నియోజకవర్గం : అసెంబ్లీ

రామగుండం

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
కరీంనగర్
మొత్తం ఓటర్లు :
181177
పురుషులు :
92753
స్త్రీలు :
88395
ప్రస్తుత ఎమ్మెల్యే :
కోరుకంటి చందర్
ప్రస్తుత ఎంపీ :

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు : 1,81,177
పురుషులు: 92,753
స్త్రీలు: 88,395
ఇతరులు 29
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు:
ఎస్‌సీ మాదిగ, మాల, బీసీ కులాల్లో పద్మశాలి, గౌడ, కాపు కులాలు ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. ముస్లీంల ఓటర్లు కూడా కీలకంగానే ఉన్నారు. సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు 40 వేల మంది వరకు ఉండగా, అభ్యర్థుల గెలుపోటములను వారు ప్రభావితం చేయనున్నారు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: జనరల్‌
నియోజకవర్గంలో గల మండలాలు: పాలకుర్తి, అంతర్గాం, రామగుండం (అర్బన్‌), రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌.
ఏ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉంది: పెద్దపల్లి
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 కోరుకంటి చందర్ స్వతంత్ర ఎస్.సత్యనారాయణ టీఆర్ఎస్ 26090
2014 సోమారపు సత్యనారాయణ టీఆర్‌ఎస్‌ కోరుకంటి చందర్‌ టీఆర్‌ఎస్‌ రెబల్‌ 2295
2009 సోమారపు సత్యనారాయణ స్వతంత్ర కౌశిక హరి పీఆర్‌పీ 2220
2008 కొప్పుల ఈశ్వర్‌ టిఆర్‌ఎస్‌ (ఉ.ఎ) జి కుమార స్వామి కాంగ్రెస్‌ 33986
2004 కొప్పుల ఈశ్వర్‌ టిఆర్‌ఎస్‌ మాలం మల్లేశం టిడిపి 48378
1999 మాతంగి నర్సయ్య టిడిపి అడ్లూరి లక్ష్మన్‌ కుమార్‌ కాంగ్రెస్‌ 54012
1994 మాలం మల్లేశం స్వతంత్ర కొప్పుల ఈశ్వర్‌ టిడిపి 36239
1989 మాతంగి నర్సయ్య కాంగ్రెస్‌ మాలెం మల్లేశం టిడిపి 47341
1985 మాలం మల్లేశం టిడిపి జి నర్సయ్య కాంగ్రెస్‌ 17626
1983 మాతంగి నర్సయ్య టిడిపి జి ఈశ్వర్‌ కాంగ్రెస్‌ 19803

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

  • పరికిపండ్ల నరహరి, ఐఏఎస్‌, మధ్యప్రదేశ్‌
  • మల్లేపల్లి లక్ష్మయ్య, బుద్ధవనం ప్రాజెక్టు ఓఎస్‌డీ
  • వేల్పుల నారాయణ, అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
  • తాగుబోతు రమేష్‌ (సినిమా రంగం)
  • మిమిక్రి శివారెడ్డి (సినిమా రంగం)
  • మధుప్రియ (నేపథ్య గాయని)
  • మొగలిరేకులు ఫేం సాగర్‌(బుల్లి తెర హీరో)

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

సింగరేణి బొగ్గుగనులు, నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(ఎన్‌టీపీసీ), జెన్‌కో 62.5మెగావాట్ల బీ థర్మల్‌ ప్లాంట్‌, రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌) నూతన ప్లాంట్‌ నిర్మాణం, బసంత్‌నగర్‌ కేశోరాం సిమెంట్‌ పరిశ్రమ, ఎల్లంపల్లి ప్రాజెక్టు, గోలివాడ పంప్‌హౌస్‌.

అభివృద్ధి ప‌థ‌కాలు

రూ.700కోట్లతో మిషన్‌ భగీరథ పనులు. రూ.75కోట్లతో అంతర్గాం, పాలకుర్తి మండలాలకు సాగునీరు అందిచేందుకు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు. రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో రూ.80కోట్ల అమృత్‌ నిధులతో పనులు. ముఖ్యమంత్రి స్పెషల్‌ గ్రాంట్‌ నుంచి రూ.100కోట్లతో అభివృద్ధి పనులు. రూ.5400కోట్లతో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నిర్మాణ పనులు. రూ.6వేల కోట్లతో ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో టీఎస్‌టీపీపీ నిర్మాణ పనులు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోలివాడలో రూ.200కోట్లతో పంప్‌హౌస్‌ నిర్మాణం.

పెండింగ్ ప్రాజెక్టులు

సింగరేణి ప్రాంతమైన రామగుండం నియోజకవర్గంలో నిరుద్యోగం ప్రధాన సమస్య. మెడికల్‌ కళాశాల ఏర్పాటు పెండింగ్‌. ఎస్‌ఆర్‌ఎస్‌పీ చివరి ఆయకట్టు కావడంతో సాగునీరు అందని పరిస్థితి. రామగుండంలో జెన్‌కో బీ థర్మల్‌ విస్తరణ, ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు. రాజీవ్‌ రహదారి విస్తరణలో రైల్వే బ్రిడ్జి పెండింగ్‌లో ఉంది. అర్బన్‌లో సర్వీస్‌ రోడ్లు లేక నిత్యం ప్రమాదాలు. ఈ సమస్యలపై ఎలాంటి ప్రయత్నాలు, పురోగతి లేదు.

ముఖ్య ప్రాంతాలు

రామునిగుండాలు, ఎల్లంపల్లి ప్రాజెక్టు, బుగ్గరామస్వామి దేవాలయం, జనగామ త్రిలింగ రాజరాజేశ్వరస్వామి దేవాలయం.

ఇతర ముఖ్యాంశాలు

పారిశ్రామిక ప్రాంతం కావడం, తెలంగాణ దాహార్తిని తీర్చే ఎల్లంపల్లి ప్రాజెక్టు, తెలంగాణ విద్యుత్‌ కష్టాలు తీర్చే ఎన్‌టీపీసీ, బీ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు, రామగుండంలో భారీ ఎరువుల కర్మాగార నిర్మాణం. అత్యధిక కార్మికులు, కార్మిక సంఘాల ఉనికి, సింగరేణికి ప్రధాన కేంద్రం.

వీడియోస్

ADVT