నియోజకవర్గం : అసెంబ్లీ

మంథని

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
కరీంనగర్
మొత్తం ఓటర్లు :
201870
పురుషులు :
100989
స్త్రీలు :
100860
ప్రస్తుత ఎమ్మెల్యే :
డి.శ్రీధర్ బాబు
ప్రస్తుత ఎంపీ :
బాల్క సుమన్

ఓట‌ర్లు

నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు: 2,01,870
పురుషులు: 1,00,989
స్త్రీలు: 1,00,860
ఇతరులు:  21
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు: బీసీ వర్గాలు అత్యధికంగా ఉన్నాయి. ఆ తరువాత ఎస్సీలున్నారు. బీసీ వర్గాల్లో మున్నూరు కాపు, యాదవ, ముదిరాజ్‌, గౌడ, పద్మశాలి కులాల ఓటర్లు అధికంగా ఉన్నారు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 డి.శ్రీధర్ బాబు కాంగ్రెస్ పుట్ట మధుకర్ టీఆర్ఎస్ 16222
2014 పుట్ట మధు టీఆర్‌ఎస్‌ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కాంగ్రెస్‌ 19360
2009 దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కాంగ్రెస్‌ పుట్ట మధు పీఆర్‌పీ 13209
2004 దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కాంగ్రెస్‌ సోమారపు సత్యనారాయణ టీడీపీ 15271
1999 దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కాంగ్రెస్‌ చంద్రపట్లరాంరెడ్డి టీడీపీ 15231
1994 చంద్రుపట్ల రాంరెడ్డి టీడీపీ శ్రీపాదరావు కాంగ్రెస్‌ 21155
1989 దుద్దిళ్ళ శ్రీపాదరావు కాంగ్రెస్‌ బెల్లకొండ సక్కుభాయ్‌ టీడీపీ 6078
1985 దుద్దిళ్ళ శ్రీపాదరావు కాంగ్రెస్‌ బెల్లంకొండ నర్సింగారావు టీడీపీ 1363
1983 దుద్దిళ్ళ శ్రీపాదరావు కాంగ్రెస్‌ సీఎన్‌. రెడ్డి స్వతంత్ర 1362

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

1. సీ.ఎల్‌.రాజం: పారిశ్రామికవేత్త, కాంట్రాక్టర్‌
2. గట్టు నారాయణ గురూజీ: గుజరాత్‌లో పలు కంపెనీలకు అడ్వయిజర్‌, ప్రముఖ అధ్యాత్మిక రచయిత
3. అల్లం నారాయణ: ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌,
4. అల్లం రాజయ్య: ప్రముఖ కవి, రచయిత
5. నల్ల వేంకటేశ్వర్లు: కాళేశ్వరం ప్రాజెక్టు సీఇ

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

1. సింగరేణి గనులు.
2. తాడిచర్ల ప్రైవేట్‌ బొగ్గు గని.
3. జెఎన్‌టీయూహెచ్‌.
4. కాళేశ్వరం ప్రాజెక్టు.
5. సింగరేణి ఓపెన్‌ కాస్టులు, అండర్‌ గ్రౌండ్‌ గనులు

అభివృద్ధి ప‌థ‌కాలు

1. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో గోదావరి నదిపై బ్యారేజీల నిర్మాణాలు.
2. కన్నెపల్లి, అన్నారం పంపహౌజ్‌ల నిర్మాణాలు.
3. మిషన్‌ భగీరథ పైపులైన్‌ నిర్మాణం.
4. గ్యాస్‌ పైపులైన్‌ నిర్మాణం.
5. మానేరు నదిపై ఓడెడ్‌, ఖమ్మంపల్లిల వద్ద వంతెనల నిర్మాణం.

పెండింగ్ ప్రాజెక్టులు

1. దీర్ఘకాలికంగా నియోజకవర్గంలోని మహాముత్తారం, పల్మెల మండలాల్లోని అటవీ గ్రామాల్లో ప్రజలు వాగులపై వంతెన నిర్మాణాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వారి కోసం వంతెనలు, రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. మంథని మండలంలో మర్రివాగు ప్రాజె క్టు దీర్ఘకాలికంగా నిర్మాణం కాలేదు. ఇటీవల అటవీ శాఖ అనుమతులు లభించినట్లు ఎమ్మెల్యే పుట్ట మధు ప్రకటించారు.
2. మంథని, రామగిరి, కమాన్‌పూర్‌ మండలాల్లో సింగరేణి భూ నిర్వాసితులకు పునరావాస, నష్ట పరిహారం సమస్యలు. వీటి పరిష్కారం కోసం పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇప్పించడానికి నిర్వాసితులతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.

ముఖ్య ప్రాంతాలు

1. మంథనిలోని పలు చారిత్రక ఆలయాలు, రామగిరిఖిల్లా, ఎల్‌మడుగు పర్యాటక కేంద్రాలు.
2. కాళేశ్వరంలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళేశ్వర ముక్తీశ్వర దేవాలయం.

ఇతర ముఖ్యాంశాలు

నియోజకవర్గం భౌగోళికంగా అత్యధిక విస్తరణ కలిగి ఉన్న ప్రదేశం. అటవీ, గ్రామీణ ప్రాంతం కూడా అధికం. మంథని ఎమ్మెల్యేగా పని చేసిన స్వర్గీయ పీ.వీ. నర్సింహారావు రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధాన మంత్రిగా పని చేశారు. మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు కూడా ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలుపొంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ స్పీకర్‌గా పని చేశారు. 10 సంవత్సరాల క్రితం వరకు మావోయిస్టు, నక్సలైట్లకు ప్రభావిత ప్రాంతంగా విరాజిల్లింది. చతుర్వేద పండితులకు, ఆలయాల ఆధ్యాత్మికతకు, పాక శాస్త్ర ప్రావీణ్యులకు నిలయంగా మారింది. గుమ్మడికాయ బరోడ, మోతిచూర లడ్డూ, చల్లా పులుసు లాంటి వంటకాలు మంథని ప్రత్యేకం.

వీడియోస్

ADVT