నియోజకవర్గం : అసెంబ్లీ

కరీంనగర్

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
కరీంనగర్
మొత్తం ఓటర్లు :
277236
పురుషులు :
139065
స్త్రీలు :
138135
ప్రస్తుత ఎమ్మెల్యే :
గంగుల కమలాకర్‌
ప్రస్తుత ఎంపీ :
బి. వినోద్ కుమార్

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 2,77,236
పురుషులు: 1,39,065
స్త్రీలు: 1,38,135
ఇతరులు: 36
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు: 
ఈ నియోజకవర్గంలో 20 శాతం ముస్లింలు ఉన్నారు. అలాగే మున్నూరుకాపు, పద్మశాలి, యాదవులు, విశ్వబ్రాహ్మణులు, వైశ్యులు, గౌడ్స్‌, రెడ్డి, వెలమ కులస్థులు ఉన్నారు. మున్నూరుకాపు, పద్మశాలి, రెడ్డి, వైశ్య కులాలు ఎన్నికల్లో ఓట్లను ప్రభావితం చేసే సత్తాను కలిగి ఉన్నారు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: జనరల్‌
నియోజకవర్గంలో ఏయే మండలాలు ఉన్నాయి:
- కరీంనగర్‌ అర్బన్‌, కరీంనగర్‌ రూరల్‌, కొత్తపల్లి
ఏ లోకసభ నియోజకవర్గం పరిధిలో ఉంది
- కరీంనగర్‌
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 గంగుల కమలాకర్‌ టీఆర్‌ఎస్‌ బండి సంజయ్‌కుమార్‌ బీజేపీ 14974
2014 గంగుల కమలాకర్‌ టీఆర్‌ఎస్‌ బండి సంజయ్‌కుమార్‌ బీజేపీ 21546
2009 గంగుల కమలాకర్‌ టీడీపీ సిహెచ్‌.లక్ష్మినర్సింహారావు కాంగ్రెస్‌ 30134
2004 ఎం.సత్యనారాయణరావు కాంగ్రెస్‌ జి.నళిని టీడీపీ 16577
1999 కె.దేవేందర్‌రావు టీడీపీ వి.జగపతిరావు ఇండి.. 24312
1994 జె.చంద్రశేఖర్‌రావు టీడీపీ వి.జగపతిరావు కాంగ్రెస్‌ 22565
1989 వి.జగపతిరావు ఇండి. జె.చంద్రశేఖర్‌రావు టీడీపీ 427
1985 సి.ఆనందరావు టీడీపీ వి. జగపతిరావు కాంగ్రెస్‌ 7707
1983 కె.మృత్యుంజయం సంజయ్‌విచారమంచ్‌ ఎన్‌.కొండయ్య కాంగ్రెస్‌ 20510

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

అర్జున్‌ అవార్డు గ్రహీత మాదాసు శ్రీనివాస్‌రావు
ప్రముఖసాహితీ వేత్త, 14 భాషల్లో ప్రవీణుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్‌.

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

నియోజకవర్గంలో లోయర్‌ మానేరు డ్యాం ఉంది. దీని ద్వారా కరీంనగర్‌, హుజూరాబాద్‌ నియోజకవర్గాలకు చెందిన భూములకు సాగునీరు అందుతుంది. అలాగే ఈ డ్యాం నుంచి కాకతీయ కాలువ ద్వారా వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు ఎస్సారెస్పీ వెళ్తుంది. కరీంనగర్‌ కార్పొరేషన్‌తో పాటు సిద్ధిపేట, వేములవాడ, సిరిసిల్ల పట్టణాలకు కూడా తాగునీరు అందిస్తున్నారు. కరీంనగర్‌లో శాతవాహన యూనివర్శిటీ, వెటర్నరీ పాలిటెక్నిక్‌ కళాశాల, విత్తన పరిశోధన సంస్థ, ఆంబోతుల వీర్య పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. ప్రతిమ, చల్మెడ ఆనందరావు మెడికల్‌ సైన్సెస్‌ అనే రెండు ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలలు ఉన్నవి.

అభివృద్ధి ప‌థ‌కాలు

కరీంనగర్‌ సిటీ రెన్యూవేషన్‌లో భాగంగా 108 కోట్లతో ప్రధాన రోడ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అర్బన్‌ మిషన్‌ భగీరథ, యూజీడీ పనులు సాగుతున్నాయి. 506 కోట్లతో మానేరు రివర్‌ఫ్రంట్‌, 183 కోట్లతో కరీంనగర్‌-మానకొండూర్‌ వరకు మానేరు నదిపై సస్పెన్షన్‌ బిడ్ర్జి నిర్మాణం, నాలుగు లేన్ల రోడ్డుకు శంఖుస్థాపన చేశారు. ఐటీ పార్కు పనులు జరుగుతున్నవి. స్మార్ట్‌సిటీలో నగర సుందరీకరణ పనులతోపాటు సీఎం అష్యూరెన్సు పథకం కింద 247 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలంలో ఎలగందుల ఖిల్లాను పర్యాకటంగా అభివృద్ది చేసేందుకు పాత రోడ్డు పునరుద్దరించేందుకు బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు. కరీంనగర్‌ రూరల్‌, కొత్తపల్లి మండలాల్లో పలు గ్రామాల్లో ఆరు వందల కోట్ల రూపాయలతో రోడ్లను అభివృద్ధి చేశారు. మిషన్‌ భగీరథ పనులు కూడా కొనసాగుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

కరీంనగర్‌ నియోజకవర్గంలో 50శాతం ఓటర్లు కరీంనగర్‌ పట్టణంలోనే ఉన్నారు. అలాగే జనాభా కూడా ఇక్కడే ఎక్కువగా ఉంది. పట్టణ సమస్యలే నియోజకవర్గంలో ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. పదేళ్ల క్రితం ప్రారంభించిన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు ఇంకా పూర్తికాక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నగరంలో రోజుకు వెలువడుతున్న 210 మెట్రిక్‌ టన్నుల చెత్త వేసే డంపింగ్‌ యార్డు చెత్తతో నిండిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్త డంపింగ్‌ యార్డు కోసం ముగ్దుంపూర్‌లో భూమిని కేటాయించగా ఆ గ్రామస్తులు వ్యతిరేకిస్తుండటంతో డంపింగ్‌యార్డును అక్కడికి తరలించడం లేదు. ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉండటంతో క్రమబద్దీకరించేందుకు చర్యలు చేపడుతున్నారు. కరీంనగర్‌ పట్టణంలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఎంతో కాలంగా ఉన్నది. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు కేసీఆర్‌ హామీ ఇచ్చినా అమలుకు నోచుకోలేదు.

ముఖ్య ప్రాంతాలు

జిల్లా కేంద్రానికి 15 మీటర్ల దూరంలో ఉన్న ఎలగందుల గ్రామం పూర్వం ఎలగందుల సర్కార్‌గా వ్యవహరించబడింది. అప్పటి కాలంలో అక్కడి నుంచే పాలన కొనసాగింది. సుమారు ఐదు రాజవంశాలు ఖిల్లా నుంచి పాలన సాగించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. 1905లో కరీంనగర్‌ జిల్లా ఏర్పడడంతో అందులో భాగమైంది. కాకతీయులు, బహ్మనీలు, కుతుబ్‌షాహీలు, మొఘలులు, అసఫ్‌జాహీ వంశాల రాజులు పాలన చేశారు. మానేరు నదీ సమీపంలో భూమి నుంచి సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న ఎత్తైన గుట్టపై ఉన్న విశాలమైన ప్రాంతంలో శత్రుదుర్భేద్యంగా ఎలగందుల ఖిల్లాను నిర్మించారు. ఈ ఖిల్లాలో హిందూ, ముస్లిం ఆలయాలు, ప్రార్థన మందిరాలు కూడా ఉన్నాయి. సమైక్యరాష్ట్రంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి 5 కోట్ల రూపాయలను మంజూరు చేసి ఖిల్లాలో సౌండ్‌, లైటింగ్‌ షోతో అభివృద్ధి చేయగా, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా ఎలగందుల ఖిల్లాను పర్యాటకంగా అభివృద్ధిచేస్తున్నది. ఖిల్లా పైభాగంతోపాటు కింద ఉన్న శిథిలమైన పురాతన కట్టడాల వద్ద విద్యుద్దీపాలంకరణ ఏర్పాటు చేశారు. ఇప్పుడు లేజర్‌ కాంతులు, డిజిటల్‌ శబ్దాల మధ్య ఒక్కసారిగా వందల సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లే అనుభూతిని కలిగిస్తుంది. అయితే సౌండ్‌, లైటింగ్‌ ఏర్పాటుతో ప్రస్తుతం జిల్లా కేంద్రంలో సందర్శనీయ ప్రాంతంగా ఎలగందులకు మంచి గుర్తింపు వచ్చింది.

ఇతర ముఖ్యాంశాలు

జిల్లాలో దాదాపు 300 వరకు  గ్రనైట్‌ యూనిట్లు, దాదాపు 400 వరకు గ్రానైట్‌ కటింగ్‌, పాలిషింగ్‌ యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒరిస్సా, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌, బీహార్‌ తదితర రాష్ట్రాల కార్మికులు పనిచేస్తున్నారు. ఇక్కడి నుంచి చైనాకు గ్రనైట్‌ రాయిని ఎగుమతి చేస్తుండటంతో ఈ ప్రాంతం గ్రనైట్‌ హబ్‌గా పేరు గడించింది. జిల్లా కేంద్రంలో మాతా శిశు సంరక్షణ కేంద్రం, దాదాపు 400 వరకు ప్రైవేట్‌ నర్సింగ్‌హోంలు, హాస్పిటల్స్‌ ఉండటంతో పాత కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో రోగులు వైద్య చికిత్సల కోసం వస్తుంటారు.

వీడియోస్

ADVT