నియోజకవర్గం : అసెంబ్లీ

పాలేరు

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
ఖమ్మం
మొత్తం ఓటర్లు :
204530
పురుషులు :
100293
స్త్రీలు :
104222
ప్రస్తుత ఎమ్మెల్యే :
కె.ఉపేందర్ రెడ్డి
ప్రస్తుత ఎంపీ :
పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 204530
పురుషులు: 100293
స్త్రీలు: 104222
నియోజకవర్గంలో కీలక వర్గాలు:
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతరకులాల ఓటర్లు ఉన్నారు. ఇందులో బీసీ కులం ఓట్లు ఎక్కువ

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: ఓపెన్‌
నియోజకవర్గంలో ఏఏ మండలాలు ఉన్నాయి: కూసుమంచి, తిర్మలాయపాలెం, ఖమ్మంరూరల్‌, నేలకొండపల్లి
ఏ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉంది: ఖమ్మం పార్లమెంట్‌
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 కె.ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ తుమ్మల నాగేశ్వర రావు టీఆర్‌ఎస్ 7669
2018 కె.ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ తుమ్మల నాగేశ్వర రావు టీఆర్‌ఎస్ 7669
2016 తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ -- కాంగ్రెస్ 45682
2014 రాంరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్‌ బేబీ స్వర్ణకుమారి టీడీపీ 21833
2009 రాంరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్‌ తమ్మినేని వీరబద్రం సీపీఎం 5666
2004 సంబాని చంద్రశేఖర్‌ కాంగ్రెస్‌ సండ్ర వెంకటవీరయ్య టీడీపీ 23922
1999 సంబాని చంద్రశేఖర్‌ కాంగ్రెస్‌ సండ్ర వెంకటవీరయ్య టీడీపీ 11528
1994 సండ్ర వెంకటవీరయ్య సీపీఎం సంబాని చంద్రశేఖర్‌ కాంగ్రెస్‌ 10156
1989 సంబాని చంద్రశేఖర్‌ కాంగ్రెస్‌ బాజీ హనుమంతు సీపీఎం 4315
1985 బాజీ హనుమంతు సీపీఎం సంబాని చంద్రశేఖర్‌ కాంగ్రెస్‌ 968
1983 భీమపాక భూపతిరావు సీపీఎం సంబాని చంద్రశేఖర్‌ కాంగ్రెస్‌ 8289
1981 సంబాని చంద్రశేఖర్‌ కాంగ్రెస్‌ బాజీ హనుమంతు సీపీఎం 4188
1978 పొట్టపింజర హుస్సేన్‌ కాంగ్రెస్‌ కోట గురుమూర్తి జెఎన్‌పీ 5752
1972 కత్తుల శాంతయ్య కాంగ్రెస్‌ బాజీ హనుమంతు సీపీఎం 24552
1967 కత్తుల శాంతయ్య కాంగ్రెస్‌ ఎస్‌.సుందరయ్య సీపీఎం 7825
1962 కత్తుల శాంతయ్య కాంగ్రెస్ ఎన్‌.పెద్దన్న సీపీఐ 1959

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

వనజీవి రామయ్య: రెడ్డిపల్లి గ్రామం, ఖమ్మంరూరల్‌ మండలం
వనజీవి రామయ్య అసలు పేరు దరిపల్లి రామయ్య. భారీగా మొక్కలు పెంచడం వలన వనజీవి రామయ్యగా పేరు వచ్చింది. చిన్నతనం నుంచి కుటుంబ భారాన్ని మోస్తూనే 43 ఏళ్లగా మొక్కలు పెంచుతున్నారు. చిన్నప్పుడు పాఠశాలలో చదివే సమయంలో ఉపాధ్యాయుడు మల్లేషం ప్రబోధించిన మొక్కల పెంపకం-లాభాలు అనే పాఠం ఆయనకు సూర్తినిచ్చింది. దీంతో మొక్కల పెంపకానికి అవిశ్రాంతంగా కృషిచేస్తున్నారు. దీంతో రామయ్య సామాజికసేవను గుర్తించిన కేంద్రం పద్మశ్రీ ఆవార్డుతో సత్కరించింది.2005లో సెంటర్‌ ఫర్‌ మీడియా సర్వీసెస్‌ సంస్థ నుంచి వనమిత్ర ఆవార్డు అందుకున్నారు.
 
ముదిరెడ్డి మహేందర్‌రెడ్డి డీజీపీ-తెలంగాణ
కూసుమంచి మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన ముదిరెడ్డి మహేందర్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర డీజీపీగా పనిచేస్తున్నారు. కూసుమంచిలో ఉన్నతవిద్యను అభ్యసించిన మహేందర్‌రెడ్డి వరంగల్‌ ఆర్‌ఈసీలో సివిల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. పలు జిల్లాల్లో వివిధ హోదాలలో పనిచేశారు.
 
పెందుర్తి రవి:
నేలకొండపల్లి మండలానికి చెందిన పెందుర్తి రవి అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో పెందుర్తి ఫౌండేషన్‌‌ను స్ధాపించి స్థానికంగా పలు సేవాకార్యక్రమాలను చేపడుతున్నారు.
 
రామడుగు ధర్మారావు: తిర్మలాయపాలెం మండలం రఘునాధపాలెం మండలానికి చెందిన రామడుగు ధర్మారావు హన్మకొండ మాజీ ఎమ్మెల్యే. బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహించారు.

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

మధుకాన్‌ సంస్ధలు: నేలకొండపల్లి మండలంలోని రాజేశ్వరపురం గ్రామంలో మధుకాన్‌ సంస్థల చక్కెర కర్మాగారం ఉంది. కర్మాగారంలో 20 మెగావాట్ల సామర్థ్యం గల పవర్‌ ప్రాజెక్ట్‌, ఇథనాల్‌ తయారీ కర్మాగారం ఉన్నాయి. ఖమ్మం రూరల్‌, తిరుమలాయ పాలెం మండలాలలో గ్రనైట్‌ పరిశ్రమలు, నల్లరాయి క్వారీలు ఉన్నాయి.

అభివృద్ధి ప‌థ‌కాలు

పాలేరు నియోజకవర్గంలో అన్ని మండలాలలో గ్రామాలను, తండాలను కలుపుతూ బీటీ రహదారుల నిర్మాణం పూర్తికావచ్చింది. ఇంటింటా తాగునీరందించే మిషన్‌ భగీరథ ప్రాజెక్టు పనులు చురుకుగా సాగుతున్నాయి. మిషన్‌ కాకతీయ పథకంలో చెరువు పూడికతీత పనులు జరుగుతున్నాయి. పాలేరు పాతకాల్వ ఆధునికీకరణ పనులు పూర్తవ్వగా, పిల్లకాల్వ మరమ్మతులు పనులు చేయాలి.

పెండింగ్ ప్రాజెక్టులు

పాలేరు నియోజకవర్గంలో సాగు, తాగు నీటి ఎద్దడి దీర్ఘకాలికంగా ఉన్నాయి. ఎందరు ప్రజాప్రతినిధులు వచ్చినప్పటికీ సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించలేకపోతున్నారు. కాగా, రాష్ట్రమంత్రి తుమ్మల నాగేశ్వరరావు సాగు, తాగునీటి సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. కూసుమంచి మండలం ఎర్రగడ్డ తండాలో సుమారు రు.350 కోట్లతో భక్తరామదాసు ప్రాజెక్టు నిర్మింపజేశారు. దీంతో చెరువులు నింపడం ద్వారా 70వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రయత్నం జరుగుతుండటంతో కొంత సమస్య తీరినట్లయింది.
 
పాలేరు జలాశయం వద్ద మిషన్‌ భగీరథ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే ఇన్‌టెక్‌వెల్‌ నిర్మాణం, జీళ్లచెరువు వద్ద హెడ్‌వర్క్స్‌ నిర్మాణాలు పూర్తయ్యాయి. గ్రామాలలో ఇంట్రాపైప్‌లైన్‌ నిర్మాణం కొనసాగుతోంది. ఇది పూర్తైతే తాగునీటి సమస్య ఉండదు. అదేవిధంగా నియోజకవర్గంలో బోదకాలు వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు. పైలెట్‌ ప్రాజెక్టు ద్వారా వ్యాధిగ్రస్థులకు వైద్యం అందించాల్సి ఉంది.

ముఖ్య ప్రాంతాలు

కూసుమంచి: కాకతీయుల కాలంనాటి శివాలయం, పాలేరు పార్యటకకేంద్రం
నేలకొండపల్లి: భక్తరామదాసు జన్మస్థలం నేలకొండపల్లి. ఇక్కడ స్మారక మందిరం, బావి ఇప్పటికీ ఉన్నాయి. అదేవిధంగా దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బౌధ్దరామం ఉంది. పురాతనకాలం నాటి ఉత్తరేశ్వరస్వామి ఆలయం, కాకతీయుల శిలాశాసనాలు చారిత్రాత్మకంగా ఉన్నాయి. ఖమ్మం రూరల్‌ మండలంలో చారిత్రాత్మక కట్టడం ఉంది. తిర్మలాయపాలెం మండలంలో జల్లేపల్లి గుట్ట ప్రసిద్ధి చెందింది. శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడి నుంచే ఈ ప్రాంతాన్ని పరిపాలించారని చెబుతుంటారు. కోనేరు, గణపతిదేవుడి విగ్రహాలు, రాతి దర్వాజ ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి.
విద్యాలయాలు: పాలేరు జవహార్‌ నవోదయ విద్యాలయం, ఖమ్మం రూరల్‌ మండలంలో ఇంజనీరింగ్‌, బీఫార్మసీ, బిఈడీ కళాశాలలు ఉన్నాయి.

ఇతర ముఖ్యాంశాలు

నియోజకవర్గం పూర్తిగా గ్రామీణప్రాంతం. 90 శాతం ప్రజలు వ్యవసాయాధారంగా జీవనం గడుపుతున్నారు. రైతులు, కూలీలే అధికం. కూసుమంచి, నేలకొండపల్లి, కొండపల్లి, ఖమ్మంరూరల్‌ మండలాలలో మాత్రమే సాగర్‌ నీటి సౌకర్యం ఉంది. తిర్మలాయపాలెం మండలం పూర్తిగా వర్షాధారంగా ఉంది. సాగర్‌ నీటి ఆధారంగా వరి, చెరుకు పంటలు పండిస్తున్నారు. కూసుమంచిలో సగభాగం, తిర్మలాయపాలెం మండలం పూర్తిగా వర్షాధారంగా పత్తి, కంది, పెసలు, వేరుశనగ సాగవుతాయి.

వీడియోస్

ADVT