నియోజకవర్గం : అసెంబ్లీ

వేములవాడ

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
కరీంనగర్
మొత్తం ఓటర్లు :
189950
పురుషులు :
91414
స్త్రీలు :
98533
ప్రస్తుత ఎమ్మెల్యే :
డాక్టర్‌ చెన్నమనేని రమేశ్
ప్రస్తుత ఎంపీ :
బి. వినోద్ కుమార్

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 1,89,950
పురుషులు: 91,414
స్త్రీలు: 98,533
ఇతరులు: 03
 
నియోజకవర్గంలోని కీలకమైన కులాలు:
మున్నూరుకాపు, పద్మశాలి, గౌడ, మాదిగ, మాల, వెలమ, రెడ్డి, బెస్త, ముదిరాజ్‌, బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, నాయీబ్రాహ్మణ, వైశ్య, ఎస్టీ, ముస్లిం మైనారిటీలు ఉన్నారు. వీరిలో బీసీ ఓటర్లయిన మున్నూరు కాపు, గౌడ, పద్మశాలీయుల ఓట్ల ప్రభావం ఉంటుంది. ఎస్సీ వర్గానికి చెందిన మాదిగ, మాల ప్రభావం కూడా ఉన్నప్పటికీ చాలాకాలంగా వెలమల ఆధిపత్యం కొనసాగుతోంది.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: ఓపెన్‌
నియోజకవర్గంలోని మండలాలు:
వేములవాడ అర్బన్‌, వేములవాడ రూరల్‌, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి, కథలాపూర్‌, మేడిపల్లి
లోక్‌సభ నియోజకవర్గం: కరీంనగర్‌ 
 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 చెన్నమనేని రమేశ్ టిఆర్‌ఎస్‌ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ 28186
2014 చెన్నమనేని రమేశ్ టిఆర్‌ఎస్‌ ఆది శ్రీనివాస్ బీజేపీ 5268
2010 చెన్నమనేని రమేశ్(ఉ.ఎ) టిఆర్‌ఎస్‌ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ 50451
2009 చెన్నమనేని రమేశ్ టిడిపి ఆది శ్రీనివాస్ కాంగ్రెస్‌ 1821

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

లేవు

అభివృద్ధి ప‌థ‌కాలు

వేములవాడ నియోజకవర్గంలో ప్రస్తుతం భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ముఖ్యంగా రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి దేవస్థానం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ టెంపుల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేసింది. ఆలయ అభివృద్ధికి 400 కోట్ల రూపాయలు కేటాయించడానికి హామీ ఇచ్చి ఇప్పటికి దాదాపు రెండు వందల కోట్లను కేటాయించింది. ఆలయ విస్తరణ కోసం గుడి చెరువును 35 ఎకరాలలో పూడ్చివేసి టాంక్‌బండ్‌ నిర్మాణం కొనసాగిస్తున్నారు. పట్టణంలో రోడ్ల విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మూలవాగుపై రెండు వంతెనలు నిర్మిస్తున్నారు. పట్టణం ఇరువైపులా బైపాస్‌ రోడ్డును విస్తరించడంతో పాటు నాలుగు వరుసల రహదారులను ఏర్పాటు చేశారు. వేములవాడ నగర పంచాయతీని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ చేశారు. ఎల్లంపల్లి కాలువ ద్వారా ఫాజుల్‌నగర్‌ రిజర్వాయర్‌కు, అక్కడి నుండి వేములవాడ, చందుర్తి మండలాల్లోని పలు గ్రామాలకు నీటిని అందిస్తున్నారు. కోనరావుపేట మండలం మల్కపేటలో రిజర్వాయర్‌ నిర్మాణ పనులు సాగుతున్నాయి. కథలాపూర్‌ మండలంలో సూరమ్మ చెరువు రిజర్వాయర్‌ పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. నియోజకవర్గంలో మిషన్‌ భగీరథ పనులు ప్రగతిలో ఉన్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

వేములవాడ నియోజకవర్గంలో గతంతో పోలిస్తే అభివృద్ధి వేగవంతమైంది. కొన్ని సమస్యలు ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదు. సాగునీటి సమస్యల పరిష్కారానికి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి ఫాజుల్‌నగర్‌ రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో పనులు కాకపోవడం వల్ల సాగునీటి సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. మల్కంపేట రిజర్వాయర్‌ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వర్షాభావం కారణంగా చెరువులలోకి నీరు చేరకపోవడంతో సాగునీటి సమస్యతో పాటు తాగునీటి సమస్య ప్రతి ఏడాది పునరావృతమవుతూనే ఉంది. ముఖ్యంగా వేములవాడ పట్టణంలో తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. ఏటా లక్షలాది రూపాయలు వెచ్చించి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సి వస్తోంది. వేములవాడ పట్టణ ప్రజలకు తాగునీటి కోసం ఉద్దేశించిన మిషన్‌ భగీరథ డిస్ర్టిబ్యూషన్‌ పైప్‌లైన్‌ పనులు, ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల నిర్మాణం పనులు ఇంకా ప్రారంభం కాలేదు. గుడి చెరువులోకి గోదావరి జలాలను తరలించే పైప్‌లైన్‌ పనులకు మోక్షం లభించలేదు. శ్రీరాజరాజేశ్వరస్వామి వారి దేవస్థాన అభివృద్ధి పనులు నాలుగేళ్లు కావస్తున్నా ప్రతిపాదనలు, డిజైన్ల దశలోనే ఉన్నాయి. వేమలువాడలో అగ్నిమాపక కేంద్రం భవనం పూర్తయినా ప్రారంభానికి నోచుకోలేదు. మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్వాసితులకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో పరిహారం అందలేదు.

ముఖ్య ప్రాంతాలు

వేములవాడ నియోజకవర్గంలో శ్రీరాజరాజేశ్వరస్వామి వారి దేవస్థానం రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. రాష్ట్రంలోనే అతిపెద్దదైన ఈ పుణ్యక్షేత్రానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ప్రతి సోమవారం, ఆది, శుక్రవారాలలో వేలాది మంది శ్రీస్వామివారిని దర్శించుకుంటారు. రాజన్న అనుబంధ ఆలయమైన నాంపెల్లిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగానూ, పర్యాటక క్షేత్రంగానూ విలసిల్లుతోంది.

వీడియోస్

ADVT