నియోజకవర్గం : అసెంబ్లీ

మహేశ్వరం

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
రంగారెడ్డి
మొత్తం ఓటర్లు :
412460
పురుషులు :
213528
స్త్రీలు :
198882
ప్రస్తుత ఎమ్మెల్యే :
సబితా ఇంద్రారెడ్డి
ప్రస్తుత ఎంపీ :
కొండా విశ్వేశ్వరరెడ్డి

ఓట‌ర్లు

మొత్తం నియోజకవర్గ ఓటర్లు: 4,12,460 
పురుషులు: 2,13,528
స్త్రీలు: 1,98,882
ఇతరులు: 50
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు : బీసీలు, ముస్లీంలు, సెటిలర్లు కీలకం.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

ఓపెన్ కేటగిరీకి చెందిన ఈ నియోజకవర్గం చేవేళ్ల పార్లమెంట్ స్థానం పరిధిలో ఉంది. మహేశ్వరం, కందుకూరు, బాలాపూర్‌ మండలాలతో పాటు సరూర్‌నగర్‌ మండలంలోని కొంత భాగం ( సరూర్‌నగర్‌, ఆర్కే పురం మున్సిపల్‌ డివిజన్లు) ఈ నియోకవర్గంలో ఉన్నాయి.  నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో ఇబ్రహీపట్నం నుంచి మహేశ్వరం, కందుకూరుతో పాటు సరూర్‌నగర్‌లోని కొంత భాగాన్ని కలిపి కొత్తగా మహేశ్వరం నియోజకవర్గం ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో మొదటి సారిగా 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి తీగల కృష్ణారెడ్డిపై కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన మంత్రి సబితారెడ్డి 7833 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరుపున మల్‌రెడ్డిరంగారెడ్డి, టీడీపీ తరుపున తీగల కృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్‌ తరుపున కొత్త మనోహర్‌రెడ్డి పోటీ చేశారు. త్రిముఖ పోటీలో టీడీపీ అభ్యర్ధి తీగల కృష్ణారెడ్డి 30,774వేల మెజార్టీతో విజయం సాధించారు. గెలిచిన ఆరునెలలకే ఆయన టీడీపీని వదిలి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌ తీగల కృష్ణారెడ్డి టీఆర్ఎస్ 9227
2014 తీగల కృష్ణారెడ్డి టీడీపీ మల్‌రెడ్డిరంగారెడ్డి కాంగ్రెస్‌ 30774
2009 సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌ తీగల కృష్ణారెడ్డి టీడీపీ 7883

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

నియోజకవర్గంలో ముఖ్యంగా ప్యాబ్‌సిటీ, హార్డ్‌వేర్‌పార్కు, ఆగాఖాన్‌పౌండేషన్‌, శ్రీ శ్రీ అకాడమీ విద్యాసంస్థలు ఉన్నాయి. కొత్తగా ఇపుడు ఫార్మాసిటీ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌కు తలమానికంగా ఉండే కాలుష్యరహిత ఫార్మాసిటీ వల్ల వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. ఫార్మాసిటీ ఏర్పాటైతే ఈ ప్రాంత రూపురేఖలు మారిపోయే అవకాశం ఉంది.

అభివృద్ధి ప‌థ‌కాలు

నియోజకవర్గంలో ప్రస్తుతం రోడ్ల విస్తరణ పనులు, మిషన్‌భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నీరందించేందుకు సంబందించిన పనుల వేగవంతం, ఫైబర్‌గ్రిడ్‌ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్‌ సఖర్యం కల్పించేందుకు తగిన పనుల వంటి అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

మహేశ్వరం నియోజకవర్గ కేంధ్రంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం, మండలానికి మినీ స్టేడియం, ఐటిఐ, డిగ్రీకళాశాల ఏర్పాటు, కృష్ణావాటర్‌ సరఫరా వంటి సమస్యలు ఉన్నాయి. ఎన్టీఆర్‌నగర్‌లో సుమారు 2వేల కుటుంబాలు 30ఏళ్లుగా ఇళ్లపట్టాలు కోసం ఎదురుచూస్తున్నాయి. ఇవన్నీచేస్తామని ప్రస్తుత ప్రభుత్వం హామీలు ఇచ్చింది. కానీ ఇవి పరిష్కారం కాలేదు.

ముఖ్య ప్రాంతాలు

నియోజకవర్గంలో ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. మహేశ్వరంలో 400 ఏళ్ల పురాతనమైన శ్రీరాజరాజేశ్వరి శివగంగ ఆలయం ఉంది. ఈ కారణంగానే మహేశ్వరుని పేరుతో గ్రామానికి మహేశ్వరంపేరు వచ్చింది. అలాగే మహేశ్వరంలో కుతుబ్‌షాహీ కాలంలో నిర్మించిన అక్కన్నమాదన్న కోట ఉంది. వాసవీనగర్‌లో అష్టలక్ష్మీ ఆలయం, హుడా కాలనీలో రామాలయం ఎంతో ప్రసిద్ధి.

ఇతర ముఖ్యాంశాలు

ఈ నియోజకవర్గం పట్టణ, గ్రామీణ ప్రాంతాలు కలిసి ఉంటుంది. జీహెచ్‌ఎంసీలో అంతర్భాగంగా ఉన్న నియోజకవర్గంలో సెటిలర్స్‌ ఓట్లు కీలకం. మాజీ హోంమంత్రి దేవేందర్‌గౌడ్‌ స్వగ్రామం తక్కుగూడ ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. ఆయన ఇక్కడ దేవేందర్‌ విద్యాలయం పేరుతో స్కూల్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో పేదలకు ఉచిత సీట్లు ఇస్తున్నారు.

వీడియోస్

ADVT