నియోజకవర్గం : అసెంబ్లీ

యాకుత్‌పురా

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
హైదరాబాద్
మొత్తం ఓటర్లు :
322485
పురుషులు :
166023
స్త్రీలు :
156430
ప్రస్తుత ఎమ్మెల్యే :
మహ్మద్‌ ముంతాజ్‌ ఖాన్‌
ప్రస్తుత ఎంపీ :
అసదుద్దీన్ ఓవైసీ

ఓట‌ర్లు

నియోజకవర్గం ఓటర్లు: - 3,22,485 
పురుషులు - 1,66,023
మహిళలు - 1,56,430
ఇతరులు - 32
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు: ముస్లింలు 62 శాతం, ఇతర వర్గాలు 38శాతం ప్రజలు ఉంటారు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

జనరల్‌ కేటగిరీకి చెందిన ఈ నియోజకవర్గం హైదరాబాద్ పార్లమెంట్ పరిథిలో ఉంది. చార్మినార్‌, బహదూర్‌పురా, బండ్లగూడ, సైదాబాద్‌ తదితర మండలాలు ఈ నియోజకవర్గం కిందకు వస్తాయి.
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 అహ్మద్ పాషాఖాద్రీ ఎంఐఎం సుందర్ రెడ్డి టీఆర్‌ఎస్ 46978
2014 ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ మజ్లిస్‌ సీహెచ్‌ రూప్‌రాజ్‌ బీజేపీ 34420
2009 ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ మజ్లిస్‌ జాఫర్‌ పహిల్వాన్‌ ఎంబీటీ 43292
2004 ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ మజ్లిస్‌ ఎం.ఎ గనీ ఎంబీటీ 34616
1999 ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ మజ్లిస్‌ ఫర్హత్‌ఖాన్‌ ఎంబీటీ 31332
1994 ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ ఎంబీటీ బాకర్‌ ఆగా మజ్లిస్‌ 8657
1989 ఇబ్రహీంబిన్‌ అబ్దుల్లా మస్కతి మజ్లిస్‌ అలీ రజా కాంగ్రెస్‌ 64257
1985 ఇబ్రహీంబిన్‌ అబ్దుల్లా మస్కతి మజ్లిస్‌ మహ్మద్‌ జైది టీడీపీ 49515
1983 ఖాజా అబు సయీద్‌ మజ్లిస్‌ సయ్యద్‌ సర్ఫరాజ్‌అలీ జేఎన్‌పీ 31636
1978 బాకర్‌ ఆగా మజ్లిస్‌ సయ్యద్‌ హసన్‌ జెఎన్‌పీ 11694
1972 సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీ మజ్లిస్‌ ఆర్‌.అంజయ్య బీజేఎస్‌ 16539
1967 ఖాజా నిజాముద్దీన్‌ మజ్లిస్‌ ఎస్‌.ఆర్‌.రావు బీజెఎస్‌ 9907
1962 ఎం.ఎ రషీద్‌ కాంగ్రెస్‌ మీర్‌ మహబూబ్‌అలీ పీడీఎఫ్‌ 3088

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

నిజాం మ్యూజియం, చంచల్‌గూడ జైలు, క్రిడా (అగ్రికల్చర్‌), పైగా టూంబ్స్‌, దర్గా బర్హానెషా ఈ నియోజకవర్గం పరిధిలోకే వస్తాయి.

అభివృద్ధి ప‌థ‌కాలు

నియోజకవర్గంలోని పలు బస్తీలలో సీసీ రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ పైపులైన్‌ పనులు జరుగుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

యాకుత్‌పురా నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. రోడ్లను విస్తరించాలి. యాకుత్‌పురా, బడాబజార్‌, చున్నేకీ బట్టి, ఖురేష్‌ లైన్‌, ఇమాంబాడ, రైన్‌బజార్‌లలో రోడ్లు ఇరుకుగా ఉన్నాయి. వాటి విస్తరణ పనులు ఇప్పటికీ చేపట్టలేదు. వర్షం వచ్చినప్పుడల్లా నాలాలు పొంగిపొర్లుతాయి. కొన్ని బస్తీల్లో వర్షపు ముంపుకు గురవుతుంటాయి. నాలా వెడెల్పు పనులు ఇప్పటివరకు చేపట్టలేదు.

వీడియోస్

ADVT