నియోజకవర్గం : అసెంబ్లీ

బహదూర్‌పురా

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
హైదరాబాద్
మొత్తం ఓటర్లు :
255735
పురుషులు :
132110
స్త్రీలు :
123580
ప్రస్తుత ఎమ్మెల్యే :
ముహమ్మద్‌ మౌజంఖాన్‌
ప్రస్తుత ఎంపీ :
అసదుద్దీన్ ఓవైసీ

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు - 2,55,735
పురుషులు - 1,32,110
మహిళలు - 1,23,580
ఇతరులు -  45
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు:
నియోజకవర్గంలో 80 నుంచి 85 శాతం ముస్లింలు ఉంటారు. మిగతా 15 నుంచి 20 శాతం హిందువులు, ఇతర వర్గాలకు చెందిన ప్రజలు నివాసముంటున్నారు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

జనరల్‌ కేటగిరీకి చెందిన ఈ నియోజకవర్గం... హైదరాబాద్ పార్లమెంట్ పరిథిలో ఉంది. బహదూర్‌పురా మండలం, ఫలక్‌నుమా, నవాబ్‌సాబ్‌కుంట, జహనుమా, దూద్‌బౌలి, రమ్నస్‌పురా, కిషన్‌బాగ్‌ డివిజన్లు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి.
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 మోజంఖాన్ ఎంఐఎం ఇనాయత్ అలీ బక్రీ టీఆర్‌ఎస్ 80869
2014 మౌజంఖాన్‌ మజ్లిస్ అబ్దుల్‌ రహ్మాన్‌ టీడీపీ 95045
2009 మౌజంఖాన్‌ మజ్లిస్‌ రజా హుసేన్‌ ఆజాద్‌ కాంగ్రెస్‌ 0

పెండింగ్ ప్రాజెక్టులు

జవహర్‌లాల్‌నెహ్రు జూపార్కు ఈ నియోజకవర్గంలోనే ఉంది. నియోజకవర్గంలో సమస్యలు అధికంగానే ఉన్నాయని చెప్పవచ్చు. ఇరుకుగా మారిన అంతర్గత రోడ్లతో వాహనదారులు అవస్థలుపడుతుంటారు. నియోజకవర్గం పరిధిలోనిచాలా బస్తీలకు బస్‌ సౌకర్యం లేదు. ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలల ఒక్కటి కూడా లేదు. నిజాం నవాబుల కాలంలోవేసిన డ్రైనేజీ, మంచినీటి పైపులే నేటికీ వాడుకలో ఉన్నాయి.

ఇతర ముఖ్యాంశాలు

నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలే 85 శాతం మంది నివాసముంటారు. వీరిలో అత్యధికులు మజ్లిస్‌ పార్టీకి సంప్రదాయిక ఓటర్లు. మజ్లిస్‌ పార్టీకి నియోజకవర్గంలో బలమైన ద్వితీయ శ్రేణి నాయకత్వం ఉంది. నియోజకవర్గంలోని ఆరు డివిజన్లకు కార్పొరేటర్లు మజ్లిస్‌ పార్టీ వారే ఉన్నారు.

వీడియోస్

ADVT