నియోజకవర్గం : అసెంబ్లీ

సత్తుపల్లి

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
ఖమ్మం
మొత్తం ఓటర్లు :
218170
పురుషులు :
108447
స్త్రీలు :
109718
ప్రస్తుత ఎమ్మెల్యే :
సండ్ర వెంకటవీరయ్య (తెలుగుదేశం)
ప్రస్తుత ఎంపీ :
పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 218170
పురుషలు: 108447
స్త్రీలు: 109718
ఇతరులు:5
నియోజకవర్గంలో కీలక వర్గాలు: 
నియోజకవర్గంలో ప్రధానంగా ఎస్సీ ఓటర్లు 46 వేల వరకు ఉన్నారు. వీరిలో ఎస్సీ మాదిగ 32 వేల ఓటర్లున్నారు. తరువాతి స్థానంలో బీసీ ఓటర్లు 26వేల వరకు ఉన్నారు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: ఎస్సీ
ఏ లోక్‌సభ పరిధిలో ఉంది: ఖమ్మం 
నియోజకవర్గంలోని మండలాలు: వేంసూరు, సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 సండ్ర వెంకట వీరయ్య టీడీపీ పిడమర్తి రవి టీఆర్‌ఎస్ 19002
2009 సండ్ర వెంకటవీరయ్య టీడీపీ సంబాని చంద్రశేఖర్ కాంగ్రెస్ 14645
2004 జలగం వెంకటరావు కాంగ్రెస్ తుమ్మలనాగేశ్వరరావు టీడీపీ 9680
1999 తుమ్మలనాగేశ్వరరావు టీడీపీ పొంగులేటిసుధాకర్‌రెడ్ది కాంగ్రెస్ 31630
1994 తుమ్మలనాగేశ్వరరావు టీడీపీ జలగంప్రసాదరావు కాంగ్రెస్ 7668
1989 జలగం ప్రసాదరావు కాంగ్రెస్ తుమ్మలనాగేశ్వరరావు టీడీపీ 6429
1985 తుమ్మలనాగేశ్వరరావు టీడీపీ లక్కినేని జోగారావు కాంగ్రెస్‌ 3818
1983 జలగం ప్రసాదరావు కాంగ్రెస్‌ తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ 6016
1979 జె.వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌(ఐ) యు.సత్యం కాంగ్రెస్‌(యు) 26300
1978 జలగం వెంగళరావు కాంగ్రెస్ వి.శాంతారాం కాంగ్రెస్‌(ఐ) 22619
1972 జలగం వెంగళరావు కాంగ్రెస్ రావి వీరవెంకయ్య సీపీఎం 38061
1967 జలగం వెంగళరావు కాంగ్రెస్ మోరంపూడి వెంకయ్య సీపీఎం 24476
1962 జలగం వెంగళరావు కాంగ్రెస్ వి.నాగేశ్వరరావు సీపీఐ 18606
1957 జలగం కొండలరావు కాంగ్రెస్ వి.నాగేశ్వరరావు పీడీఎఫ్ 7776
1952 కందిమళ్ల రామకృష్ణారావు పీడీఎఫ్ జలగం వెంగళరావు స్వతంత్య్ర 549

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

సత్తుపల్లి నియోజకవర్గంలోని వేంసూరు, కల్లూరు మండలాలకు చెందిన ముగ్గురు ప్రముఖలు ఫార్మారంగంలో అగ్రస్థానంలో ఉన్నారు.
బండి పార్థసారథిరెడ్డి: వేంసూరు మండలం కందుకూరుకు చెందిన బండి పార్థసారథిరెడ్డి హెటిరో గ్రూప్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌‌ను హైదరాబాద్‌ కేంద్రంగా నిర్వహిస్తున్నారు. సత్తుపల్లి మండలం బి.గంగారంలో ఆయన ఛైర్మన్‌గా ఇంజనీరింగ్‌ కళాశాల నిర్వహిస్తున్నారు. పలుసామాజిక సేవా కార్యక్రమాలను కూడా సాయిస్ఫూర్తి ట్రస్టు పేరుతో కొనసాగిస్తున్నారు.
భీమిరెడ్డి .సత్యనారాయణరెడ్డి: వేంసూరు మండలం ఎర్రగుంటపాడుకు చెందిన భీమిరెడ్డి సత్యనారాయణరెడ్డి, నోస్‌ ఫార్మా కంపెనీని హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. ఆ కంపెనీకి ప్రస్తుతం ఆయన మేనేజింగ్‌ డైరక్టర్‌గా కొనసాగుతున్నారు. కోటి రూపాయల తన సొంతఖర్చుతో స్వగ్రామంలో సిమెంట్‌రోడ్లు, డ్రైనేజీలను నిర్మించారు.
ఎస్‌కె.జానీమియా: కల్లూరుకు చెందిన ఎస్‌కె.జానీమియా క్రీసెంట్‌ ఫార్మా కంపెనీని హైదరాబాదులో నిర్వహిస్తున్నారు. ఆయన భాగస్వామ్యంలో కల్లూరులో ఒక ప్రైవేట్‌ పాఠశాలను ఏర్పాటు చేసారు.

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

కల్లూరు కేంద్రంగా కాకతీయ షుగర్‌ ఫ్యాక్టరీ నడుస్తోంది. సత్తుపల్లి కేంద్రంగా సర్వరాయ షుగర్స్‌ ఆధ్వర్యంలో బాటిలింగ్‌ యూనిట్‌ పనిచేస్తోంది. పెనుబల్లి మండలంలో 8వేల ఎకరాలకు సాగునీరందించే లంకాసాగర్‌ మధ్యతరహా ప్రాజెక్టు ఉంది.

అభివృద్ధి ప‌థ‌కాలు

సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి డబుల్‌లైన్ల రోడ్లనిర్మాణం పూర్తైంది. బుగ్గపాడులో ఫుడ్‌పార్కు నిర్మాణం కొనసాగుతోంది. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పనులు వేగంగా జరుగుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

నియోజకవర్గంలో ప్రధానంగా సాగునీరు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన ప్రధాన సమస్యగా ఉంది. వీటి పరిష్కారానికి గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్తుపల్లి మండలం బుగ్గపాడులో మెగాఫుడ్‌పార్కును మంజూరు చేసి, మౌలిక వసతుల కల్పనకు రూ.112కోట్లు కేటాయించారు. మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి అవుతున్నాయి. దీనిలో ప్రైవేట్‌ కంపెనీలు ఏర్పాటు జరిగితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 20వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నియోజకవర్గంలోని సాగునీటి సమస్య పరిష్కారానికి గోదావరి నీటి మళ్లింపు శరణ్యంగా ఉంది. ప్రభుత్వం చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం పూర్తి అయితే మూడేళ్లలో నియోజకవర్గం సస్యశ్యామలం కానున్నది.

ఇతర ముఖ్యాంశాలు

సత్తుపల్లి కేంద్రంగా నియోజకవర్గం 1977లో ఏర్పడింది. అంతకుముందు 1952 నుంచి వేంసూరు కేంద్రంగా నియోజకవర్గం ఉంది. 2009 వరకు జనరల్‌ స్థానంగా ఉన్న ఈ నియోజకవర్గం 2009లో షెడ్యూల్‌ కులాలకు రిజర్వ్‌ అయ్యింది. ఈ నియోజకవర్గంలోని కల్లూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ఖమ్మం పార్లమెంట్‌ సభ్యునిగా కొనసాగుతున్నారు. అదే గ్రామానికి చెందిన ఆయన సోదరుడు పొంగులేటి సుధాకర్‌రెడ్ది కాంగ్రెస్‌లో కొనసాగుతూ, ఎమ్మెల్సీగా శాసనమండలిలో ఉప నాయకుడిగా ఉన్నారు. ఇదే నియోజకవర్గంలోని పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామానికి చెందిన మువ్వా విజయ్‌బాబు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌గా పని చేస్తున్నారు. పూర్తి రాజకీయ చైతన్యం కలిగిన సత్తుపల్లి నియోజకవర్గం నుంచి అనేక మంది ప్రముఖులు రాజకీయంగా ఎదిగారు.

వీడియోస్

ADVT