నియోజకవర్గం : అసెంబ్లీ

జుక్కల్

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
నిజామాబాద్
మొత్తం ఓటర్లు :
174588
పురుషులు :
86326
స్త్రీలు :
88243
ప్రస్తుత ఎమ్మెల్యే :
హన్మంత్ షిండే
ప్రస్తుత ఎంపీ :
బీ.బీ.పాటిల్

ఓట‌ర్లు

నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు: 174588
పురుషులు: 86326
స్త్రీలు: 88243
ఇతరులు: 19

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

ఎస్సీ రిజర్వ్‌డ్ కేటగిరీకి చెందిన ఈ నియోజకవర్గంలో జుక్కల్‌, మధ్నూర్‌, బిచ్కుంద, పెద్దకోడప్‌గళ్‌, పిట్లం, నిజాంసాగర్‌ మండలాలు వస్తాయి. జహీరాబాద్ లోక్‌సభ పరిథిలోకి ఈ నియోజకవర్గం వస్తుంది.
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 హన్మంత్‌షిండే టీఆర్‌ఎస్‌ గంగారాం కాంగ్రెస్ 35625
2014 హన్మంత్‌షిండే టీఆర్‌ఎస్‌ గంగారాం కాంగ్రెస్ 72901
2009 హన్మంత్‌షిండే టీడీపీ గంగారాం 0 0
2004 గంగారాం కాంగ్రెస్‌ అరుణతార 0 0
1999 అరుణతార టీడీపీ గంగారాం 0 0
1994 బి. పండరి టీడీపీ గంగారాం 0 0
1989 గంగారాం కాంగ్రెస్‌ శ్రీనివాస్‌ 0 0
1985 బి. పండరి టీడీపీ గంగారాం 0 0
1983 ఎస్‌.గంగారాం కాంగ్రెస్‌ పండరి 0 0
1978 ఎస్‌. గంగారాం కాంగ్రెస్‌ ఈశ్వరీబాయి 0 0
1972 ఎస్‌. విఠల్‌రెడ్డి ఇండిపెండెంట్‌ ఆర్‌వి.రెడ్డి 0 0
1967 విఠల్‌రెడ్డి ఇండిపెండెంట్‌ నాగ్‌నాథ్‌రావ్‌ 0 0
1962 నాగ్‌నాథ్‌రావ్‌ కాంగ్రెస్‌ మాధవరావ్‌ 0 0
1957 మాధవరావ్‌ ఇండిపెండెంట్‌ ఎస్‌ఎల్‌.శాస్త్రి 0 0

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

ఈ నియోజకవర్గంలో నిజాంసాగర్‌ మండలంలో నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు కింద నిజామాబాద్‌, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలో 2 లక్షల ఎకరాలకు పైగా సాగు నీరు అందుతుంది. అదే విధంగా బోధన్‌ పట్టణం, నిజామాబాద్‌ పట్టణాలకు తాగు నీరు అందిస్తుంది. జుక్కల్‌ మండలంలో కౌలస్‌నాల ప్రాజెక్టు ఉంది. కౌలాస్‌నాలా కోట ఉంది. విద్యాపరంగా వెనకబడి ఉంది. మహరాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో ఈ నియోజకవర్గం ఉంది.

అభివృద్ధి ప‌థ‌కాలు

నియోజకవర్గంలో ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. విద్యాపరంగా బిచ్కుందకు పాలిటెక్నిక్‌, ఐటీఐలను మంజూరు చేశారు. గురకుల పాఠశాలలను ఇచ్చారు. రోడ్లు, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పనులు కొనసాగుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

ఈ నియోజకవర్గంలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం కావడం లేదు. మధ్నూర్‌ మండల పరిధిలో ఉన్న లెండి ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తికాలేదు. నిజాంసాగర్‌ ఉన్నా సాగునీరు మాత్రం కొన్ని గ్రామాలకే అందుతోంది. సాగునీటి వనరులు, చెరువులు ఎక్కువగా లేకపోవడం వల్ల రైతులు ఆరుతడి పంటలనే ఎక్కువగా వేస్తారు. గ్రామాల్లో తాగునీటి కోసం ఇప్పటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నారు.

ముఖ్య ప్రాంతాలు

నిజాంసాగర్‌ ప్రాజెక్టు, కౌలస్‌నాల ప్రాజెక్టులతో పాటు జుక్కల్‌లోని కౌలస్‌ కోట చారిత్రక కట్టడాలు ఉన్నాయి.

ఇతర ముఖ్యాంశాలు

ఈ నియోకవర్గానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ నియోజకవర్గం పరిధిలోని సగం మందికి పైగా ప్రజలు మరాఠి మాట్లాడుతారు. కొన్ని గ్రామాల్లో కన్నడం కూడా మాట్లాడతారు. మధ్నూర్‌లో మరాఠి పాఠశాల కూడా ఉంది. ఇప్పటికీ బంధుత్వాలు ఎక్కువగా మహరాష్ట్రతోనే ముడిపడి ఉన్నాయి.

వీడియోస్

ADVT