నియోజకవర్గం : అసెంబ్లీ

హుస్నాబాద్

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
కరీంనగర్
మొత్తం ఓటర్లు :
218361
పురుషులు :
108827
స్త్రీలు :
109525
ప్రస్తుత ఎమ్మెల్యే :
వొడితెల సతీష్‌కుమార్‌
ప్రస్తుత ఎంపీ :
బి. వినోద్ కుమార్

ఓట‌ర్లు

నియోజకవర్గ ఓటర్లు: 2,18,361 
పురుషులు: 1,08,827
స్త్రీలు: 1,09,525
ఇతరులు: 09
 
నియోజక వర్గంలో కీలక వర్గాలు: బీసీ వర్గాలు, ప్రధానంగా తెనుగు, యాదవ, ఎస్సీలు కీలకం.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: ఓపెన్‌
నియోజకవర్గంలో ఏఏ మండలాలు ఉన్నాయి: హుస్నాబాద్‌, అక్కన్నపేట, కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్‌ , భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలలో పాటు వరంగల్‌ జిల్లా వేలేరు మండలంలోని నియోజకవర్గానికి చెందిన ఐదు గ్రామాలు ఉన్నాయి.
ఏ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉంది: కరీంనగర్‌ 
 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 వొడితెల సతీష్ కుమార్ టీఆర్‌ఎస్ చాడ వెంకట్‌రెడ్డి సీపీఐ 70530
2014 వొడితెల సతీష్ కుమార్ టీఆర్‌ఎస్ అల్గిరెడ్డి ప్రీవణ్ రెడ్డి కాంగ్రెస్ 0
2009 అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి కాంగ్రెస్‌ చాడవెంకట్‌రెడి సీపీఐ 0
2004 చాడ వెంకట్‌రెడ్డి సీపీఐ బొమ్మవెంకటేశ్వర్లు స్వతంత్ర 0
1999 బొమ్మవెంకటేశ్వర్లు కాంగ్రెస్‌ కర్ర శ్రీహరి బీజేపీ 0
1994 దేశినిచిన మల్లయ్య సీపీఐ బొమ్మ వెంకటేశ్వర్లు కాంగ్రెస్‌ 0
1989 దేశినిచిన మల్లయ్య సీపీఐ బొమ్మ వెంకటేశ్వర్లు కాంగ్రెస్‌ 0
1985 దేశినిచినమల్లయ్య సీపీఐ ఐ.జగన్మోహన్‌రెడి కాంగ్రెస్‌ 0
1983 బి.లక్ష్మీకాంతారావు కాంగ్రెస్‌ దేవిశెట్టి శ్రీనివాస్‌రావు టీడీపీ 0
1978 దేశిని చినమల్లయ్య సీపీఐ బి.లక్ష్మీకాంతారావు కాంగ్రెస్‌ 0
1972 బద్దం ఎల్లారెడి సీపీఐ బి. లక్ష్మీకాంతారావు కాంగ్రెస్‌ 0
1967 బి.లక్ష్మీకాంతారావు కాంగ్రెస్‌ సీవీరావ్‌ సీపీఐ 0
1962 బి.లక్ష్మీకాంతారావు కాంగ్రెస్‌ వీఆర్‌రావ్‌ సీపీఐ 0
1957 చామనపల్లి చొక్కారావు పీడీఎఫ్‌ బి. లక్ష్మీకాంతారావు కాంగ్రెస్‌ 0
1952 సింగిరెడ్డి వెంకట్‌రెడ్డి పీడీఎఫ్‌ ఏఆర్‌రావు కాంగ్రెస్‌ 0

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులతో సిరులు..
హుస్నాబాద్‌ నియోజకవర్గంలో నిర్మాణం జరుగుతున్న శ్రీరాంసాగర్‌ వరదకాలువ గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్లు పూర్తయితే ఈ ప్రాంత మెట్ట భూములు సస్యశ్యామలంగా మారతాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీష్‌రావులు ఈ ప్రాజెక్టులను సందర్శించారు. వీటి సామర్థ్యం పెంచారు. 1.414 టిఎంసిల సామర్థ్యం ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టును 8.5 టిఎంసిలకు పెంచారు. డిసెంబర్‌లోగా గౌరవెల్లి ప్రాజెక్టులో నీటిని నింపాలనే లక్ష్యం పెట్టుకోవడంతో ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులు పూర్తయితే మెట్ట భూములు సస్యశ్యామలమవుతాయి.

అభివృద్ధి ప‌థ‌కాలు

నియోజకవర్గంలోని హుస్నాబాద్‌, కోహెడ, అక్కన్నపేట మండలాలు సిద్దిపేట జిల్లాలో కలిసిన అనంతరం మంత్రి హరీష్‌రావు చొరవతో హుస్నాబాద్‌ అభివృద్ది వేగంగా జరుగుతోంది. 50 పడకల అసుపత్రి, రోడ్ల నిర్మాణాలు, రైతు బజార్‌, సమీకృత ప్రభుత్వ కార్యాలయాలకు నిధులు మంజూరు, కమ్యూనిటీ హాళ్ళు, పాలిటెక్నిక్‌ కళాశాల, సబ్‌స్టేషన్లు, డిగ్రీ కళాశాల ఆధునీకరణ, గురుకుల పాఠశాలలు ఇలా అన్ని రంగాల్లో అభివృద్ది చెందింది. హుస్నాబాద్‌ మున్సిపాలిటీగా మార్పు చెందడంతో దాదాపు రూ. 20కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయి. శనిగరం ప్రాజెక్టు, సింగరాయ ప్రాజెక్టు అధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్‌బండ్‌గా రూపొందుతోంది.

పెండింగ్ ప్రాజెక్టులు

నియోజకవర్గంలో ముఖ్యంగా సాగు, త్రాగునీటి సమస్యలు ఉన్నాయి. నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్‌లో ఉన్నత విద్యా, సాంకేతిక విద్యా కళాశాలలు లేకపోవడంతో విద్య పరంగా నియోజకవర్గం వెనుకబడిపోతోంది. గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో గిరిజన విద్యాలయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కోహెడలో డిగ్రీ కళాశాల,చిగురుమామిడి, భీమదేవరపల్లి మండలాల్లో ప్రధానంగా రహదారుల సమస్య తీవ్రంగా ఉంది. పారిశ్రామికంగా వెనుకబడిన ఈ నియోజకవర్గంలో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.

ముఖ్య ప్రాంతాలు

అసియాలోనే అతిపెద్ద అమరుల స్థూపం...
మావోయిస్ట్‌ (అప్పటి పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు)ఉద్యమాలకు హుస్నాబాద్‌ పెట్టని కోట. 1922లో రాడికల్స్‌ పేరుతో ఈ ప్రాంతంలో పీపుల్స్‌వార్‌ ఉద్యమానికి బీజం పడింది. ఉద్యమంలో ఈ ప్రాంతానికి చెందిన ఎంతో మంది అమరులయ్యారు. వీరి త్యాగాలకు సాక్షిగా 1990లో అసియా ఖండంలోనే రెండో అతిపెద్ద అమర వీరుల స్థూపం పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు నిర్మించారు. 88 మంది అమరవీరుల పేర్లతో 88 అడుగుల ఎత్తులో ఈ స్థూపాన్ని నిర్మించారు.దీన్ని గ్రీన్‌ టైగర్స్‌ పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు 2000 సంవత్సరంలో ద్వంసం చేశారు. 
 
హుస్నాబాద్‌ గడ్డ.. గిరిజనుల అడ్డా
హుస్నాబాద్‌ ప్రాంతం గిరిజనుల తండాలకు నిలయం. ఇక్కడ దాదాపు 90 శాతం వరకు లంబాడ తండాలు ఉన్నాయి. ఈ తండాల్లో కనీసం మౌలిక సదుపాయాలు లేక గిరిజనులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 

ఇతర ముఖ్యాంశాలు

రజాకార్లపై రణభేరి మోగించిన అనభేరి
భూమి, భుక్తి, పేద ప్రజల బానిస విముక్తి కోసం రజాకార్లపై రణభేరి మోగించిన అనభేరి ప్రభాకర్‌రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డిల అసువులు బాసిన నేల హుస్నాబాద్‌ ప్రాంతం. రజాకార్ల చేతుల్లో తొలి ఎన్‌కౌంటర్‌ జరిగింది ఇక్కడే. 1948 మార్చి14న మహ్మదాపూర్‌లో అనభేరి ప్రభాకర్‌రావు దళం ఓ ఇంట్లో భోజనం చేసి గుట్టల ప్రాంతంలో విశ్రాంతి తీసుకుంటుండగా నిజాం పోలీసులైన రజాకార్లు ఒక్కసారిగా గుట్టల్ని చుట్టుముట్టారు. మహ్మదాపూర్‌ గుట్టల్లో ఉన్న ప్రభాకర్‌రావు దళంపై తుపాకి గుండ్ల వర్షం కురిపించారు. రజాకార్లకు, ప్రభాకర్‌రావు దళానికి మధ్య జరిగిన హోరాహోరీ పోరులో ప్రభాకర్‌రావు, ఆయన సహచరుడు భూపతిరెడ్డితో పాటుగా మరో 12 మంది నేలకొరిగారు. తెలంగాణ ప్రాంతంలోని కరీంనగర్‌ జిల్లాలో జరిగిన తొలి ఎన్‌కౌంటర్‌ ఇదే . ఈ ఎన్‌కౌంటర్‌లో సాయుధ దళం నేలకొరిగింది. 

వీడియోస్

ADVT