నియోజకవర్గం : అసెంబ్లీ

అశ్వారావుపేట

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
ఖమ్మం
మొత్తం ఓటర్లు :
142573
పురుషులు :
70021
స్త్రీలు :
72541
ప్రస్తుత ఎమ్మెల్యే :
ఎం. నాగేశ్వర రావు
ప్రస్తుత ఎంపీ :
పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు :142573
పురుషులు :70021
స్త్రీలు :72541
ఇతరులు :11

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

ఈ నియోజకవర్గంలోని మండలాలు అంతకు ముందు సత్తుపల్లి, కొత్తగూడెం, బూర్గంపాడు నియోజకవర్గంలో ఉండేవి. పునర్విభజన తర్వాత అశ్వారావుపేట కొత్త నియోజకవర్గంగా ఏర్పాటయ్యింది. ఈ నియోజకవర్గంలో కుక్కునూరు,వేలేరుపాడు మండలాలు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రాలోని పశ్చిమగోదావరి జిల్లా పోలవరం అసెంబ్లీ పరిధిలోకి వెళ్లాయి.
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 ఎం.నాగేశ్వర రావు టీడీపీ తాటి వెంకటేశ్వర్లు టీఆర్‌ఎస్ 13117
2014 తాటి వెంకటేశ్వర్లు వైసీపీ మెచ్చా నాగేశ్వరరావు టీడీపీ 930
2009 వగ్గెల మిత్రసేన కాంగ్రేస్‌ పాయం వెంకయ్య సీపిఎం(ఉమ్మడిఅభ్యర్థి) 5107

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

పసుమర్తి మల్లిఖార్జునరావు
ఐఎఫ్‌ఎస్‌, చీఫ్ కన్జర్వేటర్‌ ఆఫ్ ఫారెస్ట్‌, ఏపీ మార్కెటింగ్‌ కమిటీ కమీషనర్‌గా పనిచేసి ప్రస్తుతం రిటైర్‌ అయ్యారు.

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

అశ్వారావుపేటలోని పెదవాగు మధ్యతరహా ప్రాజెక్టు, అంకమ్మచెరువు, ములకలపల్లి మండలంలో మూకమామిడి ప్రాజెక్టు, చండ్రుగొండ మండలంలో వెంగళరాయ ప్రాజెక్టు, అన్నపురెడ్డిపల్లి మండలంలో అన్నదైవం ప్రాజెక్టు.

అభివృద్ధి ప‌థ‌కాలు

నియోజకవర్గంలో ప్రస్తుతం రహదారులు, చెరువులు, మిషన్‌ భగీరథ ద్వారా పైపులైన్లు పనులు, భారీ వంతెనలు, పాఠశాల భవనాలు, డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ళ నిర్మాణాలు, మరుగుదొడ్లు నిర్మాణాలు జరుగుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

అశ్వారావుపేట నియోజకవర్గం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు కొత్తగా ఏ ఒక్క డివిజన్‌, సబ్‌ డివిజన్‌ కార్యాలయాలు కాని, ఎస్‌టీఓ, ఆర్టీఓ, కోర్టు, సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు వంటివి ఏమీ ఏర్పడకపోవడం పెద్ద సమస్యగా మారింది. కొత్తగూడెం జిల్లా కేంద్రం నుండి అశ్వారావుపేట మండలంలోని ఏ గ్రామంలోకి కూడా నేరుగా బస్సు సౌకర్యం లేకపోవడం ఇబ్బందిగా ఉంది. నియోజకవర్గ కేంద్రం, మండల కేంద్రాల అభివృధ్ది, సుందరీకరణ, డ్రైనేజీ సమస్య దశాబ్దాలుగా ఉన్నప్పటికీ అవి పరిష్కారం కాలేదు. జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు లేవు.

ముఖ్య ప్రాంతాలు

అశ్వారావుపేట మండలంలో గుబ్బల మంగమ్మ, చిలకలగండి ముత్యాలమ్మ, శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయాలు, వ్యవసాయ కళాశాల, కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రము, ఉద్యాన పరిశోధన కేంద్రం, ఉద్యాన నర్సరీ, ఆయిల్‌ఫెడ్‌ పామాయిల్‌ ఫ్యాక్టరీ, అటవీ పరిశోధన కేంద్రం, కెమిలాయిడ్స్‌, హెర్బల్ ఫ్యాక్టరీలు, లక్ష్మి తులసీ ఆగ్రో పేపరు మిల్లు, సెరికల్చర్‌ నర్సరీ, పామాయిల్‌ నర్సరీ, ఆయిల్‌ఫెడ్‌ డివిజన్‌ కార్యాలయాలు ఉన్నాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో 1600 ఎకరాల జీడి తోట ఉంది. ప్రస్తుతం దీనిలో వేరే పంట వేశారు.
 
దమ్మపేట మండలంలోని అప్పారావుపేటలో ఆయిల్‌ఫెడ్‌ పామాయిల్‌ ఫ్యాక్టరీ, కాశీ విశ్వేశ్వరస్వామి పురాతన ఆలయం, సంతాన వేణుగోపాల స్వామి, గాయత్రి సంజీవని ఆశ్రమం, నాగుపల్లిలో లక్ష్మినారాయణ స్వామి ఆలయం, శివాలయం, గండికింద ముత్యాలమ్మ ఆలయాలు ఉన్నాయి. అన్నపురెడ్డిపల్లిలో శివాలయం ఉంది
 

ఇతర ముఖ్యాంశాలు

నియోజకర్గ పరిధిలోని గండుగులపల్లి గ్రామం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వగ్రామం కావడంతో నియోజకవర్గ రాజకీయాలన్నీ ఆయన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అన్నపురెడ్డిపల్లి మండలంలో దేవాలయ భూ సమస్య అధికంగా ఉంది. నియోజకవర్గంలో 1/70 భూ సమస్యలు, పోడు భూముల సమస్యలు అధికంగా ఉన్నాయి. ఉద్యాన పంటలతో పాటు వరి పంట, వర్జీనియా పొగాకు వంటి వాణిజ్య పంటలు అత్యధికంగా ఉన్నాయి.
 
ఈ ప్రాంతం ఆంధ్రా సరిహద్దు ప్రాంతం కావడంతో ఎక్కువ మంది ఆంధ్రా నుండి వచ్చిన వలసదారులే ఉంటారు. సాంప్రదాయాలు, బంధుత్వాలు, రాకపోకలు ఆ ప్రాంతంలోనే ఉంటాయి. ఉద్యాన పంటలు, పామాయిల్‌ వంటి పంటలు అధికంగా ఉండటంతో ఆయా మొక్కల నర్సరీలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నికల ముందు వివిద పార్టీలలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లోనే ఉండటం విశేషం. ఇటీవల నేషనల్‌ హై రోడ్డు అశ్వారావుపేట మీదుగా కాకుండా ఏపి నుంచి వెళ్ళిపోవడంతో దీని ప్రభావం అశ్వారావుపేటపై తీవ్రంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో రాజకీయాలకు అతీతంగా యువకులు,పట్టణ వాసులు నేషనల్‌ హైవేరోడ్డు కోసం పోరాటం ప్రారంభించారు. ఇప్పుడిది సెంటిమెంట్‌గా మారింది. దీని ప్రభావం కూడా వచ్చే ఎన్నికల్లో ఉంటుందనే అభిప్రాయం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణా రాష్ర్టాలలోని అనేక మంది ప్రముఖులకు చెందిన భూములు ఉన్నాయి.

వీడియోస్

ADVT