నియోజకవర్గం : అసెంబ్లీ

చెన్నూర్‌

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
అదిలాబాద్
మొత్తం ఓటర్లు :
161401
పురుషులు :
81700
స్త్రీలు :
79684
ప్రస్తుత ఎమ్మెల్యే :
బాల్కసుమన్
ప్రస్తుత ఎంపీ :

ఓట‌ర్లు

నియోజకవర్గం మొత్తం జనాభా: 2,07,610,
పురుషులు: 1,05,457,
స్ర్తీలు: 1,02,153
 
నియోజకవర్గం మొత్తం ఓటర్లు: 1,61,401
పురుషులు:  81,700
స్ర్తీలు: 79,684
ఇతరులు: 17
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు: దళితులలో నేతకాని ఓటర్లు కీలకం, మాదిగ, మాల ఓటర్లు ఆ తదుపరి వస్తారు. బీసీలు 3వ స్థానంలో ఉంటారు. ఎస్సీ ఓటర్లలో నేతకానిలు 58వేలు, 35వేల మాలలు, 30వేల మాదిగ ఓటర్లు, 8వేల ముస్లీంలు, 15వేల వరకు బీసీలు ఉన్నారు. బొగ్గుగని కార్మిక కుటుంబాల ఓటర్లు 73,648 మంది ఉన్నారు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

చెన్నూర్‌ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 2014 వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. 8 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించారు. చెన్నూర్‌ - సిర్పూర్‌ ఉమ్మడి నియోజకవర్గాలు ఉండేవి. చెన్నూర్‌ నుంచి స్థానికుడైన సులిగాల విశ్వనాధ సూరి ఎమ్మెల్యేగా ప్రజా సోషలిస్టు పార్టీ నుంచి ఎన్నికయ్యారు. ఆ తరువాత లక్షెట్టిపేట - చెన్నూర్‌ ఉమ్మడి నియోజకవర్గాల నుంచి 1957లో మాజీ కేంద్ర మంత్రి దివంగత జీ వెంకటస్వామి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. 1962లో చెన్నూర్‌ నియోజకవర్గం విడిగా ఏర్పడింది.
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 బాల్కసుమన్ టీఆర్ఎస్ బి.వెంకటేశ్‌నేత కాంగ్రెస్ 28132
2014 నల్లాల ఓదెలు టీఆర్‌ఎస్‌ జీ వినోద్‌ కాంగ్రెస్ 26164
2010 నల్లాల ఓదెలు టీఆర్‌ఎస్‌ జీ వినోద్‌ కాంగ్రెస్ 44284
2009 నల్లాల ఓదెలు టీఆర్‌ఎస్‌ జీ వినోద్‌ కాంగ్రెస్ 11549

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

జేఏసీ నేత, మాజీ తహసిల్దార్‌ గద్దల హనుమంతు.

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

సింగరేణి గనులు, 1200 మెగా వాట్ల విద్యుత్‌ ప్లాంట్‌, గొళ్లవాగు, నీల్వాయి ప్రాజెక్టులు.

ముఖ్య ప్రాంతాలు

చెన్నూర్‌ నియోజకవర్గంలోని చెన్నూర్‌, కోటపల్లి మండలాలలో ప్రాణహిత ఉంది. అత్యంత పవిత్రమైన గోదావరి నది ఇక్కడ ప్రవహిస్తుంది. చెన్నూర్‌లో అంబా ఆగస్తేశ్వర ఆలయం, జగన్నాధ స్వామి ఆలయం, కత్తెరశాల మల్లికార్జున స్వామి దేవాలాయం, సుద్దాలలోని రామాలయం, కోటి లింగాల ప్రాంతం, సోమనపల్లిలోని ఎల్‌ మడుగు(మొసళ్ల సంరక్షణ కేంద్రం) పర్యాటక ప్రదేశాలు జైపూర్‌ మండలంలోని మల్లికార్జున స్వామి దేవాలయం, కుందారంలోని కుంభమాంబ శాసనాలు, చారిత్రక ఆనవాళ్లు ధర్శనమిస్తాయి. కోటపల్లి మండలంలోని పారుపెల్లి బౌరవకొండ, అర్జున గుట్ట వద్ద ఉన్న ప్రాణహిత నది తీరాలు, మందమర్రిలోని గాంధారిఖిల్లా, తదతరములు పర్యాటక కేంద్రాలు.

ఇతర ముఖ్యాంశాలు

 
  • చెన్నూర్‌ నియోజకవర్గం నుంచి కోదాటి రాజమల్లు ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. బోడ జనార్థన్‌ కార్మిక మంత్రిగా పని చేశారు. 2009లో గెలిచిన జీ. వినోద్‌ కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు. 2014లో విజయం సాధించిన ఓదెలు ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్నారు.
  • బొగ్గు గని కార్మికులు ఎక్కువగా ఎన్నికల్లో పోటీ చేశారు. కోదాటి రాయమల్లు నుంచి మొదలు సొత్కు సంజీవరావు, బోడ జనార్దన్‌లు కూడా ఒకప్పటి సింగరేణి ఉద్యోగులే కావడం విశేషం.

వీడియోస్

ADVT