నియోజకవర్గం : అసెంబ్లీ

నాంపల్లి

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
హైదరాబాద్
మొత్తం ఓటర్లు :
296706
పురుషులు :
155159
స్త్రీలు :
141503
ప్రస్తుత ఎమ్మెల్యే :
జాఫర్ హుస్సేన్
ప్రస్తుత ఎంపీ :
బండారు దత్తాత్రేయ

ఓట‌ర్లు

నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు: 2,96,706
పురుషులు: 1,55,159
స్త్రీలు: 1,41,503
ఇతరులు: 44

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

నియోజకవర్గం పేరు: నాంపల్లి
రిజర్వేషన్‌: జనరల్‌
ఏ జిల్లా: హైదరాబాద్‌
నియోజకవర్గంలో ఎన్ని డివిజన్లు ఉన్నాయి: 6 
మల్లేపల్లి, ఆసిఫ్‌నగర్‌, మెహిదీపట్నం, రెడ్‌హిల్స్‌, ఆహ్మద్‌నగర్‌, విజయనగర్‌ కాలనీ.
ఏ లోక్‌సభ పరిధిలో ఉంది: సికింద్రాబాద్‌
 
నియోజకవర్గం చరిత్ర: నాంపల్లి నియోజకవర్గం 2009 సంవత్సరంలో కొత్తగా ఏర్పడింది. అంతకుముందు ఆసిఫ్‌నగర్‌ నియోజకవర్గంగా ఉండేది. డిమిలిటేషన్‌లో భాగంగా పాత ఆసిఫ్‌నగర్‌ నియోజకవర్గంలోని మల్లేపల్లి, రెడ్‌హిల్స్‌, ఆహ్మద్‌నగర్‌, విజయనగర్‌ కాలనీ, చింతలబస్తీ తదితర డివిజన్లు ఉండేవి. ఆయా డివిజన్లను నాంపల్లిలోని కలిపారు. ఆలానే పాత కార్వాన్‌ నియోజకవర్గంలోని మురాద్‌నగర్‌, ఆహ్మద్‌నగర్‌, ఆసిఫ్‌నగర్‌ మున్సిపల్‌ డివిజన్లను కొత్తగా నాంపల్లి నియోకవర్గంలో చేర్చారు. పాత ఆసిఫ్‌నగర్‌ నియోకవర్గంలోని జాంబాగ్‌, నాంపల్లి, గన్‌ ఫౌండ్రీ డివిజన్లను గోషామహల్‌ నియోజకవర్గంలో పొందుపర్చారు. ఆసిఫ్‌నగర్‌ పాత పేరును తొలిగించారు.
 
ఈ నియోజకవర్గం మిగతా ప్రాంతాల కన్న భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఓటర్లు.. అభివృద్ది పనులు, అభ్యర్థుల గుణగణాలు వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వరు. కేవలం మతం ఆధారంగానే ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటుంటారు. ఈ ప్రాంతంలో సుమారు 55 శాతం హిందూ. దాదాపు ముస్లీంలు 45 శాతం వరకు ఉంటారు. ప్రతి ఎన్నికల్లో ఇక్కడ మతం.. అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది.

2009లో నాంపల్లి నియోజకవర్గం నుంచి మజ్లీస్‌ అభ్యర్థి విరాసత్‌రసూల్‌ ఖాన్‌‌ను తొలి ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నారు. ఆ తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లీస్‌ పార్టీ కొత్త వ్యక్తి జాఫర్‌ హుస్సేన్‌కు టికెట్‌ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో కూడా జాఫర్‌ హుస్సేన్‌ ప్రత్యర్థులను చిత్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా మజ్లీస్‌ పార్టీ తరపున జాఫర్‌ హుస్సేన్‌ మళ్లీ రెండో దఫా అవకాశాన్ని దక్కించుకున్నారు.
 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 జాఫర్ హుస్సేన్ ఎంఐఎం మహ్మద్ ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ 9700
2014 జాఫర్ హుస్సేన్ మజ్లీస్ మహమ్మద్ ఫిరోజ్ ఖాన్ టీడీపీ 172936
2009 మహమ్మద్ విరాసత్‌రసూల్‌ ఖాన్‌ మజ్లీస్ మహమ్మద్ ఫిరోజ్ ఖాన్ ప్రజారాజ్యం 6799

ముఖ్య ప్రాంతాలు

నాంపల్లి నియోజకవర్గం.. నాంపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి ప్రారంభమై పక్కనే తెలుగువిశ్వవిద్యాలయం, పబ్లిక్‌గార్డెన్స్‌, లోపల రాష్ట్ర శాసనమండలి, రాష్ట్ర స్థాయిలో ఆరోగ్య ప్రదర్శన, స్టేట్‌ పురవాస్తు శాఖ మ్యూజియం, రాష్ట్ర అసెంబ్లీ, డీజీపీ కార్యాలయం, ఫ్యాప్సీ, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రి, నిలోఫర్‌ ఆస్పత్రి, నగర సిటీ క్రిమినల్‌ కోర్టు, ప్రత్యేక సీబీఐ కోర్టులు, నాంపల్లి మార్కేట్‌, నాంపల్లి ఏరియా ఆస్పత్రి, రాష్ట్ర స్థాయిలో మున్సిపల్‌ పాలన కార్యాలయం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, ఇంజినీర్‌ ఇన్‌- ఛీఫ్‌ ఆఫీస్‌, రాష్ట్ర సమాచర భవన్‌, జెఎన్‌టీయు, మహావీర్‌ ఆస్పత్రి, జాతీయ ఎన్‌ఎండీసీ ప్రధాన కార్యాలయం, సరోజినిదేవి కంటి అస్పత్రి, సంక్షేమభవన్‌, మిలటరీ ఏరియా,. మెహిదీపట్నం తదితర ప్రాంతాలున్నాయి.

వీడియోస్

ADVT