నియోజకవర్గం : అసెంబ్లీ

ములుగు

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
వరంగల్
మొత్తం ఓటర్లు :
199138
పురుషులు :
98791
స్త్రీలు :
100330
ప్రస్తుత ఎమ్మెల్యే :
సీతక్క (అనసూయ)
ప్రస్తుత ఎంపీ :
అజ్మీరా సీతారాం నాయక్

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు : 199138
పురుషులు :98791
స్త్రీలు: 100330
ఇతరులు : 17
నియోజకవర్గంలో కీలక వర్గాలు : ఎస్టీ, బీసీలు. నియోజవర్గం మొత్తంగా ఎస్టీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. గెలుపోటములను వీరే నిర్ణయిస్తారు. తర్వాతి స్థానంలో ఉన్న బీసీలు గెలుపోటములపై ప్రభావం చూపుతారు. ఇటీవలి కాలంలో ఎస్టీలలో ఆదివాసీలు, లంబాడీల మధ్య వర్గపోరు మొదలుకాగా తమ వర్గానికి చెందిన అభ్యర్థికే ఓటు వేయడం ప్రస్తుత ఎమ్మెల్యే చందూలాల్‌ గెలుపుకు కలిసివచ్చింది. రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి పునరావృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే గిరిజనేతరుల ఓట్లే కీలకంగా మారనున్నాయి.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: ఎస్టీ
నియోజకవర్గంలోని మండలాలు :
ములుగు, వెంకటాపురం, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, కొత్తగూడ
లోక్‌సభ పరిధి : మహబూబాబాద్‌
 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 సీతక్క (అనసూయ) కాంగ్రెస్ అజ్మీరా చందూలాల్ టీఆర్‌ఎస్ 22671
2014 అజ్మీరా చందూలాల్‌ టీఆర్‌ఎస్ పొదెం వీరయ్య కాంగ్రెస్ 16399
2009 ధనసరి అనసూయ టీడీపీ పొదెం వీరయ్య కాంగ్రెస్ 18775
2004 పొదెం వీరయ్య కాంగ్రెస్‌ ధనసరి అనసూయ టీడీపీ 14594
1999 పొదెం వీరయ్య కాంగ్రెస్ అజ్మీరా చందూలాల్ టీడీపీ 14555
1996 చర్ప భోజారావు(ఉపఎన్నికలు) టీడీపీ పోరిక జగన్నాయక్‌ కాంగ్రెస్ 13549
1994 అజ్మీరా చందూలాల్ టీడీపీ పోరిక జగన్నాయక్‌ కాంగ్రెస్ 28301
1989 పోరిక జగన్‌నాయక్ కాంగ్రెస్ అజ్మీర చందూలాల్ టీడీపీ 5479
1985 అజ్మీరా చందూలాల్(మధ్యంతర ఎన్నికలు) టీడీపీ పోరిక జగన్నాయక్‌ (కాంగ్రెస్ 7632
1983 పోరిక జగన్‌నాయక్ కాంగ్రెస్‌ అజ్మీరా చందూలాల్ టీడీపీ 24656
1978 పోరిక జగన్‌నాయక్ కాంగ్రెస్ చర్ప భోజారావు జనతా 1469
1972 సంతోష్‌ చక్రవర్తి కాంగ్రెస్ ఎస్‌.రాజేశ్వర్‌రావు స్వతంత్ర 30436
1967 సంతోష్‌ చక్రవర్తి స్వతంత్ర పి.రాంనర్సయ్య సీపీఎం 4929
1962 ముస్నిపెల్లి కృష్ణయ్య కాంగ్రెస్ ఎస్‌.వై.కే.ప్రసాద్ సీపీఐ 5491
1957 సూర్యనేని రాజేశ్వర్‌రావు పీడీఎఫ్ బీఆర్‌.కులు కాంగ్రెస్ 169
1952 హన్మంతరావు పీడీఎఫ్ ఎస్‌.రాజ్యలక్ష్మి కాంగ్రెస్ 592

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

ములుగు నియోజకవర్గంలోని మంగపేట మండలం కమలాపురంలో బిల్ట్‌ కర్మాగారం ఉంది. అక్కడ ఉత్పత్తి అయ్యే కలప గుజ్జుకు మార్కెట్‌ లేకపోవడంతో నాలుగేళ్లక్రితం మూతపడింది. దేవాదుల ఎత్తిపోతల పథకం కన్నాయిగూడెం మండలంలో గోదావరి నదిపై నిర్మాణమైంది. ఇదే మండలంలో సాగు, తాగునీటి అవసరాలకోసం తుపాకులగూడెం వద్ద బ్యారేజీని నిర్మిస్తున్నారు.

అభివృద్ధి ప‌థ‌కాలు

మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పనులు జరుగుతున్నాయి. 1400 డబుల్‌బెడ్‌రూం గృహాలు మంజూరుకాగా నిర్మాణాలు జరుగుతున్నాయి. గ్రామాల్లో అంతర్గత సీసీరోడ్ల నిర్మాణం, లింక్‌రోడ్ల నిర్మాణం జరుగుతోంది.

పెండింగ్ ప్రాజెక్టులు

నియోజకవర్గాన్ని ఆనాధిగా తాగునీరు, సాగునీటి ఎద్దడితోపాటు ఆర్టీసీ బస్‌డిపో సమస్య తీవ్రంగా వెంటాడుతోంది. మిషన్‌ భగీరథ పేరుతో తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఊరూరా పైప్‌లైన్‌లు వేస్తుండగా ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోని గోదావరిలో ఇన్‌టేక్‌ వెల్‌ నిర్మాణాలు జరుగుతున్నాయి. సాగుకోసం గోదావరి నీటిని లక్నవరం, రామప్ప సరస్సుల్లోకి మళ్లించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఏటూరునాగారంలో మినీ బస్సు డిపోకోసం చందూలాల్‌ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

ముఖ్య ప్రాంతాలు

ములుగు నియోజకవర్గం చారిత్రక, పర్యాటక ప్రదేశాలకు నెలవు. కాకతీయుల నాటి రామప్ప దేవాలయం ఉన్నది. మంగపేట మండలంలోని మల్లూరులో పురాతన లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం ఉన్నది. ములుగు మండలంలోని కొత్తూరు గుట్టపై వందలేళ్లనాటి బౌద్ధమందిరం వెలుగుచూసింది. లక్నవరం సరస్సు, రామప్ప, తాడ్వాయి అడవులు పర్యాటకంగా ప్రగతి సాధిస్తున్నాయి. తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క, సారక్క జాతర ప్రతీ రెండేళ్లకోసారి వైభవంగా జరుగుతుంది. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఈ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన సమ్మేళనం.

వీడియోస్

ADVT