నియోజకవర్గం : అసెంబ్లీ

నిర్మల్‌

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
అదిలాబాద్
మొత్తం ఓటర్లు :
210311
పురుషులు :
99383
స్త్రీలు :
110900
ప్రస్తుత ఎమ్మెల్యే :
అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి
ప్రస్తుత ఎంపీ :
గోడం నగేష్‌

ఓట‌ర్లు

మెత్తం ఓటర్లు :2,10,311
పురుషులు : 99,383
స్త్రీలు : 1,10,900
ఇతరులు: 28 
నియోజకవర్గంలో కీలక వర్గాలు :
మైనార్టీలు , బీసీలు , ఎస్సీలు

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌ : జనరల్
నియోజకవర్గంలో ఏఏ మండలాలు ఉన్నాయి :
లక్ష్మణచాంద, మామడ , సోన్‌ , నిర్మల్‌, సారంగాపూర్‌ , దిలావర్‌పూర్‌, నర్సాపూర్‌ 
ఏ లోక్‌సభ పరిధిలో ఉంది : ఆదిలాబాద్‌ లోక్‌ సభ నియోజకవర్గం పరిదిలో ఉంది.  
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 ఎ. ఇంద్రకరణ్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ ఎ. మహేశ్వర్‌ రెడ్డి కాంగ్రెస్‌ 9271
2014 ఎ. ఇంద్రకరణ్‌ రెడ్డి బిఎస్పీ కె. శ్రీహరిరావు టీఆర్‌ఎస్‌ 8497
2009 ఎ. మహేశ్వర్‌ రెడ్డి ప్రజారాజ్యం ఎ. ఇంద్రకరణ్‌ రెడ్డి కాంగ్రెస్‌ 2545
2004 ఎ. ఇంద్రకరణ్‌ రెడ్డి కాంగ్రెస్‌ వి. సత్యనారాయణ గౌడ్‌ టీడీపీ 24578
1999 ఎ. ఇంద్రకరణ్‌ రెడ్డి కాంగ్రెస్‌ ఎన్‌. ఇంద్రకరణ్‌ రెడ్డి టీడీపీ 15046
1996 ఎన్‌. ఇంద్రకరణ్‌ రెడ్డి టీడీపీ అప్పాల మహేశ్‌ కాంగ్రెస్‌ 33026
1994 ఎస్‌. వేణుగోపాల చారి టీడీపీ పి. నర్సారెడ్డి కాంగ్రెస్‌ 23873
1989 ఎస్‌. వేణుగోపాల చారి టీడీపీ ఎ. భీంరెడ్డి కాంగ్రెస్‌ 4989
1985 ఎస్‌. వేణుగోపాల చారి టీడీపీ జివి నర్సారెడ్డి కాంగ్రెస్‌ 23215
1983 ఎ. భీంరెడ్డి టీడీపీ పిజి రెడ్డి కాంగ్రెస్‌ 16149
1978 పి. గంగారెడ్డి కాంగ్రెస్‌ (ఐ) పి. నర్సారెడ్డి కాంగ్రెస్‌ 2008
1972 పి. నర్సారెడ్డి కాంగ్రెస్‌ ఏకగ్రీవం ఏకగ్రీవం 0
1967 పి. నర్సారెడ్డి కాంగ్రెస్‌ ఎల్‌. ప్రభాకర్‌ రెడ్డి స్వతంత్య్ర 9284
1962 పి. నర్సారెడ్డి కాంగ్రెస్‌ పి. రెడ్డి స్వతంత్య్ర 14423

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

లక్కడి జగన్‌ మోహన్‌ రెడ్డి , డాక్టర్‌ యు.కృష్ణంరాజు , అల్లోల మురళీధర్‌ రెడ్డి

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

స్వర్ణ ప్రాజెక్ట్‌ , నిర్మల్‌లో అల్లోల చిన్నమ్మ నారాయణ రెడ్డి ట్రస్ట్‌ , సాయిదీక్ష సేవా సమితి, అయిండ్ల భీంరెడ్డి ట్రస్టు , భగవాన్‌ సత్యసాయి ట్రస్టు , ఈశ్వరీయ బ్రహ్మకుమారీ సంస్థ నిర్మల్‌ నియోజకవర్గం సారంగాపూర్‌ మండలంలోని స్వర్ణ ప్రాజెక్ట్‌ అతి పురాతనమైనది. ఆ ప్రాజెక్ట్‌ పరిధిలో లక్ష ఎకరాల వరకు వ్యవసాయ సాగుకు నీరందుతుంది. నిర్మల్‌ పట్టణ కేంద్రంలోని సిద్దాఫూర్‌ ఫిల్టర్‌ బెడ్‌కు నీరందిస్తుంది. దీంతో పట్టణ ప్రజలకు కొంత మేరకు తాగునీటి సమస్య తీరుతుంది. ఈ ప్రాజెక్ట్‌ పునర్నిర్మాణం , లీకేజీల మరమ్మత్తుల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించి ఆధునీకరిస్తుంది. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో పలు సేవా సంస్థలు సామాజిక సేవలు అందిస్తున్నాయి.
 
సాయిదీక్ష సేవా సమితి సామూహిక వివాహాలు , అక్షయ పాత్ర ద్వారా పేదలకు అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అల్లోల నారాయణ రెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో యువతను ప్రోత్సాహించేందుకు క్రీడా పోటీలతో పాటు పేద ప్రజలను ఆదుకునేందుకు అంబులెన్స్‌ ఏర్పాటు చేసి మారుమూల ప్రాంత ప్రజలకు సేవలను అందిస్తోంది. భగవాన్‌ శ్రీ సత్యసాయి ట్రస్టు ఆధ్వర్యంలో మహిళ శిశు సంక్షేమ ఆసుపత్రిలోని రోగులకు ప్రతినిత్యం ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

అభివృద్ధి ప‌థ‌కాలు

నిర్మల్‌ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలు, మిషన్‌ భగీరథ , మిషన్‌ కాకతీయ , రూ. 514 కోట్లతో మామడ మండలంలోని పొన్కల్‌లో సదర్‌మాట్‌ బ్యారేజీ నిర్మాణం , కాలేశ్వరం ప్యాకేజీ కింద హైలెవల్‌ కెనాల్‌ నిర్మాణం పనులు , వ్యవసాయ గిడ్డంగుల నిర్మాణాలు, రూ. 68 కోట్లతో 389 ఆలయాల పునర్నిర్మాణ పనులు , నాలుగు వరుసల జాతీయ రహదారి విస్తరణ పనులు, రూ. 60కోట్లతో కలెక్టర్‌ సమీకృత కార్యాలయాలు, జిల్లా పోలీసు కార్యాలయం, రూ. కోటితో మత్య్సకార సంఘ భవనం, రూ. 4 కోట్లతో డైట్‌ కళాశాల ఏర్పాటుతో పాటు పలు గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ కళాశాలల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్‌ పథకాలు , వైకుంఠ ధామాలు , డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

నిర్మల్‌ నియోజకవర్గ కేంద్రంలో బీడీ కార్మికుల సౌకర్యార్థం ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉంది. పీజీ కళాశాల కాకతీయ పరిధిలో ఏర్పాటై 25 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ విద్యార్థులు, అధ్యాపకులు లేక బోసిపోయింది. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ప్రజలకు ఆహ్లాదం కలిగించేలా పార్కుల నిర్మాణం జరగలేదు
 
నిర్మల్‌లో కొయ్య బొమ్మల పరిశ్రమ , చుట్టు పక్కల కోటలు, బురుజులు, తటాకాలున్నప్పటికీ పర్యాటక కేంద్రంగా గుర్తింపుకు నోచుకోలేదు. టిఎస్‌ ఐపాస్‌ ఏర్పాటు చేసినప్పటికీ ఉహించని రీతిలో కొత్త పరిశ్రమలు నెలకొల్పడం లేదు. నిర్మల్‌లో విద్యార్థులు, ఉద్యోగులు , మహిళ ఉద్యోగులకు వర్కింగ్‌ ఉమెన్‌ హస్టల్‌ లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఆర్మూర్‌ నుంచి నిర్మల్‌ రైల్వే నిర్మాణ పనులు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఏర్పాటు చేయాల్సింది ఉండగా దశాబ్దానికి పైగా కార్యరూపం దాల్చడం లేదు.

ముఖ్య ప్రాంతాలు

నిర్మల్‌ నియోజకవర్గంలో నిమ్మ నాయుడు కాలం నాటి కోటలు, బురుజులు, చారిత్రక ప్రసిద్ది గాంచాయి. పట్టణ కేంద్రంలో శ్యాంఘడ్‌తో పాటు చుట్టుపక్కల బత్తీస్‌ఘడ్‌ , ఖిల్లా గుట్టా , ఇసురాళ్ళ గుట్ట , శరద్‌ మహల్‌తో పాటు నిర్మల్‌లో నెలకొన్న కొయ్య బొమ్మలు , పెయింటింగ్స్‌ అంతర్జాతీయ ప్రసిద్ది చెందినవి. నియోజకవర్గంలోని సారంగాపూర్‌ మండలం అడెల్లి పోచమ్మ , దిలావర్‌పూర్‌ మండలంలోని కదిలి పాపహరేశ్వర స్వామి ఆలయం , కాల్వ నర్సింహ స్వామి ఆలయం, నిర్మల్‌లోని పురాతన దేవరకోట వెంకటేశ్వర ఆలయం, గండి రామన్న దత్తసాయి ఆలయం, హరిహరక్షేత్రంలోని అయ్యప్ప ఆలయం, మామడ మండలంలోని పొన్కల్‌ వెంకటేశ్వర స్వామి ఆలయం, లక్ష్మణచాంద మండలంలోని బూరుగుపల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి.
 
జాతీయ స్థాయిలో కూచిపూడి నృత్యంలో నిర్మల్‌ నియోజకవర్గం నర్సాపూర్‌ (జి) గ్రామానికి చెందిన రాధ రాజారెడ్డి దంపతులు రాష్ట్రపతి చేతుల మీదుగా విశేష పురస్కారాలు అందుకొని కూచిపూడి , భరతనాట్యంతో చరిత్ర సృష్టించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపుదిద్దడంలో నిర్మల్‌కు చెందిన శిల్ప కళా నిపుణుడు బివిఆర్‌ చారి మన్ననలు అందుకున్నారు. నేడు కనిపించే తెలంగాణ తల్లి విగ్రహ నమూనా ఆయన రూపుదిద్దిందే.

ఇతర ముఖ్యాంశాలు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంగా కొనసాగుతున్నప్పటికీ నిర్మల్‌ నియోజకవర్గం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడి నుంచి ఎన్నికైన నాయకులు కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా పని చేసి వన్నెతెచ్చారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించిన వారిలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు నర్సారెడ్డి, అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ పార్టీ ఢిల్లీ అధికార ప్రతినిధి వేణుగోపాల చారి , రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రిగా చేసిన అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డిలు తమదైన శైలిలో నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తుండగా పార్లమెంట్‌ సభ్యులుగా కూడా నర్సారెడ్డి , ఇంద్రకరణ్‌ రెడ్డి, వేణుగోపాల చారిలు ఎన్నికై కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించగా వీరిలో వేణుగోపాల చారి కేంద్ర విద్యుత్‌ సహయ, వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పని చేశారు. నాటి నుంచి నేటి వరకు రాజకీయ చైతన్యంతో నియోజకవర్గం ఆకట్టుకుంటోంది.

వీడియోస్

ADVT