నియోజకవర్గం : అసెంబ్లీ

నిజామాబాద్ అర్బన్

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
నిజామాబాద్
మొత్తం ఓటర్లు :
225444
పురుషులు :
110967
స్త్రీలు :
114432
ప్రస్తుత ఎమ్మెల్యే :
బిగాల గణేష్ గుప్త
ప్రస్తుత ఎంపీ :
కల్వకుంట్ల కవిత

ఓట‌ర్లు

మొత్తం ఓట్లు: 225444
పురుషులు: 110967
స్త్రీలు: 114432
ఇతరులు: 45
 
నియోజకవర్గంలో కీలక సామాజికవర్గాలు: ఈ నియోజకవర్గంలో కాపు, పద్మశాలి, మైనార్టీ, వైశ్యులు, ఎస్సీ ఓట్లు కీలకం కానున్నాయి.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

జనరల్ కేటగిరీకి చెందిన ఈ నియోజకవర్గంలో నిజామాబాద్‌ నగర కార్పొరేషన్‌, నిజామాబాద్‌ సౌత్‌, నిజామాబాద్‌ నార్త్‌ మండలాలు ఉన్నాయి. నిజామాబాద్‌ లోక్‌సభ పరిథిలోకి ఈ నియోజకవర్గం వస్తుంది.
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 బిగాల గణేష్‌గుప్త టీఆర్‌ఎస్‌ తాహెర్‌బిన్ హందాన్ కాంగ్రెస్ 26055
2014 బిగాల గణేష్‌గుప్త టీఆర్‌ఎస్‌ మీర్‌మజార్‌అలీ ఎఐఎంఐఎం 10308
2010 లక్ష్మినారాయణ(ఉప ఎన్నిక) బీజేపీ డి.శ్రీనివాస్‌ కాంగ్రెస్ 11981
2009 లక్ష్మినారాయణ బీజేపీ డి.శ్రీనివాస్‌ కాంగ్రెస్ 24573
2004 డి.శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ సతీష్‌పవార్‌ --- 0
1999 డి.శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ వై.లక్ష్మినారాయణ --- 0
1995 సతిష్‌పవార్‌ టీడీపీ డి.శ్రీనివాస్‌ --- 0
1990 డి.శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ సత్యనారాయణ --- 0
1985 డి.సత్యనారాయణ టీడీపీ తాహెర్‌ --- 0
1983 డి.సత్యనారాయణ టీడీపీ డి.శ్రీనివాస్‌ -- 0
1978 ఎ.కిషన్‌దాస్‌ కాంగ్రెస్‌ గంగారెడ్డి -- 0
1972 వి.చక్రధర్‌రావ్‌ ఇండిపెండెంట్‌ గంగాధర్‌ -- 0
1962 హరినారాయణ ఇండిపెండెంట్‌ డి.హుస్సేన్‌ -- 0
1957 దావర్‌ హుస్సేన్‌ కాంగ్రెస్‌ కెఎ.రెడ్డి -- 0
1952 దావర్‌ హుస్సేన్‌ కాంగ్రెస్‌ వీఆర్‌జి.రెడ్డి -- 0

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

ఈ నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ వైద్య కళాశాల ఉంది. గిరిరాజ్‌ డిగ్రీ కళాశాల ఉంది. జిల్లా కలెక్టరేట్‌ నియోజకవర్గం పరిధిలోనే ఉంది.

అభివృద్ధి ప‌థ‌కాలు

ఈ నియోజకవర్గం పరిధిలో సుమారు 300 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నగరంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు, మిషన్‌ భగీరథ పనులు కొనసాగుతున్నాయి. వీటితో పాటు డ్రైనేజీ నిర్మాణాలు జరుగుతున్నాయి. రోడ్ల నిర్మాణాలు చేస్తున్నారు. నగరంలోని ఐలాండ్‌లను అభివృద్ధి చేస్తున్నారు.

పెండింగ్ ప్రాజెక్టులు

నియోజకవర్గం పరిధిలో దీర్ఘకాలికంగా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. నగరం మాస్టర్‌ ప్లాన్‌ ఇప్పటి వరకు ప్రకటించలేదు. ప్రధాన రోడ్లను వెడల్పూ చేయలేదు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు పూర్తిచేయలేదు. శివారు కాలనీలను అభివృద్ధి చేయలేదు. రింగ్‌ రోడ్‌ నిర్మాణం పూర్తికాలేదు. బైపాస్‌ రోడ్లు పూర్తిస్థాయిలో అభివృద్ధి కాలేదు. రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్‌, రైల్వే అండర్‌ బ్రిడ్జ్‌ల నిర్మాణం జరగలేదు.

ముఖ్య ప్రాంతాలు

ప్రముఖమైన నీలకంఠేశ్వర ఆలయం, సుభాష్‌నగర్‌ రామాలయం, ఖిల్లా రఘునాథ ఆలయం, ఖిల్లా జైళు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. సీఎస్‌ఐ చర్చ్‌ కూడా ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. రాష్ట్ర స్థాయిలో పేరుగాంచిన వ్యవసాయ మార్కెట్‌ ఈ నియోజకవర్గంలోనే ఉంది.

ఇతర ముఖ్యాంశాలు

నియోజకవర్గంలో అందరూ సీనియర్‌ నేతలే ఉన్నా నగర అభివృద్ధిని పట్టించుకోలేదు. రాష్ట్రస్థాయిలో మంత్రి పదవులు అనుభవించినా నియోజకవర్గం మాత్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు. విద్యాసంస్థలు కూడా అనుకున్న స్థాయిలో లేవు. వైద్య కళాశాల ఉన్నా ఇంజనీరింగ్‌ కళాశాల మాత్రం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పడలేదు.

వీడియోస్

ADVT