నియోజకవర్గం : అసెంబ్లీ

సిరిసిల్ల

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
కరీంనగర్
మొత్తం ఓటర్లు :
216056
పురుషులు :
106061
స్త్రీలు :
109995
ప్రస్తుత ఎమ్మెల్యే :
కె తారకరామారావు
ప్రస్తుత ఎంపీ :
బి. వినోద్ కుమార్

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 2,16,056 
పురుషులు: 1,06,061
మహిళలు: 1,09,995
ఇతరులు: 0
 
నియోజకవర్గంలో కీలక ఓటర్లు:
సిరిసిల్ల నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వీరి తరువాత ఎస్సీలు ఉండగా తరువాత వరుసలో రెడ్డిలు, వెలమలు  ఉన్నారు.మతంలో హిందువులే ఎక్కువగా ఉన్నారు. ఎన్నికల్లో వెలమ సామాజిక వర్గం కీలకంగా వ్యవహరించనుంది.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: జనరల్‌
నియోజకవర్గంలోని మండలాలు: సిరిసిల్ల, ఎల్లారెడ్డిపే, గంభీరావుపేట, ముస్తాబాద్‌, తంగళ్లపల్లి, వీర్నపల్లి.
లోక్‌సభ నియోజకవర్గం పరిధి: కరీంనగర్‌  
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 కె తారకరామారావు టీఆర్‌ఎస్ కేకే మహేందర్‌రెడ్డి కాంగ్రెస్ 89009
2014 కె తారకరామారావు టీఆర్‌ఎస్ కొండూరు రవీందర్‌రావు కాంగ్రెస్ 53004
2010 కె తారకరామారావు(ఉప) టీఆర్‌ఎస్ కేకే మహేందర్‌రెడ్డి కాంగ్రెస్ 68219
2009 కె తారకరామారావు టీఆర్‌ఎస్ కేకే మహేందర్‌రెడ్డి ఇండి 171
2004 కాసిపేట లింగయ్య టీఆర్‌ఎస్ సుద్దాల దేవయ్య టీడీపీ 17008
1999 సుద్దాల దేవయ్య టీడీపీ గడ్డం బాలస్వామి కాంగ్రెస్ 9652
1994 సుద్దాల దేవయ్య టీడీపీ గొట్టె భూపతి కాంగ్రెస్ 4517
1989 పాటి రాజం కాంగ్రెస్ నేరాటి ఎల్లయ్య బీఎస్పీ 524
1985 ఉప్పరి సాంబయ్య జనతా పాటి రాజం కాంగ్రెస్ 23563
1983 పాటిరాజం కాంగ్రెస్ గొట్టె భూపతి స్వతంత్ర 7699

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

లేరు

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

సిరిసిల్ల ప్రధానంగా వస్త్ర పరిశ్రమకు నిలయంగా ఉంది. నిజాం కాలంలో నిర్మించిన ఎగువ మానేరు ప్రాజెక్ట్‌ ఉంది.

అభివృద్ధి ప‌థ‌కాలు

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్యాకేజి పనుల్లో జిల్లాలో మల్కపేట ప్రాజెక్ట్‌, టన్నెల్‌ నిర్మాణాలు, మిషన్‌ భగీరథ పనులు, రింగ్‌ రోడ్డు, అపెరల్‌ పార్కు, వర్కర్‌ టు ఓనర్‌ పథకం కింద షెడ్ల నిర్మాణం పనులు.

పెండింగ్ ప్రాజెక్టులు

సిరిసిల్ల నియోజకవర్గంలో నేత కార్మికుల ఆత్మహత్యలు ప్రధాన సమస్యగా ఉండేవి. ప్రస్థుతం ప్రభుత్వ పరంగా బట్ట ఉత్పత్తి అర్డర్లు రావడంతో కార్మికుల సమస్యలు తగ్గిపోయాయి. ఆత్మహత్యలు నిలిచి పోయాయి. వారికి ప్రత్యేకంగా అపెరల్‌ పార్కు, వర్కర్‌ టు ఓనర్‌ పథకం, పొదుపు పథకం, యారన్‌ సబ్సిడీ వంటివి కల్పిస్తున్నారు. గ్రామాల్లో రోడ్లు, మురికి కాలువలు, సాగు, తాగు నీటి సమస్యల పరిష్కారం కోసం పనులు చేపట్టారు.

ముఖ్య ప్రాంతాలు

సిరిసిల్ల నియోజకవర్గంలో నర్మాల ప్రాజెక్ట్‌ పర్యాటక ప్రాంతంగా ఉంది.

ఇతర ముఖ్యాంశాలు

సిరిసిల్ల ఉద్యమాల గడ్డ. ఎర్రజెండా రెపరెపల మధ్య చైతన్యమే ఊపిరిగా ఇక్కడి ప్రజలు జీవనం సాగిస్తారు. ఒకనాడు నక్సలైట్లు, పోలీసుల మధ్య నలిగిపోయిన ఎన్నో గ్రామాల్లో విషాద, భయానక జ్ఞాపకాలున్నా విలక్షతను వీడలేదు. రైతాంగ పోరాటాలు, స్వాతంత్య్ర ఉద్యమంలో తమదైన భూమికను పోషించిన సిరిసిల్ల ప్రజలు ప్రతి ఎన్నికల్లో గడసరిగా నేతలకు వాతలు పెడుతూనే ఉన్నారు. ఉమ్మడి నియోజక వర్గం నుంచి 1952, 1957లో సిరిసిల్ల, నేరెళ్ల కలిసి ఉండగా 1962 ఎన్నికల నుంచి సిరిసిల్ల జనరల్‌ నియోజకవర్గంగా, నేరెళ్ల ఎస్సీ నియోజక వర్గంగా ఏర్పడ్డాయి.
 
2009 ఎన్నికల సమయంలో శాసనసభ పునర్విభజనలో నేరెళ్ల నియోజకవర్గం కనుమురుగైపోయింది. నేరెళ్లకు వీడ్కోలు పలుకగా సిరిసిల్ల నియోజకవర్గంలో కొంత భాగం వేములవాడ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. వస్త్ర పరిశ్రమకు కేంద్రంగా ఉన్న సిరిసిల్ల నేరెళ్లను తన ఒడిలోకి చేర్చుకుంది. పునర్విభజనలో నియోజకవర్గం రూపురేఖలు కూడా కొంత మేరకు మారిపోయాయి. సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌, గంభీరావుపేట మండలాలతో సిరిసిల్ల నియోజకవర్గం ఉండగా నేరెళ్ల నియోజక వర్గంలో ఉన్న సిరిసిల్ల రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ఇల్లంతకుంట మండలం మానకొండూర్‌ నియోజకవర్గంలో చేరిపోయింది. నేరెళ్ల నియోజకవర్గం రిజర్వుడు స్థానం కావడంతో వలస నేతల కన్నే ఎక్కువగా ఉండేది. జగిత్యాల మండలం అంతగిరికి చెందిన మాజీ మంత్రి సుద్దాల దేవయ్య తెలుగుదేశం నుంచి రెండుసార్లు గెలుపొందగా, 2004లో శాసన సభకు టిఆర్‌ఎస్‌ నుంచి కాసిపేట లింగయ్య గోదావరిఖని నుంచి వచ్చి గెలుపొందారు.

2009 పునర్విభజనలో జనరల్‌ స్థానంగా సిరిసిల్ల మారడంతో స్థానిక నాయకులే పోటీ పడుతారని భావించినా హైదరాబాద్‌ నుండి కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌ వలస వచ్చి టీఆర్‌ఎస్‌ నుండి గెలుపొందారు. 1962నుంచి 2010వరకు 12సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌, కాంగ్రెస్‌(ఐ)లు నాలుగు సార్లు, తెలుగుదేశం రెండుసార్లు, జనతాపార్టీ ఒకసారి, స్వతంత్ర అభ్యర్థులు రెండుసార్లు, 2004,2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందారు.  తెలంగాణ వాదం నేపథ్యంలో 2010లో కూడా టీఆర్‌ఎస్‌ను నియోజకవర్గ ప్రజలు మరోసారి గెలిపించారు. 2014లో మళ్లీ కేటీఆర్‌ ఘన విజయం సాధించి మంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం తనదేననే ధీమాతో ఉన్నారు.

వీడియోస్

ADVT