నియోజకవర్గం : అసెంబ్లీ

హుజురాబాద్

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
కరీంనగర్
మొత్తం ఓటర్లు :
205839
పురుషులు :
102903
స్త్రీలు :
102919
ప్రస్తుత ఎమ్మెల్యే :
ఈటల రాజేందర్‌
ప్రస్తుత ఎంపీ :
బి. వినోద్ కుమార్

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 2,05,839
పురుషులు: 1,02,903
స్త్రీలు: 1,02,919
ఇతరులు: 17
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు:
రెడ్డి, పద్మశాలి, గౌడ్‌, ముదిరాజ్‌, యాదవులు, ఎస్సీ.
బీసీ వర్గాలైన పద్మశాలి, గౌడ్‌, ముదిరాజ్‌, యాదవుల సంఖ్య ఎక్కువగా ఉంది.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: జనరల్‌
ఏ లోక్‌ సభ నియోజకవర్గం పరిధిలో ఉంది: కరీంనగర్‌ 
నియోజకవర్గంలో ఏయే మండలాలు ఉన్నాయి:
హుజూరాబాద్‌, కమలాపూర్‌, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట (కొత్తగా)
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్ పి.కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్ 43719
2014 ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్ కె. సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ 57037
2010 ఈటల రాజేందర్ టీఆర్ఎస్ డీ.ఆర్.ముద్దసాని టీడీపీ 79227
2009 ఈటల రాజేందర్ టీఆర్ఎస్ వి.కృష్ణ మోహన్ రావు కాంగ్రెస్ 15035
2008 కెప్టెన్ వి.లక్మీ కాంతారావు టీఆర్ఎస్ కె.సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ 20820
2004 వి.లక్హీ కాంతారావు టీఆర్ఎస్ ఏనుగుల పెద్దిరెడ్డి టీడీపీ 44670
1999 ఏనుగుల పెద్దిరెడ్డి టీడీపీ సాయిరెడ్డి కేతిరి కాంగ్రెస్ 6430
1994 ఏనుగుల పెద్దిరెడ్డి టీడీపీ లక్హీ కాంతారావు బొప్పిరాజు కాంగ్రెస్ 19291
1989 కేతిరి సాయిరెడ్డి స్వతంత్ర దుగ్గిరాల వెంకట్రావు టీడీపీ 3702
1985 దుగ్గిరాల వెంకట్రావు టీడీపీ జె.భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ 36892
1983 కోతా రాజిరెడ్డి స్వతంత్ర దుగ్గిరాల వెంకట్రావు స్వతంత్ర 4183

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

- ఆవునూరి సమ్మయ్య (సీనియర్‌ పాత్రికేయులు, జేఏసీ నాయకుడు, హుజూరాబాద్‌)
- పాడి ఉదయ్‌నందన్‌రెడ్డి (యూప్‌ టీవీ అధినేత, వ్యాపారి, వీణవంక)

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

కిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల (సింగాపూర్‌): హుజూరాబాద్‌ మండలంలోని సింగాపూర్‌లో కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ఉంది. దీనిని స్థాపించి 25సంవత్సరాలు కావస్తోంది. వొడితెల ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఆధ్వర్యంలో స్థాపించారు. సెక్రటరీగా హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌ వ్యవహరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో కిట్స్‌ కళాశాల ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోంది.
కాకతీయ విద్యా సంస్థలు (జమ్మికుంట)
జమ్మికుంట పట్టణంలో కాకతీయ విద్యా సంస్థలు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. కేజీ టు డిగ్రీ వరకు విద్యా సంస్థలను ఆవిర్నేని సుధాకర్‌రావు స్థాపించారు. ఈ సంస్థలలో సుమారు 10వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
- జమ్మికుంటలో కాటన్‌ మిల్లులు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు బేళ్లు ఎగుమతి అవుతుంటాయి. అలాగే హుజూరాబాద్‌, జమ్మికుంటలలో సీడ్‌ మిల్లులు, రైస్‌ మిల్లులు, పారాబాయిల్డ్‌ మిల్లులు ఎక్కువగా నడుస్తున్నాయి.

అభివృద్ధి ప‌థ‌కాలు

హుజూరాబాద్‌-జమ్మికుంట, హుజూరాబాద్‌-పర్కాల్‌లకు ఫోర్‌లేన్‌ రహదారుల నిర్మాణం కొనసాగుతోంది. ప్రతి గ్రామంలో శ్మశాన వాటికలు నిర్మాణంలో ఉన్నాయి. సీసీ రోడ్లు, మురికి కాలువలు, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పనులు జరుగుతున్నాయి. హుజూరాబాద్‌లో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయింది. కమలాపూర్‌లో గ్యాస్‌ బాట్లింగ్‌ కేంద్రం, మానేరు వాగుపై చెక్‌డ్యాంల నిర్మాణం, వాగులపై బ్రిడ్జిలు ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు.

పెండింగ్ ప్రాజెక్టులు

హుజూరాబాద్‌లో మినీ స్టేడియం, పాలిటెక్నిక్‌ కళాశాల, కమలాపూర్‌ మండలం ఉప్పల్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి, జమ్మికుంటలో తాగునీటి సమస్య.

ముఖ్య ప్రాంతాలు

ఇల్లందకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్‌ దర్గా
ప్రభుత్వ సంస్థలు-ప్రభుత్వేతర సంస్థలు
జమ్మికుంటలో వ్యవసాయ మార్కెట్‌, రైల్వే స్టేషన్‌, హుజూరాబాద్‌ ఆర్టీసీ డిపో.
ప్రభుత్వేతర సంస్థలు
విద్యా సంస్థలు, రైస్‌ మిల్లులు, సీడ్‌ మిల్లులు, డెయిరీ కేంద్రం

ఇతర ముఖ్యాంశాలు

హుజూరాబాద్‌ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి ఎమ్మెల్యేగా విజయం సాధించలేదు. టీడీపీ నుంచి గెలిచిన ఇనుగాల పెద్దిరెడ్డి మంత్రిగా పని చేశారు. టీఆర్‌ఎస్‌లో కీలక పాత్ర పోషించిన కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు.

వీడియోస్

ADVT