నియోజకవర్గం : అసెంబ్లీ

సిర్పూరు

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
అదిలాబాద్
మొత్తం ఓటర్లు :
187387
పురుషులు :
94786
స్త్రీలు :
92570
ప్రస్తుత ఎమ్మెల్యే :
కోనేరు కోనప్ప
ప్రస్తుత ఎంపీ :
గోడం నగేష్‌

ఓట‌ర్లు

నియోజకవర్గ జనాభా2,71,235
పురుషులు: 1,35,435
స్త్రీలు: 1,35,800
మొత్తం ఓటర్లుః 187387
పురుషులు: 94786
స్త్రీలు: 92570
ఇతరులు: 31

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: ఓపెన్‌  
నియోజకవర్గంలో ఎన్ని మండలాలున్నాయి: 7
( కాగజ్‌నగర్‌, సిర్పూర్‌(టి), కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూరు, పెంచిలకపేట, దహెగాం ) 
ఏ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది: ఆదిలాబాద్‌ 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 కోనేరు కోనప్ప టీఆర్ఎస్ హరీష్‌బాబు కాంగ్రెస్ 24033
2014 కోనేరు కోనప్ప బీఎస్పీ కావేటి సమ్మయ్య టీఆర్‌ఎస్‌ 8837
2010 కావేటి సమ్మయ్య టీఆర్‌ఎస్‌ ఇంద్రకరణ్‌ రెడ్డి కాంగ్రెస్‌ 15229
2009 కావేటి సమ్మయ్య టీఆర్‌ఎస్‌ కోనేరు కోనప్ప కాంగ్రెస్‌ 7414
2004 కోనేరు కోనప్ప కాంగ్రెస్‌ పాల్వాయి రాజ్యలక్ష్మి టీడీపీ 4319
1999 పాల్వాయి రాజ్యలక్ష్మి టీడీపీ కోనేరు కోనప్ప కాంగ్రెస్‌ 29967
1994 పాల్వాయి పురుషోత్తం రావు స్వతంత్ర కె.వినారాయణరావు టీడీపీ 12268
1989 పాల్వాయి పురుషోత్తంరావు స్వతంత్ర కె.వి.నారాయణరావు టీడీపీ 2441
1985 కె.వి.నారాయణ రావు టీడీపీ జనక్‌ ప్రసాద్‌ కాంగ్రెస్‌ 8265
1983 కె.వి.నారాయణ రావు స్వతంత్ర కె.వి.కేశవులు కాంగ్రెస్‌ 10657
1978 కె.వి.కేశవులు కాంగ్రెస్‌ సీ.మాధవరెడ్డి జెఎన్‌పీ 6786
1972 కె.వికేశవులు కాంగ్రెస్‌ బి.చంద్రగౌడ్‌ స్వతంత్ర 9600
1967 జీఎస్‌ రెడ్డి కాంగ్రెస్‌ ఎం.సింగ్‌ స్వతంత్ర 5825
1962 సంజీవరెడ్డి కాంగ్రెస్‌ ఎం.బలరామయ్య స్వతంత్ర 14372
1957 వెంకట స్వామి కాంగ్రెస్‌ బి.రాజమల్లు పీఎస్పీ 1131

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

సిర్పూరు నియోజకవర్గంలో రాష్ట్రంలోనే పేరొందిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని 2004లో రూ.37,500 కోట్ల నిధులతో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రారంభించారు. అనంతర పరిణామాల కారణంగా ప్రభుత్వం మారటంతో మళ్లీ ఈ ప్రాజెక్టు అతీగతీ లేకుండా పోయింది. ఈ ప్రాంతంలో నిర్మాణం చేపట్టాల్సిన ప్రాజెక్టును నేరుగా కాలేశ్వరంకు తరలించారు. అలాగే ఉచ్చమల్లవాగు ప్రాజెక్టు, జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టులు కూడా ఇంత పూర్తి కాలేదు.

అభివృద్ధి ప‌థ‌కాలు

సిర్పూరు నియోజకవర్గంలో ప్రధానంగా సిర్పూరు నుంచి కౌటాల వెళ్లే ప్రధాన రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయి.  రూ.122 కోట్లతో నాలుగు వంతెనలు నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో ప్రధానంగా గూడెం-అహిరి అనుసంధానం చేసే బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. వీటితో పాటు గిరి గ్రామాల్లో రోడ్ల నిర్మాణం పనులు కూడా నడుస్తున్నాయి. రూ.133 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ కింద మిషన్‌ భగీరథ పనులు కూడా వేగవంతంగా నడుస్తున్నాయి. కాగజ్‌నగర్‌ పట్టణంలో పూర్తిగా ట్రయల్‌ రన్‌ కూడా జరిగింది. మిగితా మండలాల్లో ఈ పనులు చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

పెండింగ్ ప్రాజెక్టులు

సిర్పూరు నియోజకవర్గంలో ప్రధానంగా జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు పనులు పూర్తి కావటం లేదు. అలాగే ఆర్‌ఓబి బ్రిడ్జి నిర్మాణం చేపట్టినప్పటికీ మెట్లు నిర్మించలేదు. ఉచ్చమల్ల వాగు ప్రాజెక్టు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. వీటి కోసమే అంతా ఎదురు చూస్తున్నారు. అలాగే కొమురం భీం ఎడమ కాల్వ పనులు కూడా ఇంత వరకు పూర్తి స్థాయిలో కాలేదు. అటవీ శాఖ అధికారుల అనుమతి రాకపోవటంతో ఈ పనులలో జాప్యం జరిగింది. ప్రస్తుతం సిర్పూరు(టి) మండలం వరకు పనులు జరిగాయి. అలాగే గత నాలుగేళ్లుగా పేపర్‌ మిల్లు మూత బడి ఉంది. పునరుద్దరణకు సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో తమ భవిష్యత్తు బెంగతో 22 మంది కార్మికులు కూడా మృత్యువాత పడ్డారు.

ముఖ్య ప్రాంతాలు

 సిర్పూరు నియోజకవర్గంలో ప్రధానంగా పెంచికల్‌పేట మండలంలో ర్యాగ్‌ గుట్టలున్నాయి. ఈ గుట్టలపై రాబందులు నివసిస్తున్నాయి. వీటిని చూసేందుకు దేశ నలుమూలల నుంచి జనాలు వస్తున్నారు. రోజు రోజుకు ఆదరణ పెరుగుతుండటంతో అటవీ శాఖ అధికారులు కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బెజ్జూరు మండలంలోని సిద్దేశ్వర గుహలు ఉన్నాయి. ఈ గుట్టలు కూడా చాలా ప్రాశస్త్యంతో కూడకున్నాయి. కాగజ్‌నగర్‌ మండలంలోని ఈసుగాం శివమల్లన్న ఆలయంలో శివలింగం సహజ సిద్ద భస్మరేఖలతో ఉండటం విశేషం. ఏటా శివరాత్రి పండుగకు అతి పెద్ద జాతర నిర్వహిస్తారు. వీటితో పాటు కాగజ్‌నగర్‌ పట్టణాన్ని మిని ఇండియాగా పేరొందింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడ ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది.

ఇతర ముఖ్యాంశాలు

సిర్పూరు నియోజవర్గం మహరాష్ట్రకు సరిహద్దున ఉంటుంది. సిర్పూరు, కౌటాల, బెజ్జూరు ప్రాంతాలు మహరాష్ట్ర ప్రాణహితను ఆనుకొని ఉంటాయి. ఈ ప్రాంతం తెలంగాణలోనే ఉన్నప్పటికీ ఆచారాలన్నీ కూడా మహరాష్ట్ర పద్ధతి ప్రకారంగా ఉంటాయి. వేషధారణ, పెళ్లిళ్లు, ఇతరత్రా కార్యక్రమాలన్నీ కూడా మహరాష్ట్ర పద్ధతిలోనే నడవటం విశేషం. సిర్పూరు నియోజకవర్గంలోని ఏడు మండలాలలో కూడా పూర్తిగా వర్షాధారం పంటలే పండిస్తారు. ప్రధానంగా పత్తి, వరి, కందులు పండిస్తారు. కాగజ్‌నగర్‌ మండలంలోని నజ్రూల్‌నగర్‌, కౌటాల మండలంలోని రవీంద్రనగర్‌ ప్రాంతాలకు కాందీశీకులు 1973లో శరణార్థులుగా వచ్చారు. ఈ ప్రాంతంలో ఇప్పటికీ 64 మంది భారత సైనిక శిక్షణ దళంలో చేరారు.

వీడియోస్

ADVT