటర్‌ ట్యాంకుల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

నియోజకవర్గంలోని చర్ల మండలంలో వద్దిపేట చెక్‌డ్యాం నిర్మాణం, వాజేడు మండలంలో మోదికుంట ప్రాజెక్టు నిర్మాణం, వెంకటాపురం మండలంలో పాలెంవాగు ప్రాజెక్టు మరమ్మత్తులు.
భద్రాద్రి వరద కరకట్ట పొడిగింపు, స్లూయిస్‌లు తరచూ మరమ్మత్తులకు గురికావడం జరుగుతోంది. భద్రాచలం ఏరియా వైద్యశాలకు అదనంగా వంద పడకల ఆసుపత్రి నూతన భవనం రూ.20 కోట్లతో నిర్మించినా అలంకార ప్రాయంగా మిగిలింది. వైద్యులు, సిబ్బంది నియామకం లేకపోవడమే దీనికి కారణం. ఏపీ పరిధిలోకి వెళ్లిన ఎటపాక, కన్నాయి గూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల పంచాయతీలను తెలంగాణలోని భద్రాచలం మండల పరిధిలోకి తేవాలని గత నాలుగు సంవత్సరాలుగా డిమాండ్‌ ఉంది.
 
వాటి పరిష్కారానికి జరుగుతున్న ప్రయత్నాలు
సమస్యల పరిష్కారానికి రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు పత్రికా విలేకర్ల సమావేశంలో మాట్లాడటం, పర్యటనల సమయంలో మాట్లాడటం తప్పించి ఆచరణలో చేసింది శూన్యమని ఏజెన్సీ వాసులు వాపోతున్నారు.

ముఖ్య ప్రాంతాలు

భద్రాచలం నియోజకవర్గంలో భద్రాచలం రామాలయం, పర్ణశాల, తాలిపేరు, బొగత జలపాతంలు చారిత్రక పర్యాటక ప్రదేశాలు. భద్రాచలం ఐటీడీఏ, గిరిజన బీఎడ్‌, డీఎడ్‌ కళాశాలలు ఉన్నాయి.

ఇతర ముఖ్యాంశాలు

భద్రాచలం నియోజకవర్గం పూర్తిగా గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉంది. వాజేడు నుంచి భద్రాచలం వరకు వరదల సమయంలో ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి.

వీడియోస్

ADVT