నియోజకవర్గం : అసెంబ్లీ

మంచిర్యాల

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
అదిలాబాద్
మొత్తం ఓటర్లు :
219797
పురుషులు :
110673
స్త్రీలు :
109078
ప్రస్తుత ఎమ్మెల్యే :
నడిపెల్లి దివాకర్‌రావు
ప్రస్తుత ఎంపీ :
బాల్క సుమన్

ఓట‌ర్లు

నియోజకవర్గం మొత్తం జనాభా: 2,98,650
పురుషులు: 1,50,600
స్ర్తీలు: 1,48,050
 
నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు: 2,19,797
పురుషులు: 1,10,673
స్ర్తీలు: 1,09,078 
ఇతరులు: 46
 
బీసీల ఆధిక్యత ఎక్కువగా ఉంది. పెరిక మొదటి స్దానంలో, మున్నూరుకాపు, బీసీలు రెండవ స్థానంలో ఉంటారు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌ - జనరల్‌
నియోజకవర్గంలో మండలాలు - మంచిర్యాల, హాజీపూర్‌, నస్పూర్‌, దండేపల్లి, జన్నారం ( పాక్షికంగా )
 లోక్‌ సభ నియోజకవర్గం - పెద్దపల్లి
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 నడిపెల్లి దివాకర్‌రావు టీఆర్‌ఎస్‌ ప్రేంసాగర్‌రావు కాంగ్రెస్‌ 5015
2014 నడిపెల్లి దివాకర్‌రావు టీఆర్‌ఎస్‌ గడ్డం అరవిందరెడ్డి కాంగ్రెస్‌ 59348
2009 గడ్డం అరవిందరెడ్డి టీఆర్‌ఎస్‌ గోనె హనుమంత్‌రావు టీడీపీ 78046

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

సంపత్‌రావు (కాంట్రాక్టర్‌), సిరిపురం రాజేశం (వ్యాపారి), మంచాల రఘువీర్‌ (ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం), సిరాజుల్‌ రెహమాన్‌(కాంట్రాక్టర్‌), సదాశివరెడ్డి (కాంట్రాక్టర్‌), చెట్ల జనార్దన్‌(బిజినెస్‌).

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

శ్రీపాద ఎల్లంపల్లి, రాళ్లవాగు, చెల్లంపేట, గూడెం ఎత్తిపోతల పథకం లాంటి ప్రాజెక్టులు ఉన్నాయి. సింగరేణి, ఓరియంట్‌, ఎంసీసీ సిమెంట్‌ పరిశ్రమలు, సిరామిక్స్‌, రైస్‌మిల్స్‌.

అభివృద్ధి ప‌థ‌కాలు

మంచిర్యాలలో బైపాస్‌ నిర్మాణం, నాగ్‌పూర్‌ - హైదరాబాద్‌ 4 లేన్‌ నిర్మాణం.

పెండింగ్ ప్రాజెక్టులు

మెడికల్‌ కళాశాల ఆవశ్యకత, ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేసినప్పటికీ అందుకు సంబంధించిన వైద్యులను, వైద్య నిపుణులను, సిబ్బందిని రిక్రూట్‌ చేయలేదు. సౌకర్యాలు అరకొరగా ఉన్నాయి. ప్రసవాలకు సంబంధించి ప్రత్యేక ఆసుపత్రి నిర్మాణానికి స్థలం కేటాయించినప్పటికీ పనులు మొదలు కాలేదు. భూగర్భ డ్రైనేజి సిస్టమ్‌ మంచిర్యాల పట్టణంలో పూర్తి స్థాయిలో నిర్మించాల్సి ఉంది.

ముఖ్య ప్రాంతాలు

పెద్దయ్య, చిన్నయ్య గుట్టలు, రెండో అన్నవరం, గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయం, చిత్తారయ్య గుట్టలు, ఎల్లంపల్లి ప్రాజెక్టు అందాలు, తదితరములు.

ఇతర ముఖ్యాంశాలు

మంచిర్యాల నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. జిల్లా కేంద్రంగా మారకముందే ఇక్కడ సింగరేణి ప్రాంతంలో పదవీ విరమణ చేసిన వారిలో అత్యధికులు సొంత ఇళ్లు కట్టుకొని ఉంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య పట్టణంగా బొగ్గు గనులు, సిమెంట్‌, విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలతో విలసిల్లుతోంది. నియోజకవర్గంలో రెడ్లు, వెలమలే గెలవడం, ఓడిపోవడం శరా మామూలు విషయం.

వీడియోస్

ADVT