నియోజకవర్గం : అసెంబ్లీ

ఖానాపూర్‌

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
అదిలాబాద్
మొత్తం ఓటర్లు :
185235
పురుషులు :
91655
స్త్రీలు :
93554
ప్రస్తుత ఎమ్మెల్యే :
అజ్మీరా రేఖానాయక్
ప్రస్తుత ఎంపీ :
జీ. నగేష్

ఓట‌ర్లు

నియోజకవర్గం మెత్తం ఓటర్లు: 1,85,235
పురుషులు: 91655
స్ర్తీలు : 93,554
ఇతరులు: 26
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు:అత్యధిక శాతం ఎస్టీ ఓట్లున్నాయి. ఎస్టీల్లో లంబాడీల ఓట్లు 25వేలు, గొండు కులస్థులు 18వేలు , మున్నూరు కాపుల ఓట్లు 12వేలు  ఉన్నాయి.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌ : ఎస్టీ
నియోజకవర్గంలో ఏఏ మండలాలు ఉన్నాయి : ఖానాపూర్‌, కడెం , పెంబి, దస్తూరాబాద్‌ మండలాలు నిర్మల్‌ జిల్లాలో, జన్నారం మండలం మంచిర్యాల జిల్లాలో, ఉట్నూర్‌, ఇంద్రవె ల్లి మండలాలు ఆదిలాబాద్‌ జిల్లాలో ఉన్నాయి. వీటితో పాటు ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన సిరికొండ మండలంలోని ఐదు పోలింగ్‌ స్టేషన్‌లు ఖానాపూర్‌ మండలానికి చెందినవి.    
ఏ లోక్‌సభ పరిధిలో ఉంది : ఆదిలాబాద్‌ 
 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 అజ్మీరా రేఖా నాయక్‌ టిఆర్‌ఎస్‌ రమేష్‌ రాథోడ్‌ కాంగ్రెస్‌ 20522
2014 అజ్మీరా రేఖా నాయక్‌ టిఆర్‌ఎస్‌ రితేష్‌ రాథోడ్‌ టీడీపీ 38324
2009 సుమన్‌ రాథోడ్‌ టీడీపీ హరినాయక్‌ కాంగ్రెస్‌ 36896
2008 సుమన్‌ రాథోడ్‌ టీడీపీ మేస్త్రం నాగోరావు కాంగ్రెస్‌ 0
2004 గోవింద్‌ నాయక్‌ టిఆర్‌ఎస్‌ రమేష్‌ రాథోడ్‌ టీడీపీ 9191
1999 రమేష్‌ రాథోడ్‌ టీడీపీ బక్షి నాయక్‌ కాంగ్రెస్‌ 20016
1994 గోవింద్‌ నాయక్‌ టీడీపీ కోట్నాక భీంరావు కాంగ్రెస్‌ 42369
1989 కోట్నాక్‌ భీంరావు కాంగ్రెస్‌ గోవింద్‌ నాయక్‌ టీడీపీ 446
1985 గోవింద్‌ నాయక్‌ స్వతంత్య్ర జలంసింగ్‌ టీడీపీ 8502
1983 అంబాజీ జాదవ్‌ కాంగ్రెస్‌ గోవింద్‌ నాయక్‌ టీడీపీ 1261
1978 అంబాజీ జాదవ్‌ కాంగ్రెస్‌ రాజా దేవ్‌షా సోషలిస్ట్‌ పార్టీ 3743

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

పైడిపల్లి వంశీ , సినీదర్శకులు , ఖానాపూర్‌
ఖానాపూర్‌ పట్టణానికి చెందిన ప్రముఖ టీఆర్‌ఎస్‌ నాయకులు పైడిపల్లి రవీందర్‌రావు కుమారుడు వంశీ. సినీ రంగంలో దర్శకుడిగా రాణిస్తున్నారు. తండ్రి రాజకీయ నాయకుడు అయినప్పటికీ వంశీ మాత్రం రాజకీయాలకు సంబంధం లేకుండా దర్శకత్వంలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు.

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

ఖానాపూర్‌ నియోజకవర్గంలో కడెం మండలంలో కడెం నారయణరెడ్డి ప్రాజెక్టు, ఖానాపూర్‌ మండలంలో సదర్‌మాట్‌ ఆనకట్ట.

అభివృద్ధి ప‌థ‌కాలు

 
  • ఖానాపూర్‌ , కడెం మండలాల్లో సదర్‌మాట్‌ కాలువ , డి - 27 , డి - 28 కాలువ లైనింగ్‌ పనులు కొనసాగుతున్నాయి.
  • ఖానాపూర్‌ , జన్నారం , ఇంద్రవెల్లి , ఉట్నూర్‌ , దస్తూరాబాద్‌ , కడెం , పెంబి మండలాల్లో సిసి రోడ్లు , డ్రైనేజీలు , మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పనులు కొనసాగుతున్నాయి.
  • ఇంద్రవెల్లి , ఉట్నూర్‌ మండలాల్లో మండలానికి 80 చొప్పున డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం కొనసాగుతోంది.

పెండింగ్ ప్రాజెక్టులు

ఖానాపూర్‌లో రోడ్డు వెడల్పు అంశం దీర్ఘకాలికంగా ఉన్న సమస్య. ఈ సమస్య పరిష్కారానికై సెంట్రల్‌ లైటింగ్‌ ప్రతిపాదనతో ఎమ్మెల్యే రేఖా నాయక్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు.
ఖానాపూర్‌ ప్రభుత్వాసుపత్రిలో సీమాంగ్‌ సెంటర్‌లో మహిళ వైద్య నిఫుణురాలు లేక ఖానాపూర్‌ , కడెం, దస్తూరాబాద్‌ , పెంబి ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
ఖానాపూర్‌, కడెం , పెంబి, దస్తూరాబాద్‌, జన్నారం మండలాల్లో డబుల్‌ బెడ్‌రూం నిర్మాణ పనులు కొనసాగడం లేదు.
నియోజకవర్గ కేంద్రమైన ఖానాపూర్‌లో కోర్టు ఏర్పాటు , డిగ్రీ కళాశాల ఏర్పాటు , అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు కళగానే మిగిలింది.
ఖానాపూర్‌కు వంద పడకల ఆసుపత్రి నిర్మాణ విషయాన్ని ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళారు. అలాగే జన్నారం మండలంలో సైతం 30 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా మార్చాలనే డిమాండ్‌ చాలా రోజుల నుంచి వినబడుతున్న ఆ సమస్య పరిష్కారం కాకుండా మిగిలిపోయింది.

ముఖ్య ప్రాంతాలు

ఖానాపూర్‌ మండలంలో సదర్‌మాట్‌ ఆనకట్ట , బాధన్‌కుర్తి గ్రామం బురుజులు , దత్తాత్రేయుని ఆలయం , కడెం మండలంలో కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్‌ , కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ , జన్నారం జింకల పరిరక్షణ కేంద్రం, ఇంద్రవెల్లిలో కెస్లాపూర్‌లో నాగోబా ఆలయం. ఈ ఆలయం వద్ద ప్రతి యేడాది అత్యంత ప్రతిష్టంగా నాగోబా జాతర నిర్వహిస్తారు. నాగోబా జాతరను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.
అమర వీరుల స్థూపం , ఉట్నూర్‌లో పురాతన రామాలయం, ఐటిడిఏ కార్యాలయం.

ఇతర ముఖ్యాంశాలు

జిల్లాల పునర్విభజనలో భాగంగా ఖానాపూర్‌ నియోజకవర్గం త్రిశంకు స్వర్గంలా మారింది. మూడు జిల్లాల్లో ఖానాపూర్‌ నియోజకవర్గం మండలాలను చేర్చారు. నియోజకవర్గమైన ఖానాపూర్‌తో పాటు పెంబి , దస్తూరాబాద్‌ , కడెం మండలాలు నిర్మల్‌ జిల్లాలో , జన్నారం మంచిర్యాల జిల్లాలో , ఉట్నూర్‌ , ఇంద్రవెల్లి ఆదిలాబాద్‌ జిల్లాలో చేర్చారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించగా ఖానాపూర్‌ నియోజకవర్గానికి మూడు జిల్లాలతో అనుబంధం ఉండడం విశేషం. ఖానాపూర్‌ నియోజకవర్గంలో టైగర్‌ జోన్‌ సైతం ఉంది.

వీడియోస్

ADVT