నియోజకవర్గం : అసెంబ్లీ

వైరా

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
ఖమ్మం
మొత్తం ఓటర్లు :
173672
పురుషులు :
86276
స్త్రీలు :
87391
ప్రస్తుత ఎమ్మెల్యే :
రాములు నాయక్
ప్రస్తుత ఎంపీ :
పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 173672
పురుషులు: 86276
స్త్రీలు: 87391
ఇతరులు: 5
నియోజకవర్గంలో కీలక వర్గాలు: 
లంబాడీలు కీలకం. వారి ఓట్లు 38795, కమ్మ-20345, ముస్లింలు-5305, మాదిగ-18416, మాలలు-10468, కోయ-10828, మున్నూరుకాపు-7837, యాదవ-14916.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: ఎస్టీ
నియోజకవర్గంలో ఏఏ మండలాలు ఉన్నాయి: వైరా, కొణిజర్ల, సింగరేణి, ఏన్కూరు, జూలూరుపాడు(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)
ఏ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది: ఖమ్మం
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 రాములు నాయక్ స్వతంత్ర బి.మదన్ లాల్ టీఆర్‌ఎస్ 2013
2014 బాణోతు మదన్‌లాల్‌ వైసీపీ బాణోతు బాలాజీ టీడీపీ 10583
2009 బాణోతు చంద్రావతి సీపీఐ డాక్టర్‌ భూక్యా రామచంద్రనాయక్‌ కాంగ్రెస్‌ 13626

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

డాక్టర్‌ కాపా మురళీకృష్ణ: లయన్స్‌క్లబ్‌ నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల గవర్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన వైద్యుడిగా, లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మల్లెంపాటి వీరభద్రరావు: జనవిజ్ఞాన వేదిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆయన సీపీఎం సానుభూతిపరుడిగా కొనసాగుతున్నారు. చైతన్య విద్యాసంస్థలను స్థాపించి ఈ ప్రాంతంలోని పిల్లలకు విద్యావకాశాలను కల్పిస్తున్నారు. శాస్త్రీయ దృక్పథానికి సంబంధించిన అనేక అంశాలను, మూఢనమ్మకాలపై ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు తనవంతు కృషిచేస్తున్నారు.

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

వైరాలో కృషి విజ్ఞాన కేంద్రం, పశుగణాభివృద్ధి సంస్థ కార్యాలయం, ఐఎంఎల్‌ డిపో, డోలమైట్‌(మాధారం, సింగరేణి), వైరా రిజర్వాయర్‌(మీడియం), 
వైరా రిజర్వాయర్‌ పర్యాటక కేంద్రం, నాచారంలోని అద్భుత శ్రీ వేంకటేశ్వరస్వామి, గార్లొడ్డులోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి(ఏన్కూరు మండలం).

అభివృద్ధి ప‌థ‌కాలు

మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, ఆర్‌అండ్‌బీ రోడ్ల అభివృద్ధి, గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లు, డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు, గురుకులాల నిర్మాణం.

పెండింగ్ ప్రాజెక్టులు

జూలూరుపాడు మండలంలో పోచారం ప్రాజెక్టు సమస్య దీర్ఘకాలం నుంచి పెండింగ్‌లో ఉంది. కాకతీయుల కాలంనాటి ఈ ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఇది సాకారమైతే 12 గ్రామాలకు మంచినీరు, పదివేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. గిరిజన సమీకృత ఆరోగ్య కేంద్రాన్ని అందుబాటులోకి తేవాలి. వైరాలో 39 పడకల ఆసుపత్రి, ఫైర్‌స్టేషన్‌, డిగ్రీ కాలేజ్‌, అన్ని మండలాల్లో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, రవాణా, రహదారులు, విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేయాలి. రెండు రాష్ట్రాల్లో డోలమెంట్‌మెన్స్‌కు సంబంధించి పన్ను చెల్లించాల్సి రావటంతో ఉత్పత్తి గణనీయంగా తగ్గింది.

ఇతర ముఖ్యాంశాలు

2009 పునర్విభజన సమయంలో ఈ నియోజకవర్గం ఏర్పడింది. అంతకు ముందు మధిర నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉండేది. 2009లో మహాకూటమి నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెల్చిన బాణోతు చంద్రావతికి 2014 ఎన్నికల్లో సీపీఐ టిక్కెట్‌ నిరాకరించింది. దాంతో చంద్రావతి 2014లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీఎస్‌పీఎస్‌సీ సభ్యురాలిగా నియమితులయ్యారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన బాణోతు మదన్‌లాల్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మదన్‌లాల్‌కు తీవ్ర వైరుద్యమేర్పడింది. రెండు బలమైన వర్గాలుగా తలపడుతున్నాయి. 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన బాణోతు బాలాజీ కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు.

వీడియోస్

ADVT