నియోజకవర్గం : అసెంబ్లీ

నిజామాబాద్ రూరల్

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
నిజామాబాద్
మొత్తం ఓటర్లు :
211448
పురుషులు :
98783
స్త్రీలు :
112653
ప్రస్తుత ఎమ్మెల్యే :
బాజిరెడ్డి గోవర్ధన్
ప్రస్తుత ఎంపీ :
కల్వకుంట్ల కవిత

ఓట‌ర్లు

మొత్తం ఓట్లు: 2,11,448
పురుషులు: 98,783
స్త్రీలు: 1,12,653
ఇతరులు: 12
 
నియోజకవర్గంలో కీలక సామాజికవర్గాలు: ఈ నియోజకవర్గంలో మున్నూరు కాపు, రెడ్డి, గొల్ల కురుములు, ముదిరాజ్‌, పద్మశాలి, వడ్డెర, మైనార్టీ, ఎస్సీ ఓట్లు కీలకం కానున్నాయి.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

జనరల్ కేటగిరీకి చెందిన ఈ నియోజకవర్గంలో నిజామాబాద్‌ రూరల్, మోపాల్‌, డిచ్‌పల్లి, ఇందల్‌వాయి, ధర్పల్లి, సిరికొండ, జక్రాన్‌పల్లి మండలాలు ఉన్నాయి. నిజామాబాద్‌ లోక్‌సభ పరిథిలోకి ఈ నియోజకవర్గం వస్తుంది.
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 బాజీరెడ్డి గోవర్దన్‌ టీఆర్‌ఎస్‌ ఆర్.భూపతిరెడ్డి కాంగ్రెస్ 29646
2014 బాజీరెడ్డి గోవర్దన్‌ టీఆర్‌ఎస్‌ డీ.శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ 26200
2009 వెంకటేశ్వర్‌రావ్‌ టీడీపీ ఆకుల లలిత కాంగ్రెస్ 0
2008 ఆకుల లలిత కాంగ్రెస్‌ ఆనంద్‌రెడ్డి 0 0
2004 గడ్డం గంగారెడ్డి టీఆర్‌ఎస్‌ వెంకటేశ్వర్‌రావ్‌ 0 0
1999 వెంకటేశ్వర్‌రావ్‌ టీడీపీ అంతిరెడ్డి బాల్‌రెడ్డి 0 0
1994 వెంకటేశ్వర్‌రావ్‌ టీడీపీ మహేశ్వర్‌గౌడ్‌ 0 0
1990 వెంకటేశ్వర్‌రావ్‌ టీడీపీ ఎల్‌ఎల్‌.నారాయణ 0 0
1985 వెంకటేశ్వర్‌రావ్‌ టీడీపీ బాల్‌రెడ్డి 0 0
1983 థామస్‌చౌదరీ టీడీపీ అంతారెడ్డి 0 0
1978 అనంత్‌రెడ్డి బాల్‌రెడ్డి కాంగ్రెస్‌ భూంరావ్‌ 0 0
1952 శ్రీనివాస్‌రావ్‌ సోషలిస్ట్‌ నారాయణరెడ్డి 0 0

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

సిరికొండ మండలం పాకాలకు చెందిన మాలవత్‌ పూర్ణ ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించారు.
సిని నిర్మాత దిల్‌రాజు, హీరో నితిన్‌, కీర్తిరెడ్డి, ప్రొఫెసర్‌ లింబాద్రి, కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ సాయన్నలు ఈ నియోజకవర్గానికి చెందినవారే.

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

ఈ నియోజకవర్గం పరిధిలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఉంది. ప్రైవేటు ఇంజనీరింగ్‌, ఫార్మసి కళాశాలలు నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో రామడుగు చిన్న నీటి వనరుల ప్రాజెక్ట్‌ ఉంది. అటవీ ప్రాంతం కూడా నియోజకవర్గం పరిధిలో ఉంది. మిట్టాపల్లి పవర్‌గ్రిడ్‌ ఈ నియోజకవర్గంలోనే ఉంది.

అభివృద్ధి ప‌థ‌కాలు

ఈ నియోజకవర్గం పరిధిలో మంచిప్ప ప్రాజెక్ట్‌ నిర్మాణం జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ గుండా ప్యాకేజీ 20, 21 పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే లక్ష 90 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. వందల కోట్ల రూపాయలతో రోడ్లు, మిషన్‌ భగీరథ పనులు కొనసాగుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

నియోజకవర్గంలో దీర్ఘకాలంగా సాగునీటి సమస్య ఉంది. ధర్పల్లి, సిరికొండ ప్రాంతాల్లో సాగుతో పాటు తాగునీటి సమస్య ఉంది.

ముఖ్య ప్రాంతాలు

ఖిల్లా రామాలయం, 7వ పోలీస్‌ బెటాలియన్‌, సారంగపూర్‌ షుగర్‌ ఫ్యాక్టరీ, నర్సింగ్‌పల్లి వెంకటేశ్వర ఆలయం, రైస్‌ మిల్లులు, గౌడాన్‌లు, తెలంగాణ సీడ్స్‌, జిల్లా పశుగణణాభివృద్ధి సంస్థ, విజయ డైరీ, జిల్లా జైల్‌, సారంగపూర్‌ హనుమాన్‌ ఆలయం, మల్కాపూర్‌ అనంత పద్మనాభస్వామి ఆలయం, కాగిత పరిశ్రమలు ఉన్నాయి.

ఇతర ముఖ్యాంశాలు

నియోజకవర్గంలో అందరూ సీనియర్‌ నేతలు ఉన్నా అభివృద్ధిని మాత్రం పట్టించుకోలేదు. ఇప్పటికీ ప్రతిరోజు ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. రాష్ట్రస్థాయిలో మంత్రి పదవులు అనుభవించిన నియోజకవర్గంగా పేరొందింది కానీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు. మారుమూల ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు.

వీడియోస్

ADVT