నియోజకవర్గం : అసెంబ్లీ

కామారెడ్డి

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
నిజామాబాద్
మొత్తం ఓటర్లు :
198091
పురుషులు :
96230
స్త్రీలు :
101844
ప్రస్తుత ఎమ్మెల్యే :
గంప గోవర్ధన్
ప్రస్తుత ఎంపీ :
బీ.బీ. పాటిల్

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 1,98,091
పురుషులు: 96,230
మహిళలు: 1,01,844 
ఇతరులు: 17 

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

జనరల్ కేటగిరీకి చెందిన ఈ నియోజకవర్గంలో కామారెడ్డి, బీబీపేట్‌, మాచారెడ్డి, దోమకొండ, భిక్కనూరు మండలాల్లోని అన్ని గ్రామాలు ఉండగా రామారెడ్డి, రాజంపేట్‌ మండలాల్లోని కొన్ని గ్రామాలు నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. జహీరాబాద్ లోక్‌సభ పరిథిలోకి ఈ నియోజకవర్గం వస్తుంది.
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 గంప గోవర్దన్‌ టీఆర్ఎస్ షబ్బీర్‌ అలీ కాంగ్రెస్ 4557
2014 గంపగోవర్దన్‌ టీఆర్ఎస్ షబ్బీర్‌ అలీ కాంగ్రెస్ 8683
2009 గంపగోవర్దన్‌ టీడీపీ షబ్బీర్‌ అలీ కాంగ్రెస్ 0
2004 షబ్బీర్‌ అలీ కాంగ్రెస్‌ మురళీధర్‌గౌడ్‌ బీజేపీ 0
1999 యుసూఫ్‌ అలీ టీడీపీ షబ్బీర్‌ అలీ కాంగ్రెస్ 0
1994 గంపగోవర్దన్‌ టీడీపీ షబ్బీర్‌ అలీ కాంగ్రెస్ 0
1989 షబ్బీర్‌ అలీ కాంగ్రెస్‌ సయ్యద్‌ యూసఫ్‌అలీ 0 0
1985 కృష్ణమూర్తి టీడీపీ ఆర్‌.మల్లేష్‌ 0 0
1983 పార్శి గంగయ్య టీడీపీ బి.బాలయ్య 0 0
1978 బి. బాలయ్య కాంగ్రెస్‌ రాజ్‌రెడ్డి 0 0
1972 సత్యనారాయణ కాంగ్రెస్‌ మధుసూధన్‌రెడ్డి 0 0
1967 మధుసూధన్‌రెడ్డి ఇండిపెండెంట్‌ వెంకట్‌రాంరెడ్డి 0 0
1962 వి. వెంకట్‌రాంరెడ్డి కాంగ్రెస్‌ కెపిఆర్‌.రెడ్డి 0 0

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

తెలంగాణలో ఎక్కడా లేని ప్రభుత్వ డెయిరీ కళాశాల (పీ.వీ. నర్సింహరావు డె యిరీ కళాశాల) కామారెడ్డి నియోజకవర్గంలో ఉంది. అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నియోజకవర్గంలో 22వ ప్యాకేజి కింద ప్రాణహిత చేవేళ్ల పనులు కొనసాగుతున్నాయి.

అభివృద్ధి ప‌థ‌కాలు

కామారెడ్డి నియోజకవర్గంలో ఏళ్లుగా తాగు నీటి సమస్య నెలకొంది. ప్రస్తుతం జరుగుతున్న మిషన్‌ భగీరథతో ఈ సమస్య తీరనుంది. మిషన్‌ కాకతీయ పనుల్లో భాగంగా చెరువుల పునరుద్ధరణ కొనసాగుతోంది. జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా మాచారెడ్డి నుంచి కామారెడ్డి వరకు వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

నియోజకవర్గంలోని దోమకొండ మండలం యాడారం తాగునీటి ఎత్తిపోతల పథకం అసంపూర్తిగా ఉండిపోయింది. కామారెడ్డిలో సిరిసిల్ల రోడ్డు వెడల్పు పనులు పూర్తి కావాల్సి ఉంది.

ముఖ్య ప్రాంతాలు

దోమకొండ మండల కేంద్రంలోని కామినేని వంశస్థుల హయాంలో నిర్మించిన చారిత్రక గడి కోట ఉంది. మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్‌ లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, భిక్కనూరు సిద్దరామేశ్వర స్వామి ఆలయం, మద్దికుంట శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి లాంటి చారిత్రక ఆలయాలు ఉన్నాయి.

ఇతర ముఖ్యాంశాలు

ఒకప్పుడు కామారెడ్డి తెలంగాణలోనే బెల్లానికి ప్రసిద్ధి. చెరుకు ఎక్కువగా పండించే రైతులు స్వతహాగానే బెల్లం తయారు చేసేవారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు బెల్లాన్ని పంపించేవారు. ప్రభుత్వ నిబంధనల వల్ల ఆ పనులు ముగిసిిపోయాయి. సిరిసిల్ల జిల్లా పరిధిలోని పలు మండలాలకు చెందినవారు వస్తువులు, ఇతరత్రా కొనుగోలు కోసం కామారెడ్డికే వస్తారు. మెదక్‌జిల్లా పరిధిలోని రామాయంపేట్‌వారు కూడా కామారెడ్డికి వస్తారు.

వీడియోస్

ADVT