నియోజకవర్గం : అసెంబ్లీ

ముథోల్‌

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
అదిలాబాద్
మొత్తం ఓటర్లు :
213520
పురుషులు :
104521
స్త్రీలు :
108982
ప్రస్తుత ఎమ్మెల్యే :
జి.విఠల్‌ రెడ్డి
ప్రస్తుత ఎంపీ :
గోడం నగేష్‌

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు : 2,13,520
పురుషులు : 1,04,521
స్త్రీలు : 1,08,982
ఇతరులు : 17
 
నియోజకవర్గంలో కీలకవర్గాలు : నియోజకవర్గ పరిధిలో ప్రధాన సామాజిక వర్గాల్లో మున్నూరుకాపు 25 శాతం, దళితులు 20 శాతం, ముస్లింలు 20 శాతం, మరాఠాలు 18 శాతం, రెడ్డిలు 15 శాతం ఉన్నారు. నియోజకవర్గ పరిధిలో మున్నురుకాపు కులస్థులు, మైనార్టీ వర్గాలకు చెందిన ఓటర్లు కీలకం కానున్నారు. ఎన్నికల ఫలితాల్లో మైనార్టీలదే ప్రధాన భూమికగా ఉంటోంది.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌ : ఓపెన్‌
నియోజకవర్గంలోని మండలాలు:
భైంసా, ముథోల్‌, తానూర్‌, కుంటాల, కుభీర్‌, లోకేశ్వరం, బాసర, నర్సాపూర్‌(పాక్షికంగా ) 
ఏ లోక్‌సభ పరిధిలో ఉంది: ఆదిలాబాద్‌ 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 జి. విఠల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ పి. రమాదేవి బీజేపీ 43331
2014 జి. విఠల్‌రెడ్డి కాంగ్రేస్‌ పి. రమాదేవి బీజేపీ 14837
2009 ఎస్‌. వేణుగోపాల చారి టీడీపీ విఠల్‌రెడ్డి ప్రజారాజ్యం 183
2004 బి. నారాయణరావ్‌ పటేల్‌ టీఆర్‌ఎస్‌ జగదీష్‌ మహాశెట్టివార్‌ బీజేపీ 41562
1999 గడ్డెన్న కాంగ్రేస్‌ నారాయణరావ్‌ పటేల్‌ టీడీపీ 850
1994 బి. నారాయణారావ్‌ పటేల్‌ టీడీపీ గడ్డెన్న కాంగ్రేస్‌ 32902
1989 గడ్డెన్న కాంగ్రేస్‌ బి. విఠల్‌ టీడీపీ 2286
1985 ఎ. హన్మంత్‌రెడ్డి టీడీపీ గడ్డెన్న కాంగ్రేస్‌ 14409
1983 గడ్డెన్న కాంగ్రేస్ ఎ. హనుమంత్‌రెడ్డి స్వతంత్రం 13844
1978 గడ్డెన్న కాంగ్రేస్‌ భీంరావ్‌ కదం జెఎన్‌పీ 24017
1972 గడ్డెన్న కాంగ్రేస్‌ ఏకగ్రీవం ఏకగ్రీవం 0
1967 గడ్డెన్న స్వతంత్రం గోపిడి గంగారెడ్డి కాంగ్రేస్‌ 22909
1962 గోపిడి గంగారెడ్డి కాంగ్రేస్‌ గడ్డెన్న స్వతంత్రం 1723
1957 గోపిడి గంగారెడ్డి స్వతంత్రం రంగారావ్‌ కాంగ్రేస్‌ 952

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

1. శివలింగయ్య (ప్రస్తుత మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ): ముథోల్‌ నియోజకవర్గ పరిధిలోని కుంటాల మండలం లింబా(కె) గ్రామానికి చెందిన నివాసి. ఇది వరకు నిర్మల్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా విధులు నిర్వహించి ఇటీవలనే పదోన్నతి పొంది మహాబుబాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.
 
2. రాధారెడ్డి (కూచిపూడి నృత్య కళాకారిణి,పద్మవిభూషన్‌ అవార్డు గ్రహీత): నియోజకవర్గ పరిధిలోని భైంసా మండలం కోతల్‌గావ్‌ గ్రామానికి చెందిన రాధారెడ్డి దేశంలోనే ఉత్తమ కూచిపూడి నృత్య కళాకారిణిగా పేరొందింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మవిభూషణ్‌ అవార్డును తన భర్త రాజారెడ్డితో కలిసి అందుకున్నారు.

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

గడ్డెన్నవాగు ప్రాజెక్టు : నియోజకవర్గ పరిధిలోని భైంసా పట్టణ సమీపంలో సుద్దవాగుపై రూ.186 కోట్ల వ్యయంతో 2006లో గడ్డెన్నవాగు ప్రాజెక్టు నిర్మించారు. 14 వేల ఎకరాలకు సాగు నీటిని అందించే లక్ష్యంతో నిర్మించి ప్రాజెక్టు ప్రధాన కాలువ 42 కిలోమీటర్లు ఉండగా ఇప్పటి వరకు కాలువ ఆధునీకరణ ,సీసీ పనులు కేవలం 26 కిలో మీటర్లు మాత్రమే పూర్తయ్యాయి. ప్రాజెక్టు ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు నిర్ణీత ఆయకట్టుకు అర్థశాతం కూడా సాగు నీటిని అందించలేదు. ప్రస్తుతం ముథోల్‌ నియోజక వర్గ పరిధిలోని భైంసా పట్టణంతో పాటు 186 గ్రామాలకు మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఈ ప్రాజెక్టు ద్వారానే తాగు నీటిని అందించే పనులు చురుకుగా కొనసాగుతున్నాయి.

అభివృద్ధి ప‌థ‌కాలు

నియోజకవర్గంలో మిషన్‌ భగీరథ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల వాసులకు తాగు నీటిని అందించేందుకు గాను పైప్‌లైన్‌ల ఏర్పాటు, ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, రిజర్వాయర్ల నిర్మాణ పనులు సాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధుల ద్వారా రోడ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఉపాధి హామీ నిధులతో ప్రభుత్వ పాఠశాలల్లో వంట షెడ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

నియోజకవర్గ పరిధిలో తాగు, సాగు నీటి సమస్యలు అధికంగా ఉన్నాయి. నియోజకవర్గంలో కార్మికుల కోసం ఏర్పాటు చేస్తామన్న ప్రత్యేక ఆసుపత్రి ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉండడంతో ఆ శాఖకు సంబంధించి సేవలు పూర్తి స్థాయిలో అందడం లేదు. వ్యాధుల బారిన పడ్డవారు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుంది. పల్సికర్‌ రంగారావ్‌ ప్రాజెక్టు నిర్వహణ పనులు దశాబ్ద కాలం నుంచి పెండింగ్‌లోనే ఉన్నాయి. గుండెగాం గ్రామస్థులకు పునరావాసం కల్పించే పనులు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు కాగితాలకే పరిమితమవుతున్నాయే తప్ప క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు.

ముఖ్య ప్రాంతాలు

బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి క్షేత్రం: చదువుల తల్లి కొలువైన శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి క్షేత్రం నియోజకవర్గ పరిధిలోని బాసర గ్రామంలో ఉంది. భారతదేశంలో రెండు సరస్వతీ ఆలయాలు ఉండగా ఒకటి బాసర మరొకటి కశ్మీర్‌ ప్రాంతంలో ఉంది. తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షర శ్రీకారాలు చేయించేందుకు గాను బాసరకు ప్రతినిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక్కడే వ్యాస మహర్షి ఆలయం కూడా పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. అమ్మవారి క్షేత్రం సమీపంలోనే గోదావరి నది మహరాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించి పరవళ్లు తొక్కుతుంది. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా పవిత్ర గోదావది నదిలో పుణ్య స్నానాలు ఆచరించిన పిమ్మటే అమ్మవారి దర్శినానికి వెళ్తుంటారు.

ఇతర ముఖ్యాంశాలు

ముథోల్‌ నియోజకవర్గ పరిధిలోని భైంసా పట్టణంలోని వివిధ స్వీట్‌ షాపుల్లో తయారయ్యే కలాం స్వీట్‌కు ప్రత్యేకత ఉంది. ఇక్కడి ప్రాంతానికి వచ్చే వారెవరైనా భైంసాలో తయారయ్యే కలాం స్వీట్‌ రుచి చూడాల్సిందే. వివిధ దేశాల్లో ఉన్న తమ బంధువులకు సైతం ఇక్కడి వారు కలాం స్వీట్‌ను పంపిస్తుంటారు. నియోజకవర్గ పర్యటనకు వచ్చే ప్రముఖులు, అధికారులు కలాం స్వీట్‌ను తప్పకుండా తింటారు .

వీడియోస్

ADVT