నియోజకవర్గం : అసెంబ్లీ

కోరుట్ల

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
కరీంనగర్
మొత్తం ఓటర్లు :
210667
పురుషులు :
101147
స్త్రీలు :
109514
ప్రస్తుత ఎమ్మెల్యే :
కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు
ప్రస్తుత ఎంపీ :
కల్వకుంట్ల కవిత

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 210667
పురుషులు: 101147
స్త్రీలు: 109514
ఇతరులు: 06
 
నియోజకవర్గంలోని కీలక వర్గాలు: పద్మశాలీ, గౌడ్స్‌, వైశ్యులు, కాపు కులస్థులు, ముస్లీం మైనార్టీలు

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

నడిమెట్ల శ్రీధర్‌: సింగరేణి సీఎండీగా పనిచేస్తున్నారు.
చెన్నమనేని విద్యాసాగర్‌ రావు: మహరాష్ట్ర గవర్నర్‌గా పనిచేస్తున్నారు. ఈయన గతంలో రద్దయిన మెట్‌పల్లి నియోజకవర్గం నుంచి వరసగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా వ్యవహరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

  • మెట్‌పల్లి ఖాధీ గ్రామోద్యోగ్‌ ప్రతిష్ఠాన్
  • గంగనాల ప్రాజెక్టు
  • ఎస్సారెస్పీ రివర్స్‌ వాటర్‌ పంప్‌హౌజ్‌

అభివృద్ధి ప‌థ‌కాలు

మిషన్‌ భగీరథ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నిర్మాణం. రాజేశ్వర్రావుపేట రివర్స్‌ వాటర్‌ పంప్‌హౌజ్‌ నిర్మాణం. గోదావరిపై సదర్‌మట్‌ ప్రాజెక్టు నిర్మాణం. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలు. అదనపు వాటర్‌ ట్యాంకుల నిర్మాణం. గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణాలు. మెట్‌పల్లి, కోరుట్లలలో పట్టణాల సుందరీకరణ పనులు జరుగుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

ఎస్సారెస్పీ నిర్మాణ సమయంలో ముంపుకు గురయి నియోజకవర్గంలో పునరావాసం కల్పించిన గ్రామాల్లో పలు సమస్యలు పరిష్కారం కావడం లేదు. పసుపు రైతులకు మద్దతు ధర లేకపోవడం. పసుపుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు డిమాండ్‌.
ప్రస్తుతం ఉన్న సమస్యలు: ముత్యంపేట ఎన్‌డీఎస్‌ఎల్‌ కర్మాగారం లే ఆఫ్‌లో ఉండడం. ఎస్సారెస్పీ కాలువల చివరి ఆయకట్టుకు నీరు అందకపోవడం వంటి సమస్యలు నెలకొన్నాయి.
వాటి పరిష్కారానికి జరుగుతున్న ప్రయత్నాలు: ప్రస్తుతం ఎస్సారెస్పీ కాలువల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అయ్యాయి. పనులు జరగాల్సి ఉంది. ముత్యంపేట ఎన్‌డీఎస్‌ఎల్‌ కర్మాగారం తెరిపించాలని ప్రతిపక్ష పార్టీలు, రైతులు ఆందోళనలు చేస్తున్నారు.

ముఖ్య ప్రాంతాలు

కోరుట్ల మండలం నాగులపేట శివారులో గల సైఫన్‌. జగ్గసాగర్‌ కొండస్వామి దేవస్థానం. వాల్గొండ రామలింగేశ్వర స్వామి. కోరుట్ల మండలం వెంకటాపూర్‌ శివారులో గల మర్రి.
ప్రభుత్వ, ప్రభుత్వేర కీలక సంస్థలు: లేవు.

ఇతర ముఖ్యాంశాలు

కోరుట్ల నియోజవకవర్గం జగిత్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లా సరిహద్దుల్లో ఉంది. మహారాష్ట్రలోని ముంబాయి, పూణె, బీవండి, కర్ణాటక తదితర ప్రాంతాలకు ఉపాధి నిమిత్తం ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇక్కడ అన్ని ప్రాంతాల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు మిలితమై ఉంటాయి. ఇతర ప్రాంతాల్లో లేని విధంగా చెరుకు, పసుపు వంటి వాణిజ్య పంటలను ఇక్కడి రైతులు పండిస్తుంటారు. బీడీ కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉంది. దుబాయి, షార్జా, బెహరాన్‌, ఖతర్, సౌది అరేబియా వంటి గల్ఫ్‌ దేశాలకు ఇక్కడి నిరుద్యోగ యువకులు ఉపాధి నిమిత్తం వలస వెళ్తున్నారు.

వీడియోస్

ADVT