నియోజకవర్గం : పార్లమెంట్

అనకాపల్లి పార్లమెంట్

రాష్ట్రం :
ఆంధ్రప్రదేశ్
జిల్లా :
విశాఖపట్టణం
మొత్తం ఓటర్లు :
1387318
పురుషులు :
682176
స్త్రీలు :
705142
ప్రస్తుత ఎంపీ :
ముత్తంశెట్టి శ్రీనివాసరావు

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

బెల్లం మార్కెట్‌, చక్కెర కర్మాగారాలు, మైన్స్‌

అభివృద్ధి ప‌థ‌కాలు

అనకాపల్లి పార్లమెంట్‌ పరిధిలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరిగాయి. ఎంపీ నిధులతో పాటు హెచ్‌పీసీఎల్‌, ఎన్‌టీపీసీ వంటి సంస్థల నుంచి సీఎస్‌ఆర్‌ నిధులతో కూడా అభివృద్ధి పనులు చేపట్టారు. పలు గ్రామాలను దత్తత తీసుకొని సుందరంగా తీర్చిదిద్దారు. నియోజవకర్గం పరిధిలోని అనకాపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నం రోడ్డు రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేశారు. అనకాపల్లిలో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

పెండింగ్ ప్రాజెక్టులు

తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీ దీర్ఘకాలిక సమస్య. ఈ సమస్య పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు కృషి చేస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా మూతపడిన షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తామని దేశం నేతలు హామీ ఇచ్చారు. ఫ్యాక్టరీ అంశం ముఖ్యమంత్రి వద్ద పెండింగ్‌లో వుంది.
 
తుని-నర్సీపట్నం-మాడుగుల-దేవరాపల్లి మీదుగా కొత్తవలసకు రైల్వే లైన్‌ సర్వే జరిగింది కానీ పనులు ప్రారంభం కాలేదు. నర్సీపట్నం మెయిన్‌ రోడ్డు విస్తరణ జరగాల్సి ఉంది. మల్కన్‌గిరి నుంచి సీలేరు, చింతపల్లి, నర్సీపట్నం, చోడవరం, సబ్బవరం మీదుగా విశాఖపట్నం వరకు జాతీయ రహదారి నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు.

ముఖ్య ప్రాంతాలు

బొజ్జన్నకొండ అభివృద్ధి జరగాల్సి వుంది. బొజ్జన్నకొండకు వెళ్లే మార్గంలో రోడ్లను మెరుగుపరచి విద్యుత్‌ సౌకర్యం కల్సించాల్సి ఉంది. కృష్ణదేవిపేటలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పార్కు అభివృద్ధి చేయాల్సి ఉంది. రైవాడ, తాండవ, కోనాం, పెద్దేరు రిజర్వాయర్లను ప్రస్తుతం ఉన్న దానికంటే మరింత అభివృద్ధి చేయాల్సి ఉంది.

ఇతర ముఖ్యాంశాలు

పార్లమెంట్‌ నియోజకవర్గం ఏర్పడిన తరువాత అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ ఎంపీగా అప్పటి టీడీపీ ప్రత్యర్థి పెతకంశెట్టి అప్పలనర్సింహంపై 9ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం దేశంలోనే చరిత్ర సృష్టించింది.

వీడియోస్

ADVT